1➤ ఏ సువార్త రచయిత ఒక వైద్యుడు?
,=> లూకా
2➤ లూకా తన సువార్తను ఎవరికి అంకితం చేశాడు?
,=> థియొఫిలా (1:1,3)
3➤ థెమీఫిలా పేరుకు అర్థం ఏమిటి?
,=> దేవుని స్నేహితుడు (1:1,3)
4➤ హేరోదుకాలంలో జీవించిన యాజకుడు ఎవరు?
,=> జెకర్యా (1:5)
5➤ జెకర్యా ఏ యాజక తరగతికి చెందినవాడు?
,=> అబీయా (1:5)
6➤ జెకర్యా మామగారు ఎవరు?
,=> అహరోను (1:5)
7➤ జెకర్యా భార్య ఎవరు?
,=> ఎలీసబెతు (1:5)
8➤ ఏ యాజకుని భార్య గొడ్రాలు?
,=> జెకర్యా (1:7)
9➤ 'నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> జెకర్యాతో గబ్రియేలుదూత చెప్పాడు (1:14)
10➤ ఏలీయాయొక్క ఆత్మ, శక్తితో పంపబడినది ఎవరు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (1:17)
11➤ జెకర్యాతో మాట్లాడిన దేవుని దూత ఎవరు?
,=> గబ్రియేలు (1:19)
12➤ తల్లిగర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడిందెవరు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (1:16)
13➤ దూత మాటలను నమ్మనందుకు మూగ వ్యక్తిగా మారిందెవరు?
,=> జెకర్యా (1:20)
14➤ యోసేపు ఏ వంశానికి చెందినవాడు?
,=> దావీదు వంశం (1:27)
15➤ 'దయాప్రాప్తురాలా' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> మరియతో దూత చెప్పాడు (1:27,28)
16➤ గొప్పవాడైన సర్వోన్నతుని కుమారుడు అని ఎవరు పిలువబడుతారు?
,=> యేసు (1:32)
17➤ దావీదు సింహాసనమునకు రాజు ఎవరు?
,=> యేసు (1:32)
18➤ ఎవరి రాజ్యానికి అంతం లేదు?
,=> యేసు (1:33)
19➤ బాప్తిస్మమిచ్చు యోహాను తల్లి ఎవరు?
,=> ఎలీసబెతు (1:36)
20➤ “దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదు' అని ఎవరితో ఎవరు చెప్పారు?
,=> మరియతో గబ్రియేలు దూత చెప్పాడు (1:37)
21➤ 'ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాటచొప్పున నాకు జరుగునుగాక' అని ఎవరు చెప్పారు?
,=> మరియ (1:38)
22➤ జెకర్యా ఇంటికి వెళ్ళి ఎలీసబెతుకు వందనాలు చెప్పిందెవరు?
,=> మరియ (1:39,40)
23➤ ఎవరి గర్భంలో శిశువు గంతులు వేశాడు?
,=> ఎలీసబెతు (1:41)
24➤ 'ఇది మొదలుకొని అన్ని తరములవారును నన్ను ధన్యురాలని యందురు' అని ఎవరు చెప్పారు?
,=> మరియ (1:48)
25➤ 'సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను' అని ఎవరు చెప్పారు?
,=> మరియ (1:49)
26➤ బాప్తిస్మమిచ్చు యోహానుకు ఏ పేరు పెట్టాలని బంధువులు ఆశించారు?
,=> జెకర్యా (1:59)
27➤ పలకమీద తన కుమారుని పేరు వ్రాసిందెవరు?
,=> జెకర్యా (1:63)
28➤ పరిశుద్ధాత్మతో నింపబడి క్రొత్త నిబంధనలో మొదటిసారి ప్రవచించిన యాజకుడు ఎవరు?
,=> జెకర్యా (1:67)
29➤ ఆత్మలో బలంతో ఎదిగిన మొదటి శిశువు ఎవరు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (1:80)
30➤ ఇశ్రాయేలుకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనేంతవరకు బాప్తిస్మమిచ్చు యోహాను ఎక్కడ ఉన్నాడు?
,=> అరణ్యంలో (1:80)
31➤ సర్వలోకంలో ప్రజాసంఖ్యను వ్రాయాలని ఆజ్ఞాపించిందెవరు?
