Telugu bible quiz questions and answers from John
యోహాను సువార్తలో మూల వచనం ఏది? (3:16)
నాలుగవ సువార్త రచయిత ఎవరు? యోహాను
ఆదియందు వాక్యం ఏమైయున్నది? దేవుడు (1:1)
బాప్తిస్మమిచ్చు యోహానును ఎవరు పంపారు? దేవుడు (1:6)
వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి ఎవరు దేవునిచేత పంపబడ్డారు?
బాప్తిస్మమిచ్చు యోహాను (1:7)
తనను అంగీకరించే వారందరికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఎవరు
అనుగ్రహించారు? యేసు (1:12)
శరీరధారియైన వాక్యం ఎవరు? యేసు (1:14)
ఎవరిద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది? మోషే (1:17)
బాప్తిస్మమిచ్చు రాకడను గురించి ఎవరు ప్రవచించారు? యెషయా (1:23)
యేసుక్రీస్తు గురించి అంద్రియ మొదట ఎవరితో చెప్పాడు? పేతురు (1:41)
కేఫా అని యేసు ఎవరిని పిలిచాడు?పేతురు (1:42)
'కేఫా' అను మాటకు అర్థం ఏమిటి? రాయి (1:42)
ఫిలిప్పు ఏ ప్రాంతానికి చెందినవాడు? బేత్సయిదా (1:44)
యేసును గురించి నతానియేలుతో ఎవరు పంచుకొన్నారు? ఫిలిప్పు (1:45)
573. 'నతానియేలు' పేరుకు అర్థం ఏమిటి? దేవుడు ఇచ్చాడు (1:46)
574. 'నజరేతులోనుండి మంచిదేదైనా రాగలదా?' అని ఎవరు అడిగారు?నతానియేలు (1:46)
575. 'ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమునులేదు' అని ఎవరి గురించి యేసు చెప్పాడు? నతానియేలు (1:47)
576. అంజూరపు చెట్టు క్రింద కూర్చొన్నప్పుడే యేసు ఎవరిని చూశాడు?నతానియేలు (1:48)
577. వివాహోత్సవానికి యేసు, ఆయన శిష్యులు ఎక్కడికి ఆహ్వానించబడ్డారు?కానా (2:1)
కానా ఊరు ఎక్కడ ఉంది? గలిలయలో (2:1)
579. ఎక్కడ యేసు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు?గలిలయలోని కానా ఊరులో (2:1)
580. సూచక క్రియల్లో మొదటిగా యేసు చేసిన అద్భుతం ఏది?
నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం (2:11)
581. గలిలయలోని కానా ఊరినుండి యేసు ఎక్కడికి వెళ్ళాడు?
కపెర్నహూము (2:12)
582. యెరూషలేము మందిర నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
46 సంవత్సరాలు (2:20)
583. యూదుల అధికారియైన పరిసయ్యుడు ఎవరు? నీకొదేము (3:1)
584. నీకొదేము పేరుకు అర్థం ఏమిటి? జయశాలి (3:1)
585. దేవుని రాజ్యం చూడాలంటే ఏమి చేయాలి? క్రొత్తగా జన్మించాలి (3:3)
586. నీటి మూలంగా, ఆత్మమూలంగా జన్మించాలని యేసు ఎవరితో చెప్పాడు?
నీకొదేము (3:5)
587. 'ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు?' అని ఎవరు ఎవరిని
అడిగారు? యేసును నీకొదేము అడిగాడు (3:4)
588. యేసువద్దకు వచ్చిన ఇశ్రాయేలీయుల బోధకుడు ఎవరు? నీకొదేము (3:10)
589. పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు? మనుష్యకుమారుడు (3:13)
590. అరణ్యంలో సర్పాన్ని ఎత్తి పట్టిందెవరు? మోషే (3:14)
591. ఎవరైనా అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచితే,
అతడు ఏమి పొందుకొంటాడు? నిత్యజీవం (3:16)
592. ఎందుకు దేవుడు తన కుమారున్ని ఈ లోకంలోకి పంపాడు?
