100 Trivia questions about Jesus Christ || Bible Quiz Questions About The Life of Jesus in Telugu || Trivia questions about Jesus in Telugu || Part-2

Author

Q ➤ 101.యేసయ్యను చూచి, సాగిలపడి ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొన్నది ఎవరు?


Q ➤ 102. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు అని అన్నది ఎవరు ?


Q ➤ 103.యేసయ్య ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు___ గడిపెను ?


Q ➤ 104.యేసయ్య తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి____ అను పేరు పెట్టెను?


Q ➤ 105.ప్రభావము యేసయ్యలో నుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను____ యత్నముచేసెను?


Q ➤ 106.యేసయ్య దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను_____ చేయుచుండెను?


Q ➤ 107. దయ్యములు వదలిపోయిన మనుష్యుడు____ కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండెను?


Q ➤ 108.సమాజ మందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి ఎవరి పాదములమీద పడెను?


Q ➤ 109. యేసయ్య యాయీరుతో భయపడవద్దు, ----------మాత్రముంచుమనెను?


Q ➤ 110.యేసయ్య యాయీరు కుమార్తె చెయ్యిపట్టుకొని చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు____ పెట్టుడని ఆజ్ఞాపించెను?


Q ➤ 111.యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు_____వారికనుగ్రహించెను?


Q ➤ 112.జనసమూహములు యేసయ్యను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, ను గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థపరచెను?


Q ➤ 113.యేసయ్య అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జన సమూహమునకు వడ్డించుటకై ఎవరికిచ్చెను ?


Q ➤ 114. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని యేసయ్య ఎవరి నడిగెను?


Q ➤ 115. మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి,ఎన్నవ దినమున లేచుట అగత్యమని యేసయ్య చెప్పెను?


Q ➤ 116.ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన ____ఎత్తికొని నన్ను వెంబడింపవలెనని యేసయ్య చెప్పెను?


Q ➤ 117. యేసయ్య పేతురును యోహానును ప్రార్థనచేయుటకు యాకోబును వెంటబెట్టుకొని,ఎక్కడికి వెళ్లెను?


Q ➤ 118.యేసయ్య ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయనవస్త్రములు ---------- వై ధగధగ మెరిసెను?


Q ➤ 119.కొండపై యేసయ్యతో ఇద్దరు పురుషులు మాటలాడుచుండిరి. వారు ఎవరు ?


Q ➤ 120.మోషే ఏలీయా మహిమతో అగపడి, యేసయ్య యెరూషలేములో నెరవేర్చబోవు___ను గూర్చి మాటలాడుచుండిరి?


Q ➤ 121.ఏలిన వాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, యేసయ్య తో అన్నది ఎవరు?


Q ➤ 122.ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని యేసయ్యతో. అన్నది ఎవరు?


Q ➤ 123.నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును _____నకు పాత్రుడు కాడని యేసయ్య చెప్పెను?


Q ➤ 124. యేసయ్య ఎంతమంది శిష్యులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను?


Q ➤ 125.ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, ___కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పిరి?


Q ➤ 126.దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు ___యందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని యేసయ్య శిష్యులతో చెప్పెను?


Q ➤ 127.బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని యేసయ్యను శోధించుచు అడిగింది ఎవరు?


Q ➤ 128.మార్త సహోదరి పేరు ఏమిటి?


Q ➤ 129.మార్త సహోదరియైన మరియ ఎక్కడ కూర్చుండి యేసయ్య బోధవినుచుండెను?


Q ➤ 130.మార్త____ పని పెట్టుకొనుటచేత తొందరపడెను?


Q ➤ 131.నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? అని యేసయ్య తో అన్నది ఎవరు?


Q ➤ 132. మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే అని అన్నది ఎవరు?


Q ➤ 133.యేసయ్య మార్తతో మరియ____ దానిని ఏర్పరచుకొ నెననెను?


Q ➤ 134.యేసయ్య శిష్యులలో ఒకడు ప్రభువా,యోహాను తన శిష్యులకు నేర్పి నట్టుగా మాకును____ చేయ నేర్పుమని ఆయన నడిగెను?


Q ➤ 135.యేసయ్య శిష్యులతో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి____ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను?


Q ➤ 136.యేసయ్య____ వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని జనులు చెప్పుకొనిరి?


Q ➤ 137.యేసయ్య జనులతో తనకుతానే విరోధమైన యిల్లు____ అనెను ?


Q ➤ 138.యేసయ్య జనులతో నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా____మీయొద్దకు వచ్చియున్నదనెను?


Q ➤ 139.జన సమూహములో నున్న యొక స్త్రీ యేసయ్యను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును__అయినవని కేకలు వేసి చెప్పెను?


Q ➤ 140. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు -----------అని యేసయ్య చెప్పెను?


Q ➤ 141.యేసయ్య భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని చూచి ఆశ్చర్యపడింది ఎవరు?


Q ➤ 142.మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. అని యేసయ్య ఎవరితో అనెను?


Q ➤ 143.మనుష్యకుమారునిమీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని, ___నుదూషించువానికి క్షమాపణ లేదు?


Q ➤ 144.యేసయ్య జనులతో ఒకని కలిమి విస్తరించుట వాని___ నకు మూలము కాదనెను ?


Q ➤ 145.యేసయ్య జనులతో చిన్న మందా భయపడకుడి, మీకు___ అనుగ్ర హించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నదనెను?


Q ➤ 146.యేసయ్య జనులతో - మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ____ ఉండుననెను ?


Q ➤ 147.యేసయ్య జనులతో మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరు ____ఉండుడని చెప్పెను?


Q ➤ 148.విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? అని యేసయ్య ఎవరినడిగెను?


Q ➤ 149.అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ.అని యేసయ్య ఎవరితో అనెను?