,=> కైసరు ఔగుస్తు (2:1)
32➤ యేసు పుట్టినప్పుడు సిరియా దేశానికి అధిపతి ఎవరు?
,=> కురేనియు (2:2)
33➤ మొదటి క్రిస్మస్ పాటను పాడిందెవరు?
,=> దూతలు (2:13,14)
34➤ దావీదు ఊరిగా పేర్కొనబడిన పట్టణం ఏది?
,=> బెల్లెహేము (2:5)
35➤ దూతలద్వారా యేసు పుట్టుకను గురించిన వార్త మొదటిగా ఎవరికి అందింది?
,=> గొర్రెల కాపరులు (2:8-10)
36➤ క్రీస్తు అనగా అర్థమేమిటి?
,=> అభిషిక్తుడు (2:11)
37➤ యేసును చూడటానికి మొదట వచ్చిందెవరు?
,=> గొర్రెల కాపరులు (2:16)
38➤ శిశువుకు యేసు అని నామకరణం ఎప్పుడు చేయబడింది?
,=> ఎనిమిదవ రోజు (2:21)
39➤ ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టిన నీతిమంతుడు, భక్తిపరుడు ఎవరు?
,=> సుమెయోను (2:25)
40➤ ప్రభువుయొక్క క్రీస్తును చూడక ముందే మరణించడని ఎవరికి బయలుపరచ బడింది?
,=> సుమెయోను (2:26)
41➤ ఆత్మవశుడై దేవాలయానికి వచ్చిందెవరు?
,=> సుమెయోను (2:26)
42➤ ‘యిప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు' అని ఎవరు చెప్పారు?
,=> సుమెయోను (2:29)
43➤ 'నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని'. ఇవి ఎవరి మాటలు?
,=> సుమెయోను (20:32)
44➤ ఇశ్రాయేలులో అనేకులు పడుటకును, తిరిగి లేచుటకును దేవునిచేత నియమించబడినది ఎవరు?
,=> యేసు (2:34)
45➤ 'నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవును' అని ఎవరితో ఎవరు చెప్పారు?
,=> మరియతో సుమెయోను చెప్పాడు (2:35)
46➤ క్రొత్త నిబంధనలో లూకా ప్రస్తావించిన ప్రవక్తిని పేరు పేమిటి?
,=> అన్న (2:36)
47➤ యేసు ప్రతిష్ఠిత ఆరాధనకు హాజరైన ప్రవక్తిని పేరు ఏమిటి?
,=> అన్న (2:36,38)
48➤ అన్న ప్రవక్తిని తండ్రి ఎవరు?
,=> పనూయేలు (2:36)
49➤ అన్న ఏ గోత్రానికి చెందినది?
,=> ఆషేరు గోత్రం (2:36)
50➤ 84 సంవత్సరాలపాటు విధవరాలిగా జీవించిన ప్రవక్తిని ఎవరు?
,=> అన్న (2:36)
51➤ దేవాలయం విడువకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవించిన స్త్రీ ఎవరు?
,=> అన్న (2:37)
52➤ తన హృదయంలో యేసు గురించిన సంగతులను భద్రంగా పెట్టుకొందెవరు?
,=> మరియ (2:51)
53➤ దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్థిల్లినదెవరు?
,=> యేసు (2:52)
54➤ తిబెరికైసరు ఏలుబడిలో యూదయకు అధిపతి ఎవరు?
,=> పొంతి పిలాతు (3:1)
55➤ తిబెరికైసరు ఏలుబడి కాలంలో గలిలయను పాలించింది ఎవరు?
,=> హేరోదు (3:1)
56➤ ఫిలిప్పు ఎక్కడ పాలించాడు?
,=> ఇతూరయ (3:1)
57➤ అబిలేనే దేశానికి అధిపతి ఎవరు?
,=> లుసానియ (3:1)
58➤ తిబెరికైసరు ఏలుబడి కాలంలో ప్రధాన యాజకులు ఎవరు?
,=> అన్న, కయప (8:2
59➤ ఎక్కడనుండి యోహానువద్దకు దేవుని వాక్యం వచ్చింది?
,=> అరణ్యం (3:2)
60➤ 'సకల శరీరులు దేవుని రక్షణ చూతురు' అని ఎవరు ప్రవచించారు?