ఆయనద్వారా రక్షణ పొందడానికి (3:17)
593. 'ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది' అని ఎవరు
చెప్పారు? బాప్తిస్మమిచ్చు యోహాను (3:22-30)
యోహాను
594. ప్రజలకు బాప్తిస్మం ఇవ్వడానికి తన శిష్యులతో పాటు యేసు ఎక్కడికి
వెళ్ళాడు? యూదయ దేశం (3:22)
595. యూదయ దేశంలో యేసు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను
ప్రజలకు బాప్తిస్మం ఎక్కడ ఇచ్చాడు? ఐనో అను స్థలంలో (3:23)
596. కుమారునియందు విశ్వాసముంచని వానిమీదికి ఏమి వస్తుంది?
దేవుని ఉగ్రత (3:36)
597. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి ఎక్కడ ఉంది?
సుఖారు (4:5)
598. ఏ ఊరిలో యేసు సమరయ స్త్రీతో మాట్లాడాడు? సుఖారు (4:5)
599. యాకోబు బావి ఎక్కడ ఉంది? సుఖారను ఊరిలో (4:5,6)
'మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి' అని సమరయ స్త్రీ యేసుతో
చెప్పింది. ఆ పర్వతం ఏది?
గిరిజీము కొండ (4:20; ద్వితీ 27:12)
601. 'మెస్సీయ' అను పదానికి అర్థం ఏమిటి? క్రీస్తు (4:25)
602. యేసు నిజంగా లోక రక్షకుడని ఎవరు చెప్పారు? సమరయులు (4:42)
603. యేసు ప్రధాని కుమారున్ని ఎక్కడ స్వస్థపరిచాడు? కపెర్నహూము (4:46)
యెరూషలేములో గొట్టెలద్వారం వద్ద ఉన్న కోనేరు పేరు ఏమిటి?
బేతెస్ధ (5:2)
605. బేతెస్ధ పదానికి అర్థం ఏమిటి?
కనికరంగల ఇల్లు (5:2)
606. బేతెస్ధ కోనేరుకు ఎన్ని మంటపాలు ఉన్నాయి? ఐదు (5:2)
607. యేసు స్వస్థపరచిన వ్యక్తి కోనేరువద్ద ఎన్ని సంవత్సరాలనుండి రోగిగా
ఉన్నాడు? ముప్పై ఎనిమిది సంవత్సరాలు (5:5)
608. మృతులు ఎవరి స్వరాన్ని వింటారు? దేవుని కుమారుని స్వరం (5:25)
609. తనంతట తానే జీవం కలిగియుండే అధికారాన్ని దేవుడు ఎవరికి
అనుగ్రహించాడు? కుమారునికి (5:26)
610. మండుచు ప్రకాశిస్తున్న దీపమని ఎవరి గురించి యేసు ప్రశంసించాడు?
బాప్తిస్మమిచ్చు యోహాను(5:35)
611. ధర్మశాస్త్రం ఆధారంగా ఎవరు నేరం మోపుతారు? మోషే (5:45)
612. ఐదువేలమంది ప్రజలను పోషించే తన అద్భుతాన్ని గురించి యేసు ఎవరి
ని పరీక్షించాడు? ఫిలిప్పు (6:5)
613. జీవాహారంగా పేర్కొనబడింది ఎవరు?
యేసు (6:35)
పరలోకంనుండి దిగి వచ్చిన జీవాహారం ఎవరు?
యేసు (6:41)
615. 'నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు' అని ఎవరు యేసుతో చెప్పారు?
పేతురు (6:68)
616. 'నిన్ను నీవే లోకమునకు కనపరచుకో' అని ఎవరు యేసుతో చెప్పారు?
యేసు సహోదరులు (7:3-5)
617. యేసును దేవుని పరిశుద్ధునిగా అర్ధం చేసుకొన్నదెవరు? పేతురు (6:69)
618. యూదుల ఏడవ పండుగ ఏమిటి? పర్ణశాలల పండుగ (7:2)
619. పర్ణశాలల పండుగకు రహస్యంగా వెళ్ళిందెవరు? యేసు (7:10)
ఎవరి జీవిత కాలంలో సున్నతి ఆచారం మొదలైంది?