Q ➤ 150.ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో___ దూరుట సులభమని యేసయ్య చెప్పెను?


Q ➤ 151.యేసయ్య సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి, అని తలంచి కేకలు వేసిరి ?


Q ➤ 152. యేసయ్య దోనె యెక్కి శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు____ అణగెను ?


Q ➤ 153.ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి___ నాకు దూరముగా ఉన్నదనెను?


Q ➤ 154.ఎప్పతా అనే మాటకు అర్థం ఏమిటీ?


Q ➤ 155. యేసయ్య శిష్యులతో నేను అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడుగగా వారు ____అని ఆయనతో చెప్పిరి?


Q ➤ 156. యేసయ్య పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట ---------- పొందెను ?


Q ➤ 157.నమ్ముట నీవలననైతే, నమ్మువానికి___ సాధ్యమేయని యేసయ్య చెప్పెను?


Q ➤ 158.ఎవడైనను మొదటి వాడైయుండ గోరిన యెడల, వాడందరిలో కడపటివాడును అందరికి ___నై యుండవలెనని యేసయ్య చెప్పెను?


Q ➤ 159. నరకమున పురుగు చావదు;____ఆరదు ?


Q ➤ 160.మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు___గా ఉండుడని యేసయ్య చెప్పెను?


Q ➤ 161.యేసయ్య చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి వారిని ___?


Q ➤ 162.యేసయ్య మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూనిసద్బోధ కుడా,___ నకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను?


Q ➤ 163.యేసయ్య శిష్యులతో - తమ ఆస్తియందు నమ్మికయుంచువారు రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమనెను?


Q ➤ 164. యేసయ్య శిష్యులను చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి ------- సాధ్యమే అనెను?


Q ➤ 165.ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని యేసయ్య తో అన్నది ఎవరు?


Q ➤ 166.నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయ చేయుమని యేసయ్య ను అడిగింది ఎవరు?


Q ➤ 167. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీచేత అగునా? అని యేసయ్య ఎవరినడిగెను?


Q ➤ 168. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు___ చేయువాడై యుండవలెనని యేసయ్య శిష్యులతో చెప్పెను?


Q ➤ 169.యేసయ్య శిష్యులతో - మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి___ యుండవలెననెను?


Q ➤ 170. మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా____ క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను?


Q ➤ 171.యేసయ్య తన శిష్యులతోను బహు జన సమూహము తోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను____ త్రోవప్రక్కను కూర్చుండెను?


Q ➤ 172.ఈయన నజరేయుడైన యేసు అని బర్తిమయి విని దావీదు కుమారుడా యేసూ, నన్ను ____అని కేకలు వేయ మొదలుపెట్టెను?


Q ➤ 173.యేసయ్య పిలువగా బర్తిమయి__ పారవేసి, దిగ్గున లేచి యేసయ్య నొద్దకు వచ్చెను?


Q ➤ 174.యేసయ్య బర్తిమయితో - నేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడుగగా, ఆ గ్రుడ్డివాడుబోధకుడా, నాకు --------------కలుగజేయుమని ఆయనతో అనెను?


Q ➤ 175.యేసయ్య బర్తిమయితో -నీవు వెళ్లుము; నీ ___నిన్ను స్వస్థపరచెనని చెప్పెను?


Q ➤ 176.యేసయ్య తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే___ గాడిద పిల్ల ఒకటి కనబడును దానిని విప్పి, తోలుకొని రండనెను?


Q ➤ 177.గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ ----- దానిపై వేయగా యేసయ్య దానిమీద కూర్చుండెను?


Q ➤ 178.హోసన్నా అనే మాటకు అర్థం ఏమిటీ?


Q ➤ 179.యేసయ్య బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిర మనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని____ చేసితిరనెను ?


Q ➤ 180.శాస్త్రులును ప్రధానయాజకులును యేసయ్య మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని ____చూచుచుండిరి?


Q ➤ 181.బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని యేసయ్యతో అన్నది ఎవరు ?


Q ➤ 182.ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు___ అని చెప్పెను?


Q ➤ 183.మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని ___?


Q ➤ 184.నీవు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెను అని యేసయ్యను అడిగింది ఎవరు ?


Q ➤ 185. ---------- రీతిగా యేసయ్య ప్రజలకు బోధించెను?


Q ➤ 186.ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, దానిని ఎవరికి గుత్తకిచ్చి దేశాంతరముపోయెను ?


Q ➤ 187.ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు ____రాయి ఆయెను?


Q ➤ 188.యేసయ్యను మాటలలో చిక్కుపరచ వలెనని, హేరోదీయులను కొందరిని యేసయ్య యొద్దకు పంపింది ఎవరు?


Q ➤ 189. పునరుత్థానము లేదని చెప్పెడివారు ఎవరు?


Q ➤ 190. నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 191.నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ____వలన చెప్పెను?


Q ➤ 192.సామాన్యజనులు యేసయ్య మాటలు___ తో వినుచుండిరి?


Q ➤ 193.జనసమూహము___ లో డబ్బులు వేయుట యేసయ్య చూచుచుండెను?


Q ➤ 194. ఒక బీద విధవరాలు వచ్చి ఎన్ని కాసులు వేయగా యేసయ్య చూచెను?


Q ➤ 195.కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 196.జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే ___లకు ప్రారంభమనెను ?


Q ➤ 197.నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే____ పొందుననెను?


Q ➤ 198.యేసయ్య శిష్యులతో - ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై____ అగపరచెదరనెను ?


Q ➤ 199. మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను ____అయి వచ్చుట చూచెదరనెను?


Q ➤ 200.యేసయ్య శిష్యులతో ఆకాశమును భూమియును గతించును గాని నా____ గతింపవనెను ?