,=> యెషయా (3:6)
61➤ బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినవారిని 'సర్పసంతానమా' అని పిలిచింది ఎవరు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (3:7)
62➤ ఎవరు బాప్తిస్మం పొంది ప్రార్థించినప్పుడు ఆకాశం తెరువబడింది?
,=> యేసు (3:21)
63➤ యేసు బహిరంగ పరిచర్యను మొదలు పెట్టినప్పుడు ఆయన వయస్సు ఎంత?
,=> ముప్పయి సంవత్సరాలు (3:23)
64➤ లూకా మాటల ప్రకారం ఆదాము ఎవరి కుమారుడు?
,=> దేవుని కుమారుడు (3:38)
65➤ 'ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> యేసుతో సాతాను చెప్పాడు (4:6)
66➤ యేసు ఎక్కడ పెరిగాడు?
,=> నజరేతు (4:16)
67➤ సమాజ మందిరంలో యేసు ఏ గ్రంథాన్ని చదివాడు?
,=> యెషయా గ్రంథం (4:17)
68➤ నజరేతులోని సమాజ మందిరంలో యేసు చెప్పిన సామెత ఏమిటి?
,=> 'వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము' (4:23)
69➤ 'ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను' అని చెప్పిందెవరు?
,=> యేసు (4:23,24)
70➤ ఏ ప్రవక్త కాలంలో మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి దేశమంతా గొప్ప కరువు సంభవించింది?
,=> ఏలీయా ప్రవక్త (4:25)
71➤ కొండపేటునుండి యేసును తలక్రిందులు పడేయాలని భక్తులు ఏ స్థలంలో ప్రయత్నించారు?
,=> నజరేతు (4:16,29)
72➤ గలిలయ సముద్రానికి గల మరో పేరు ఏమిటి?
,=> గెన్నేసంతు సరస్సు (5:1)
73➤ ఎవరి పడవలో యేసు ఎక్కి ప్రజలతో మాట్లాడాడు?
,=> సీమోను పడవ (5:3)
74➤ చేపలను పట్టడానికి వలలను వేయుమని చెప్పిందెవరు?
,=> యేసు (5:4)
75➤ “ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు” అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> యేసుతో సీమోను చెప్పాడు (5:5)
76➤ 'ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను' అని ఎవరు చెప్పారు?
,=> పేతురు (5:8)
77➤ యేసుకోసం గొప్ప విందును సిద్ధపరిచింది ఎవరు?
,=> లేవి (5:29)
78➤ రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర లేదు' అని ఎవరు చెప్పారు?
,=> యేసు (5:31)
79➤ యేసు తన శిష్యులకు ఏమని పేరు పెట్టాడు?
,=> అపొస్తలులు (6:13)
80➤ యేసు బోధను వినడానికి, తమ రోగాలను నయం చేసుకోవడానికి ప్రజలు ఏ సముద్రతీరం నుండి వచ్చారు?
,=> తూరు, సీవోను (6:17)
81➤ పరిపూర్ణంగా శిక్షణ పొందిన శిష్యుడు ఎవరివలె ఉంటాడు?
,=> బోధకునివలె (6:40)
82➤ పునాది లేకుండా భూమిపై ఇల్లు కట్టుకొనేవాడు ఎవనివలె ఉంటాడు?
,=> వాక్యం విని పాటించనివాడు (6:49)
83➤ 'నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను' అని ఎవరు చెప్పారు?
,=> శతాధిపతి (7:6)
84➤ యేసుచేత మరణంనుండి విధవరాలి కుమారుడు లేపబడ్డాడు. అయితే ఆమె స్వంత ఊరు ఏమిటి?
,=> నాయీను (7:11,15)
85➤ నాయీను ఊరిలో యేసు చేసిన అద్భుతం ఏమిటి?
,=> మరణించిన విధవరాలి కుమారుని లేపడం (7:13)
86➤ బాప్తిస్మాన్ని దేవుని సంకల్పంగా ప్రస్తావించిన సువార్త ఏది?
,=> లూకా (7:30)
87➤ దేవుని సంకల్పాన్ని నిరాకరించింది ఎవరు?
,=> పరిసయ్యులు, ధర్మశాస్తోపదేశకులు (7:30)
88➤ యేసును భోజనానికి ఆహ్వానించిన పరిసయ్యుని పేరు ఏమిటి?