అబ్రాహాము (7:22; ఆది 17:10)
పండుగ చివరి రోజున యేసు నిలబడి 'ఎవడైన దప్పిగొనినయెడల నాయొద్దకు
వచ్చి దప్పి తీర్చుకొనవలెను' అని బిగ్గరగా చెప్పాడు. అది ఏ పండుగ?
పర్ణశాలల పండుగ (7:2,37)
622. విశ్వాసముంచినవాని హృదయంలో ఎలాంటి నది ప్రవహిస్తుంది?
జీవజల నది (7:38)
623. లేఖనం ప్రకారం యేసు ఎక్కడనుండి వస్తాడు? బెల్లెహేము (7:42)
యేసుకు అనుకూలంగా వాదించిన యూదుల అధికారి పేరు ఏమిటి?
నీకొదేము (7:50-52)
లోకానికి వెలుగు ఎవరు? యేసుక్రీస్తు (8:12)
626. ఎవరు శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు? పరిసయ్యులు (8:15)
627. 'సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా
చేయును' అని ఎవరు చెప్పారు? యేసు (8:32)
628. అబద్ధికుడు ఎవరు? అపవాది (8:44)
ఆదినుండి నరహంతకుడు ఎవరు? సాతాను (8:44)
630. 'నీవు సమరయుడవు, దయ్యము పట్టినవాడవు' అని యేసుతో ఎవరు
చెప్పారు? యూదులు (8:48)
631. దేవుని వాక్యాన్ని గైకొన్నవాని జీవితంలో ఏది రాదు?
మరణం (8:51)
'రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడును పని చేయలేడు' అని ఎవరు చెప్పారు?
యేసు (9:4)
633. గుడ్డివాని కన్నులమీద బురదను పెట్టిన తరువాత కడుక్కోవడానికి ఏ సరస్సుకు
వెళ్ళమని యేసు అతనికి చెప్పాడు? సిలోయము సరస్సు (9:7)
సిలోయము' పేరుకు అర్థం ఏమిటి? పంపబడిన (9:7)
సిలోయము సరస్సులో తన కండ్లను కడుక్కొన్నది ఎవరు? గుడ్డివాడు
636. 'దేవుడు పాపుల మనవి ఆలకింపడు' అని ఎవరు చెప్పారు? గుడ్డివాడు (9:31)
637. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు?
దేవభక్తుడైయుండి దేవుని చిత్తం చేయువారి ప్రార్థన (9:31)
638. ఎవరి స్వరాన్ని గొర్రెలు వింటాయి? కాపరి (10:3)
దొంగతనం, హత్య, నాశనం చేయడానికి ఎవరు వస్తారు? దొంగ (10:10)
640. మంచి కాపరి ఎవరు? యేసుక్రీస్తు (10:11)
641. గొర్రెల వద్దకు తోడేలు వచ్చినప్పుడు పారిపోయేది ఎవరు?
జీతగాడు (10:12)
642. యేసు వెర్రివాడు అని ఎవరు చెప్పారు? యూదులు (10:20)
643. ప్రతిష్ఠిత పండుగ సమయంలో ఏ మంటపంవద్ద యేసు నడిచాడు?
సొలొమోను మంటపం (10:23)
644. బేతనియ ఎవరి గ్రామం? మార్త, మరియ (11:1)
645. లాజరు గ్రామం ఏది? బేతనియ (11:1)
646. లాజరు అర్థం ఏమిటి? దేవుడే సహాయకుడు (11:1)
647. లాజరు సహోదరీలు ఎవరు? మార్త, మరియ (11:1)
బేతనియ గ్రామంలో యేసు ప్రేమించిన వ్యక్తి పేరు ఏమిటి?
