100 Bible Quiz Questions About The Life of Jesus in Telugu || Trivia questions about Jesus in Telugu || Part-1

Author

Q ➤ 1.మరియ ఎవరికి ప్రధానము చేయబడెను?


Q ➤ 2.మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె __వలన గర్భవతిగా ఉండెను?


Q ➤ 3.మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచ నొల్లక__గ ఆమెను విడనాడ ఉద్దేశించెను?


Q ➤ 4.ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు____ అనెను ?


Q ➤ 5. ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై మరియ ఒక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు___ అని పేరు పెట్టుదువనెను?


Q ➤ 6. యేసు అనే పేరుకు అర్థం ఏమిటీ?


Q ➤ 7. క్రీస్తు అను శబ్దమునకు అర్థం ఏమిటీ?


Q ➤ 8.ఇమ్మానుయేలను పేరునకు అర్థం ఏమిటి?


Q ➤ 9.యేసుక్రీస్తు జన్మించిన గ్రామం ఏది?


Q ➤ 10.యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు?


Q ➤ 11.యేసుక్రీస్తు ఏ గోత్రంలో జన్మించాడు?


Q ➤ 12.ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని ఎవరి వలన ఆజ్ఞ ఆయెను ?


Q ➤ 13.మరియ ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను?


Q ➤ 14. మరియ తన తొలిచూలు కుమారుని కని,___గుడ్డలతో చుట్టెను?


Q ➤ 15.మరియ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, ___ లొ వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను?


Q ➤ 16.కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ఎవరు వారి యొద్దకు వచ్చి నిలిచెను?


Q ➤ 17.ప్రభువు మహిమ గొర్రెల కాపరుల చుట్టు ప్రకాశించినందున, వారు____?


Q ➤ 18.ప్రభువు దూత గొర్రెల కాపరులతో - భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు____కరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాననెను?


Q ➤ 19. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన___ అనెను ?


Q ➤ 20.ప్రభువు దూత గొర్రెల కాపరులతో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి____ లో పండుకొనియుండుట మీరు చూచెదరని చెప్పెను?


Q ➤ 21.పరలోక సైన్య సమూహము దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద --------- కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను?


Q ➤ 22.గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనిరి?


Q ➤ 23.గొర్రెల కాపరులు త్వరగా వెళ్లి,మరియను యోసేపును తొట్టిలో పండు కొనియున్న____ ను చూచిరి ?


Q ➤ 24.గొర్రెల కాపరులు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు చేసిరి?


Q ➤ 25.గొర్రెల కాపరులు తమతో చెప్పబడి నట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమ పరచుచు___ చేయుచు తిరిగి వెళ్లిరి ?


Q ➤ 26.యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి, ఇశ్రాయేలుయొక్క____ కొరకు కనిపెట్టువాడు?


Q ➤ 27.సుమెయోను మీద___ ఉండెను ?


Q ➤ 28.ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని సుమెయోనుకు ఎవరిచేత బయలుపరచబడి యుండెను?


Q ➤ 29.నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చు చున్నావు; అని అన్నది ఎవరు ?


Q ➤ 30. నీ హృదయములోనికి ఒక ___దూసికొనిపోవునని సుమెయోను మరియతో చెప్పెను?


Q ➤ 31.యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?


Q ➤ 32. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని జ్ఞానులు ఎవరితో చెప్పిరి?


Q ➤ 33.హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనబడిన కాలము వారిచేత___ గా తెలిసికొనెను ?


Q ➤ 34.హేరోదు జ్ఞానులతో - మీరు వెళ్లి, శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను?


Q ➤ 35.క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు ఎవరినడిగెను ?


Q ➤ 36. జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి ?


Q ➤ 37.జ్ఞానులు తమ పెట్టెలు విప్పి,బంగారమును సాంబ్రాణిని బోళమును____ గా ఆయనకు సమర్పించిరి?


Q ➤ 38. హేరోదు నొద్దకు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై జ్ఞానులు____ మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి?


Q ➤ 39.జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు____ తెచ్చుకొనెను?


Q ➤ 40.బేత్లహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల___ నందరిని వధించెను?


Q ➤ 41.ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ____నకు పారిపొమ్మని చెప్పెను?