,=> సీమోను (7:36, 40)
89➤ ఏ స్త్రీనుండి ఏడు దయ్యాలను యేసు వెళ్ళగొట్టాడు?
,=> మగ్దలేనే మరియ (8:2)
90➤ హేరోదు గృహ నిర్వాహకుడు ఎవరు?
,=> కూజా (8:2)
91➤ యేసుకు సేవ చేసిన కూజా భార్య ఎవరు?
,=> యోహన్న (8:2)
92➤ ఏ సమాజ మందిర అధికారి కూతురుని యేసు మరణంనుండి లేపాడు?
,=> యాయీరు (8:40)
93➤ యాయీరు కుమార్తెను మరణం నుండి లేపినప్పుడు ఆమె వయస్సు ఎంత?
,=> పన్నెండు ఏళ్ళు (8:42)
94➤ ఐదు రొట్టెలు, రెండు చేపలతో యేసు ఎంత మందిని పోషించాడు?
,=> ఐదువేలమంది పురుషులు (9:14,15)
95➤ మహిమలో ప్రత్యక్షమై యెరూషలేములో యేసు నెరవేర్చాల్సినదాని గురించి ఆయనతో మాట్లాడిందెవరు?
,=> మోషే, ఏలీయా (9:30,31)
96➤ యేసు ఎవరిని 'కుమారీ' అని పిలిచాడు?
,=> రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ (8:48)
97➤ ఏ ప్రాంతస్థులు యేసును చేర్చుకోలేదు?
,=> సమరయ (9:51-53)
98➤ 'ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమజ్ఞాపించుట నీకిష్టమా' అని ఎవరు యేసును అడిగారు?
,=> యాకోబు, యోహాను (9:54)
99➤ తలవాల్చుకోవడానికైన స్థలం లేనిది ఎవరికి?
,=> మనుష్య కుమారునికి (9:58)
100➤ 'నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు' అని ఎవరు చెప్పారు?
,=> యేసు (9:62)
101➤ పన్నెండుమంది కాకుండా యేసుకు మరెంత మంది శిష్యులున్నారు?
,=> డెబ్బైమంది (10:1)
102➤ మంచి సమరయుని గురించి ఏ అధ్యాయం ప్రస్తావిస్తుంది?
,=> లూకా 10వ అధ్యాయం
103➤ పనివాడు తన జీతమునకు పాత్రుడని ఎవరు చెప్పారు?
,=> యేసు (10:7)
104➤ మెరుపువలె ఆకాశంనుండి క్రింద పడిందెవరు?
,=> సాతాను (10:18)
105➤ 'బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి?' అని ఎవరు యేసును అడిగారు?
,=> ధర్మశాసోపదేశకుడు (10:25)
106➤ 'ఆలాగు చేయుము. అప్పుడు జీవించెదవు' అని ఎవరితో యేసు చెప్పాడు?
,=> ధర్మశాస్తోపదేశకుడు (10:28)
107➤ ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కినప్పుడు అతడు ఎక్కడికి వెళ్తున్నాడు?
,=> యెరికో పట్టణం (10:30)
108➤ దొంగలచేతిలో చిక్కిన వ్యక్తిమీద ఎవరు జాలిపడ్డారు?
,=> సమరయుడు (10:33,34)
109➤ మార్త సహోదరి ఎవరు?
,=> మరియ (10:39)
110➤ యేసు పాదాలవద్ద కూర్చొని ఆయన బోధ విన్నదెవరు?
,=> మరియ (10:39)
111➤ అనేక పనులగురించి విచారం కలిగి తొందరపడింది ఎవరు?
,=> మార్త (10:41)
112➤ ఉత్తమమైన దానిని ఎవరు ఏర్పరచుకొన్నారు?
=> మరియ (10:42)
1➤ తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక' అని మొదలయ్యే ప్రార్ధనను ఎవరు నేర్పించారు?
,=> యేసు (11:2)
2➤ ఎవరు సూచకక్రియ కోసం వెదుకుతున్నారు?
,=> దుష్టతరం (11:29)
3➤ ఈ తరమువారికి ఎవరు సూచనగా ఉన్నారు?
,=> మనుష్యకుమారుడు (11:30)
4➤ సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమికొననుండి వచ్చినదెవరు?