లాజరు (11:3)
649. యేసు తలకు అత్తరు పూసి వెండ్రుకలతో ఆయన పాదాలను తుడిచిన వ్యక్తి
ఎవరు? మరియ (11:2)
650. “ఈ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు
దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినది' అని
ఎవరు ఎవరితో చెప్పారు? మార్త, మరియలతో యేసు చెప్పాడు (11:4)
651. బేతనియ గ్రామంలో ఎవరి కుటుంబాన్ని యేసు బాగా ప్రేమించాడు?
లాజరు కుటుంబం (11:15)
652. అపొస్తలుడైన తోమాకు ఉన్న మరో పేరేమిటి?
దిదుమ (11:16)
653. 'ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్ళుదము' అని ఏ అపొస్తలుడు
చెప్పాడు? తోమా (11:16)
654. 'నీవు దేవున్ని ఏమడిగినను, దేవుడు నీకనుగ్రహించును' అని ఎవరు ఎవరితో
చెప్పారు? యేసుతో మార్త చెప్పింది (11:22)
655.పునరుత్థానము, జీవము ఎవరు?
యేసు (11:25)
656. ఎవరియందు విశ్వాసముంచితే, చనిపోయినా బ్రదుకుతారు?
యేసునందు (11:25)
657. ఎక్కడ యేసు కన్నీళ్ళు విడిచాడు? లాజరు సమాధిముందు (11:35)
658. 'అతనిని ఏలాగు ప్రేమించెనో చూడు' అని ఎవరు చెప్పారు?
యూదులు (11:36)
659. 'నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు' అని ఎవరు ఎవరితో
చెప్పారు? మార్తతో యేసు చెప్పాడు (11:40)
172 బైబిల్ క్విజ్
660.ఎన్ని రోజుల తరువాత యేసు లాజరును లేపాడు? 4వ రోజున (11:39)
661. ప్రేత వస్త్రాలతో సమాధినుండి బయటికి వచ్చిందెవరు? లాజరు (11:44)
662. లాజరు సమాధినుండి లేచినప్పుడు, ప్రధాన యాజకుడు ఎవరు?
కయప (11:49)
663. క్రొత్త నిబంధనలో ప్రవక్తగా కూడా పేర్కొనబడిన ప్రధాన యాజకుని పేరు
ఏమిటి? కయప (11:49-51)
664. చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు క్రీస్తు చనిపోతా
డని ఎవరు ప్రవచించారు? కయప (11:52)
665. యూదులు యేసుని చంపాలని ప్రయత్నించినప్పుడు ఆయన ఎక్కడ
రహస్యంగా గడిపాడు? ఎఫ్రాయిము ఊరిలో (11:54)
666. అత్తరును మూడువందల దేనారాలకు అమ్మి బీదలకు ఎందుకు ఇవ్వలేదని
ప్రశ్నించిందెవరు? ఇస్కరియోతు యూదా (12:5)
667. డబ్బుసంచి ఎవరివద్ద ఉంది? ఇస్కరియోతు యూదా (12:6)
668. ఏ చెట్టు మట్టలను ప్రజలు తమ చేతుల్లో పట్టుకొని ప్రభువుకు హోసన్న
పాటను పాడారు? ఖర్జూరపు చెట్టు మట్టలు (12:13)
669. 'ఇది గోలోకము ఆయనవెంట పోయినది' అని చెప్పుకున్నదెవరు?
పరిసయ్యులు (12:19)
670. యేసును చూడాలనే తమ కోరికను ఫిలిప్పుతో ఎవరు పంచుకొన్నారు?
గ్రీసు దేశస్థులు (12:20,21)
671. దేవుని మహిమను చూసిన పాతనిబంధన ప్రవక్త ఎవరు?
యెషయా (12:41)
672. దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆ పేక్షించింది ఎవరు?
అధికారులు (12:42,43)
673. ఇస్కరియోతు యూదా తండ్రి ఎవరు? సీమోను (13:2)
674. యేసును అప్పగించాలని ఇస్కరియోతు యూదాను ప్రోత్సహించిందెవరు?
675. తన శిష్యుల పాదాలను కడిగిన గురువు ఎవరు? యేసు (13:5)
676. “ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తలకూడ కడుగుము'
అని యేసుతో ఎవరు చెప్పారు? పేతురు (13:9)
677. మిగతా శిష్యులకంటే యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఎవరు?
యోహాను (13:23)
678.ఏ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొనేవాడు? యోహాను (13:23)
సాతాను (13:2)
యేసును ఎవరు అప్పగిస్తున్నారనే దాని గురించి యేసును అడుగమని
యోహానుకు సైగ చేసిన శిష్యుడు ఎవరు? పేతురు (13:24)
680. 'నీవు చేయుచున్నది త్వరగా చేయుము' అని ఎవరితో యేసు చెప్పాడు?
ఇస్కరియోతు యూదా (13:27)
681. రొట్టె ముక్కను పుచ్చుకొన్న తరువాత వెంటనే బయటికి వెళ్ళిందెవరు?
ఇస్కరియోతు యూదా (13:30)
682. యేసుకోసం తన ప్రాణాన్ని పెడుతానని ఎవరు చెప్పారు? పేతురు (13:37)
683. 'మీ హృదయమును కలవరపడనియ్యకుడి' అని ఎవరు ఎవరితో చెప్పారు?
శిష్యులతో యేసు చెప్పాడు (14:1)
ఎక్కడ మనకు అనేక నివాసస్థలాలు ఉన్నాయి? తండ్రి ఇంటిలో (14:2)
యేసు వెళుతున్న స్థలానికి మార్గం తనకు తెలియదని ఎవరు చెప్పారు?
తోమా (14:5)
686. మార్గం, సత్యం, జీవం ఎవరు?
యేసు (14:6)
687. ఎవరిద్వారా తండ్రివద్దకు వెళ్ళగలరు? యేసుక్రీస్తు (14:6)
688. తండ్రిని మాకు కనపరచుమని ఎవరు యేసును అడిగారు? ఫిలిప్పు (14:8)
యేసు నామంలో పంపబడబోవు ఆదరణకర్త పేరు ఏమిటి?
పరిశుద్ధాత్మ (14:26)
690. 'నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను' అని ఎవరు చెప్పారు?
యేసు (14:27)
691. నిజమైన ద్రాక్షావల్లి ఎవరు? యేసుక్రీస్తు (15:1)
692యేసు నిజమైన ద్రాక్షావల్లి, మనం తీగెలం. అయితే తండ్రియైన దేవుడు
ఎవరు? వ్యవసాయకుడు (15:1)
మరింతగా ఫలించాలంటే తీగెలను మీరేమి చేస్తారు?
పనికిరాని తీగెలను తీసివేస్తారు (15:2)
దేవుని మాటలవలన ఒకరు ఏమవుతారు? పవిత్రులు (15:3)
'నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు' అని ఎవరు చెప్పారు?
యేసు (15:5)
మనం బహుగా ఫలిస్తే ఏమవుతాము? శిష్యులం (15:8)
697. పాపం, నీతి, తీర్పును గురించి ఒప్పించేదెవరు? పరిశుద్ధాత్ముడు (16:8)
698. సర్వసత్యంలోనికి నడిపించేదెవరు? సత్యస్వరూపియైన ఆత్మ (16:13)
699. లోకాన్ని జయించింది ఎవరు? యేసుక్రీస్తు (16:33)
జగత్తు పునాది వేయబడకముందు తండ్రి ఎవరిని ప్రేమించాడు?
యేసుక్రీస్తు (17:24)
174 బైబిల్ క్విజ్
701. 'లోకము నిన్ను ఎరుగలేదు. నేను నిన్ను ఎరుగుదును' అని ఎవరు చెప్పారు?
యేసుక్రీస్తు (17:25)
702. యేసు అప్పగింపబడిన రాత్రి ఆయన, ఆయన శిష్యులు కలిసి దాటిన వారు
పేరు ఏమిటి? కేద్రోను వాగు (18:1)
703. శిష్యులతో పాటు యేసు వెళ్ళిన తోట పేరేమిటి? గెత్సెమనే (18:2)
704.
ప్రధాన యాజకునియొక్క దాసుని కుడి చెవిని నరికింది ఎవరు?