,=> దక్షిణదేశపు రాణి (11:31)
5➤ నీ దేహమంతా వెలుగుమయమై ఉండాలంటే ఏది తేటగా ఉండాలి?
,=> కన్ను (11:34)
6➤ 'నీలోనుండు వెలుగు చీకటియై యుండకుండ చూచుకొనుము' అని ఎవరు చెప్పారు?
,=> యేసు (11:35)
7➤ న్యాయాన్ని, దేవుని ప్రేమను విడిచిపెట్టినదెవరు?
,=> పరిసయ్యులు (11:42)
8➤ సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను, సంతవీధుల్లో వందనాలను కోరుకొన్నది ఎవరు?
,=> పరిసయ్యులు (11:43)
9➤ పరిసయ్యుల పులిసిన పిండి ఏమిటి?
,=> వేషధారణ (12:1)
10➤ జ్ఞానమను తాళపు చెవిని ఎత్తికొనిపోయింది ఎవరు?
,=> ధర్మశాసోపదేశకులు (11:52)
11➤ అనుకోని గడియలో మనుష్యకుమారుడు వస్తాడు గనుక మనం ఏమి చేయాలి?
,=> సిద్ధంగా ఉండాలి (12:40)
12➤ తన యజమాని చిత్తం ఎరిగియుండినా, తన్నుతాను సిద్ధపరచుకోనివాడు ఏమి పొందుకొంటాడు?
,=> అనేకమైన దెబ్బలు (12:47)
13➤ 'నేను పొందవలసిన బాప్తిస్మమున్నది' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> తన శిష్యులతో యేసు చెప్పాడు (12:50)
14➤ ఒకవేళ పడమటినుండి మబ్బుపైకి లేస్తుందంటే, ఏమి రాబోతుంది?
,=> వర్షం (12:54)
15➤ తమ బలులతో గలిలయుల రక్తాన్ని కలిపిందెవరు?
,=> పిలాతు (13:1)
16➤ ఏ స్థలంలో గోపురంపడి అనేకమంది చనిపోయారు?
,=> సిలోయము (13:4)
17➤ సిలోయములోని గోపురం క్రింద పడి ఎంతమంది చనిపోయారు?
,=> 18మంది (13:4)
18➤ బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ ఎన్ని సంవత్సరాలనుండి జబ్బుతో ఉంది?
,=> పద్దెనిమిది సంవత్సరాలు (13:11)
19➤ సాతాను బంధించిన స్త్రీ ఎవరి కుమార్తె?
,=> అబ్రాహాము (13:16)
20➤ ఎవరిని యేసు నక్కగా సంబోధించాడు?
,=> హేరోదు (13:31,32)
21➤ ఎవరు హెచ్చింపబడుతారు?
,=> తన్నుతాను తగ్గించుకొనువాడు (14:11)
22➤ ఎవరైనా తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించకపోతే, అతడు దేనినుండి దూరమవుతాడు?
,=> శిష్యత్వం (14:27)
23➤ తప్పిపోయిన కుమారుని ఉపమానం ఏ అధ్యాయంలో ఉంది?
,=> లూకా 15వ అధ్యాయం
24➤ ఎప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం ఉంటుంది?
,=> ఒక పాపి మారుమనస్సు పొందినప్పుడు (15:7)
25➤ 'తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగా, నీయెదుటను పాపము చేసితిని' అని ఎవరు చెప్పారు?
,=> తప్పిపోయిన కుమారుడు (15:21)
26➤ ఈ తరంలోనిలోకసంబంధులు ఎవరికంటే ఎక్కువ యుక్తిపరులై యున్నారు?
,=> వెలుగు సంబంధులకంటే (16:8)
27➤ ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరు?
,=> దేవుడు, సిరి (16:13)
28➤ ఎవరి కాలంవరకు ధర్మశాస్త్రం, ప్రవక్తలు ప్రకటించారు?
,=> యోహాను కాలంవరకు (16:16)
29➤ ధర్మశాస్త్రంలో ఒక పొల్లయిన తప్పిపోవుట కంటే ఏది గతించి పోవుట సులభం?
,=> ఆకాశం, భూమి గతించుట (16:17)
30➤ ధనవంతుని ఇంటి వాకిట పడియున్న బీదవాని పేరు ఏమిటి?