పేతురు (18:10)
705. పేతురుచేత కుడి చెవి నరుకబడిన ప్రధాన యాజకుని దాసుని పేరు ఏమిటి?
మల్కు (18:11)
706. యేసును బంధించిన తరువాత ఆయన ఎవరివద్దకు తీసుకొనిపోబడ్డాడు?
అన్న (18:12)
కయప మామ ఎవరు? అన్న (18:13)
708. ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని ఆలోచన
చెప్పినదెవరు? కయప (18:14)
709. ప్రధాన యాజకునికి తెలిసిన యేసు శిష్యుడు ఎవరు? యోహాను (18:15)
710. ప్రధాన యాజకుని ఇంటి ముంగిటలోకి వెళ్ళిన ఇద్దరు శిష్యులు ఎవరు?
పేతురు, యోహాను (18:15)
ప్రధాన యాజకుని ఇంటి ఆవరణంలోకి రమ్మని పేతురును ప్రోత్సహించింది
ఎవరు? యోహాను (18:16)
యేసును హింసించిన తరువాత అన్న ఆయన్ని ఎవరివద్దకు పంపాడు?
కయప (18:24)
713. ధర్మశాస్త్రం ప్రకారం యేసుకు తీర్పు తీర్చమని యూదులకు చెప్పిందెవరు?
పిలాతు (1831)
714. సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు (18:37)
715. యేసును సిలువ వేయమని తీర్పునిచ్చిన తరువాత పిలాతు ఏ న్యాయపీఠం
మీద కూర్చొన్నాడు? గబ్బతా (19:13)
716. సిలువవేసే సమయంలో యేసుకు ఎలాంటి వస్త్రాన్ని తొడిగించారు?
ఊదారంగు వస్త్రం (19:3)
717. ముండ్లతో కిరీటమును అల్లి యేసు తలమీద పెట్టిందెవరు?
సైనికులు (19:2)
718. 'ఇదిగో ఈ మనుష్యుడు' అని ఎవరి గురించి ఎవరు చెప్పారు?
యేసు గురించి పిలాతు చెప్పాడు (19:5)
719. యేసును విడుదల చేయడానికి లేక సిలువ వేయడానికి ఎవరికి అధికార
మున్నది? పిలాతు (19:10)
720. 'నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు' అని ఎవరితో
ఎవరు చెప్పారు? పిలాతుతో యేసు చెప్పాడు (19:11)
'గబ్బతా' అనగా అర్థం ఏమిటి? రాళ్ళు పరచిన స్థలం (19:13)
722. 'గొల్గొతా' అనే పదం ఏ భాషలో ఉంది? హెబ్రీ భాషలో (19:17)
723. యేసును సిలువ వేయడానికి ఎక్కడికి తీసుకెళ్ళారు? గొల్గొతా (19:17)
724. 'యూదుల రాజైన నజరేయుడగు యేసు' అనే పేరు ఏ భాషల్లో వ్రాయ
బడింది? హెబ్రీ, గ్రీకు, లాటిన్ (19:19,20)
725.
'నేను వ్రాసినదేమో వ్రాసితి'సని ఎవరు చెప్పారు? పిలాతు (19:22)
726. యేసు అంగీకోసం చీట్లు వేస్తారని ఎవరు ప్రవచించారు?
దావీదు (కీర్తన 22:18)
727. క్లోపా భార్య ఎవరు? మరియ (19:25)
728. సిలువ వేయబడిన సమయంలో యేసు తన తల్లిని ఎవరికి అప్పగించాడు?
యోహాను (19:27)
729. సిలువ మీద ఉన్నప్పుడు యేసు చివరిగా ఏమి చెప్పాడు?
సమాప్తమైనది (19:30)
730. సిలువ మీదున్న వారి కాళ్ళు విరుగగొట్టమని యూదులు ఎవరిని అడిగారు?
పిలాతు (19:31)
731. “అతని యెముకలలో ఒకటైనను విరువబడదు' అని ఎవరు ప్రవచించారు?
దావీదు (కీర్తన 34:20; కీర్తన 19:36)
732. తన మరణం తరువాత పొడవబడినదెవరు?