,=> లాజరు (16:20)
31➤ ధనవంతునిబల్లమీదనుండి పడిన రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలని ఆశించింది ఎవరు?
,=> లాజరు (16:21)
32➤ లాజరు మరణించిన తరువాత దూతలు అతన్ని ఎక్కడికి మోసుకెళ్ళారు?
,=> అబ్రహాము రొమ్మువద్దకు (16:22)
33➤ ధనవంతుడు మరణించిన తరువాత అతడు ఎక్కడికి వెళ్ళాడు?
,=> పాతాళ అగ్నిలోకి (16:23)
34➤ ధనవంతునికి ఎంతమంది సహోదరులున్నారు?
,=> ఐదుగురు (16:27)
35➤ 'వారియొద్ద మోషేయు, ప్రవక్తలును ఉన్నారు, వారి మాటలు వినవలెను' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> ధనవంతునితో అబ్రాహాము చెప్పాడు (16:29)
36➤ ఒక సహోదరుడు తప్పిదం చేస్తే, మనం ఏమి చేయాలి?
,=> అతన్ని గద్ధించాలి (17:3)
37➤ తమ విశ్వాసాన్ని వృద్ధిపొందించమని ఎవరు యేసును అడిగారు?
,=> అపొస్తలులు (17:5)
38➤ పదిమంది కుష్ఠరోగులను ఎక్కడ యేసు శుద్ధిచేశాడు?
,=> సమరయ గలిలయకు మధ్య ఉన్న గ్రామం (17:11-19)
39➤ శుద్ధులైన పదిమంది కుష్ఠరోగుల్లో నుండి ఒకడు యేసువద్దకు వచ్చి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. అతడు ఏ స్థలానికి చెందినవాడు?
,=> సమరయ (17:16)
40➤ నోవహు దినములలో జరిగినట్లు ఎవరి దినములలో జరుగును?
,=> మనుష్య కుమారుని దినములలో (17:26)
41➤ యేసు మాటల ప్రకారం మనం ఎవరి భార్యను జ్ఞాపకం చేసుకోవాలి?
,=> లోతుభార్య (17:32)
42➤ విసుకక నిత్యము ప్రార్ధన చేయాలని ఎవరు చెప్పారు?
,=> యేసు (18:1)
43➤ తన గురించి తానే అతిశయిస్తూ ప్రార్థించిందెవరు?
,=> పరిసయ్యుడు (18:12)
44➤ ఎవరైనా నిత్యజీవానికి వారసులు కావాలంటే, ఏమి చేయాలి?
,=> ప్రభువు ఆజ్ఞలు పాటించాలి (18:18-20)
45➤ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎవరికి దుర్లభం?
,=> ఆస్థిగలవారికి (18:24)
46➤ జక్కయ్య ఎవరు?
,=> సుంకరి (19:1)
47➤ పొట్టిగా ఉన్న ప్రధాన సుంకరియైన ధనవంతుని పేరు ఏమిటి?
,=> జక్కయ్య (19:2,3)
48➤ ఏ పట్టణంలో యేసు జక్కయ్యను కనుగొన్నాడు?
,=> యెరికో (19:1,3)
49➤ యేసును చూడటానికి జక్కయ్య ఏ చెట్టెక్కాడు?
,=> మేడి చెట్టు (19:4)
50➤ 'నేడు నేను నీ యింటనుండవలసియున్నది' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> జక్కయ్యతో యేసు చెప్పాడు (19:5)
51➤ తాను ఎవరివద్దనైన అన్యాయంగా తీసుకొంటే, దానికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తానని ఎవరు వాగ్దానం చేశారు?
,=> జక్కయ్య (19:8)
52➤ నశించినదానిని వెదకి రక్షించడానికి ఎవరు వచ్చారు?
,=> మనుష్యకుమారుడు (19:10)
53➤ ఎవరు గాడిదమీద కూర్చొని ప్రయాణించారు?
,=> యేసు (19:36)
54➤ ఏ పట్టణం విషయంలో యేసు ఏడ్చాడు?
,=> యెరూషలేము (19:41)
55➤ 'నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు' అని ఎవరి గురించి చెప్పబడింది?
,=> యెరూషలేము (19:42)
56➤ 'కైసరువికైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి' అని ఎవరు చెప్పారు?
,=> యేసు (20:25)
57➤ పునరుత్థానాన్ని నమ్మనిది ఎవరు?
,=> సద్దూకయ్యులు (20:27)
58➤ ఓర్పుతో ఏమి దక్కించుకోవచ్చును?
,=> ప్రాణం (21:19)
59➤ ప్రభావముతోను, మహా మహిమతోను మేఘారూఢుడై ఎవరు వస్తున్నారు?
,=> మనుష్య కుమారుడు (21:27)
60➤ 'ఆకాశమును, భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు' అని ఎవరు చెప్పారు?
,=> యేసుక్రీస్తు (21:33)
61➤ పులియని రొట్టెల పండుగకు మరో పేరు ఏమిటి?
,=> పస్కా (22:1)
62➤ ఏ శిష్యుని జీవితంలో సాతాను ప్రవేశించింది?
,=> ఇస్కరియోతు యూదా (22:3)
63➤ పస్కా విందును సిద్ధపరచడానికి యేసు ఎవరిని పంపాడు?
,=> పేతురు, యోహాను (22:8)
64➤ “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> అపొస్తలులతో యేసు చెప్పాడు (22:19)
65➤ గోధుమలవలె జల్లించడానికి సాతాను ఎవరిని కోరుకొంది?
,=> సీమోను (22:31)
66➤ ఎవరి విశ్వాసం తప్పిపోవద్దని యేసు ప్రార్థించాడు?
,=> పేతురు (22:32)
67➤ యేసుతోకూడ చెరలోనికి, మరణించడానికి సిద్ధముగా ఉన్నానని ఎవరు చెప్పారు?
,=> పేతురు (22:33)
68➤ ఎవరి చెమట నేలమీద పడుతున్న గొప్ప రక్త బిందువులవలె మారాయి?
,=> యేసు (22:44)
69➤ యూదులు యేసును పట్టుకొన్నప్పుడు ఆయన చేసిన అద్భుతం ఏమిటి?
,=> ప్రధాన యాజకుని దాసుని చెవిని ముట్టి స్వస్థపరిచాడు (22:51)
70➤ మహాత్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యేది ఎవరు?
,=> మనుష్య కుమారుడు (22:69)
71➤ యేసును చూచినప్పుడు మిక్కిలి సంతోషించినదెవరు?
,=> హేరోదు (23:8)
72➤ ‘అంతకుముందు...ఒకనికొకడు శత్రువులై యున్నారు' వారెవరు?
,=> హేరోదు, పిలాతు (23:12)
73➤ పట్టణంలో అల్లరి చేసినందుకు, నరహత్య చేసినందుకు చెరసాలలో బంధించబడినది ఎవరు?
,=> బరబ్బ (23:25)
74➤ సిలువ మీద యేసు ఉన్నప్పుడు ఆయన ఎన్ని మాటలు పలికాడు?
,=> ఏడు మాటలు
75➤ 'నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> సిలువ మీదున్న నేరస్థునితో యేసు చెప్పాడు. (23:43)
76➤ 'ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెను' అని ఎవరు చెప్పారు?
,=> శతాధిపతి (23:47)
77➤ ఎమ్మాయి గ్రామానికి యెరూషలేము ఎంత దూరంలో ఉంది?
,=> ఆమడ దూరంలో (7 మైళ్ళు) (24:13)
78➤ ఎమ్మాయి మార్గంలో యేసుతోపాటు ప్రయాణించిన వారిలో ఒక వ్యక్తి పేరు ఏమిటి?
,=> క్లియోపా (24:18)
79➤ క్రియలోను, వాక్యములోను శక్తిగల ప్రవక్త పేరు?
,=> యేసు (24:19)
80➤ ఏమి గ్రహించాలని యేసు తన శిష్యుల మనస్సులను తెరిచాడు?
,=> లేఖనాలను (24:45)
81➤ 'మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడి' అని ఎవరితో ఎవరు చెప్పారు?
,=> శిష్యులతో యేసు చెప్పాడు (24:49)
82➤ యేసు పరలోకానికి ఆరోహణం కాకముందు ఎక్కడ ఆయన తన చేతులెత్తి శిష్యులను దీవించాడు?
,=> బేతనియ (24:50)
83➤ యేసు ఆరోహణం తరువాత శిష్యులు ఎక్కడికి వెళ్ళారు?
=> యెరూషలేము (24:52)