యేసు (19:34)
733. యేసు సమాధి కార్యక్రమంలో హాజరైన పరిసయ్యుల అధికారి ఎవరు?
నీకొదేము (19:39)
734. యేసు మృతదేహానికి పూసే నూటయాబది సేర్ల యెత్తు సుగంధ ద్రవ్యాల
ను తెచ్చిందెవరు? నీకొదేము (19:39,40)
735. ఇంకా చీకటి ఉండగానే ఆదివారం రోజున పెందలకడనే యేసు సమాధి
వద్దకు ఎవరు వెళ్ళారు? మగ్దలేనే మరియ (20:1)
736. యేసు సమాధి బయట నిలబడి యేడ్చిన స్త్రీ ఎవరు?
మగ్దలేనే మరియ (20:11)
737. యేసు పునరుత్థాన రోజున ఆయన సమాధివద్దకు కలిసి పరుగెత్తిన శిష్యులు
ఎవరు? పేతురు, యోహాను (20:4)
738. సమాధిలోకి ఏ శిష్యుడు మొదట ప్రవేశించాడు? పేతురు (20: 6)
739. ‘నా ప్రభువును ఎవరో ఎత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు
తెలియలేదు' అని ఎవరు చెప్పారు? మగ్దలేనే మరియ (20:13)
740.
741.
742.
744.
745.
176 బైబిల్ క్విజ్
యేసు తన పునరుత్థానం తరువాత మొదట ఎవరికి కనబడ్డాడు?
మగ్దలేనే మరియ (20:13-18)
'రబ్బూనీ' పదానికి అర్థం ఏమిటి? బోధకుడా (20:16)
'నన్ను ముట్టుకొనవద్దు' అని ఎవరితో యేసు చెప్పాడు?
మగ్దలేనే మరియ (20:17)
743. పునరుత్థానం తరువాత యేసు తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఏ శిష్యుడు
వారితో లేడు? తోమా (20:24)
యేసు చేతుల్లోని మేకుల గుర్తులను చూసి ఆ మేకుల గుర్తులో తన చేతులు
పెడితేనే గాని నమ్మనే నమ్మనని ఏ శిష్యుడు చెప్పాడు? తోమా (20:25)
'అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము' అని యేసు ఎవరితో చెప్పాడు?
తోమా (20:27)
746. యేసు ప్రక్కలోకి తన చేయి చాచిన శిష్యుడు ఎవరు? తోమా (20:27)
747. పునరుత్థానం తరువాత ఏ సముద్ర తీరాన యేసు తన శిష్యులకు
ప్రత్యక్షమైనాడు? తిబెరియ సముద్ర తీరం (21:1)
యేసు పునరుత్థానం తరువాత చేపలు పట్టడానికి వెళ్ళాలని ఏ శిష్యుడు
నిర్ణయించుకొన్నాడు? పేతురు (21:3)
'భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా' అని ఎవరిని యేసు అడిగాడు?
తన శిష్యులను యేసు అడిగాడు (21:5)
750. యేసును చూడగానే తన చుట్టు పై బట్టను కప్పుకొని సముద్రంలో
దుమికిందెవరు? పేతురు (21:7)
యేసుమాట ప్రకారం వల వేసినప్పుడు శిష్యులు ఎన్ని చేపలు పట్టారు?
153 చేపలు (21:11)
మూడోసారి తన శిష్యులకు యేసు ప్రత్యక్షమైనది ఎక్కడ?
తిబెరియ సముద్ర తీరం (21:1, 14)
753.
'వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?”
అని యేసు ఎవరిని అడిగాడు? పేతురు (21:15)
754. యేసు పేతురుని మూడుసార్లు అడిగిన ప్రశ్న ఏది? 'వీరికంటె నన్ను
ఎక్కువగా ప్రేమించుచున్నావా?' (21:15-17)
755. యవ్వన ప్రాయంలో తనకు ఇష్టమైన చోటికి వెళ్ళినది ఎవరు?
పేతురు (21:18)