Q ➤ 42.యోసేపు లేచి,___ వేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లెను?


Q ➤ 43. హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని_____ దేశమునకు వెళ్లమని చెప్పెను?


Q ➤ 44.యోసేపు స్వప్నమందు దేవునిచేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, ----- అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను?


Q ➤ 45.ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక __యుండెను?


Q ➤ 46.అన్న దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు____ చేయుచుండెను?


Q ➤ 47.పస్కాపండుగప్పుడు యేసుక్రీస్తు తలిదండ్రులు ఏటేట ఎక్కడికి వెళ్లుచుండువారు?


Q ➤ 48.యేసుక్రీస్తు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ___అడుగుచు ఉండెను?


Q ➤ 49. యేసుక్రీస్తు మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును____ నొందిరి ?


Q ➤ 50.యేసుక్రీస్తు తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి___?


Q ➤ 51.యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును,_____ దయ యందును వర్ధిల్లు చుండెను?


Q ➤ 52.రబ్బీ అనే మాటకు అర్థం ఏమిటి?


Q ➤ 53. మెస్సియా అనే మాటకు అర్థం ఏమిటీ?


Q ➤ 54. యేసయ్య కేఫా అనే పేరు ఎవరికి పెట్టెను?


Q ➤ 55.ఇదిగో లోకపాపమును మోసికొని పోవు దేవుని గొట్టెపిల్ల అని యోహాను ఎవరిని గూర్చి అన్నాడు?


Q ➤ 56.తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, ____అగుటకు దేవుడు అధికారము అనుగ్రహించెను?


Q ➤ 57.యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది?


Q ➤ 58.నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని అన్నది ఎవరు?


Q ➤ 59. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు?


Q ➤ 60. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకనినొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ అని అన్నది ఎవరు?


Q ➤ 61. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ____పొందునట్లు ఆయనను అనుగ్రహించెను?


Q ➤ 62. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు__?


Q ➤ 63.మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెన గాని ____నియమింపలేదు?


Q ➤ 64.యేసయ్య ఈ భూమ్మీద ఎంతకాలం జీవించాడు?


Q ➤ 65.యేసుక్రీస్తు శాస్త్రులవలె కాక ___గలవానివలె ప్రజలకు బోధించెను?


Q ➤ 66. యేసుక్రీస్తు బోధకు ప్రజలు_____?


Q ➤ 67.నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; అని అన్నది ఎవరు?


Q ➤ 68. యేసుక్రీస్తు చేసిన మొదటి సూచక క్రియ ఏది?


Q ➤ 69.యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో ఎవరిచేత బాప్తిస్మము పొందెను?


Q ➤ 70.పరిశుద్ధాత్మ పావురమువలె ఎవరి మీదికి దిగివచ్చుట యోహాను చూచెను?


Q ➤ 71.ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఎక్కడనుండి వచ్చెను?


Q ➤ 72.యేసయ్య అపవాది చేత శోధింప బడుటకు ఆత్మ వలన ఎక్కడికి కొనిపోబడెను?


Q ➤ 73.యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసమున్నాడు?


Q ➤ 74.శోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు___అగునట్లు ఆజ్ఞాపించు మనెను?


Q ➤ 75.మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని అన్నది ఎవరు?


Q ➤ 76.అపవాది యేసయ్యను విడిచిపోగా, ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి?


Q ➤ 77.పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక_____ పొందుడని చెప్పుచు యేసయ్య ప్రకటింప మొదలు పెట్టెను?


Q ➤ 78.యేసు గలిలయ సముద్రతీరమున నడుచు చుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో ____వేయుట చూచెను?


Q ➤ 79.యేసయ్య శిష్యులతో - రండి, నేను మిమ్మును___ నా వెంబడి పట్టుజాలరులనుగా చేతునని చెప్పెను?


Q ➤ 80. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, యేసయ్య యొద్దకు తీసికొని రాగా ఆయన వారిని ____?


Q ➤ 81.యేసయ్య పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, __ ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను?


Q ➤ 82.యేసయ్య గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు____ లను వెళ్లగొట్టుచు నుండెను?


Q ➤ 83. యేసయ్య మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు___ ను చూచి నన్ను వెంబడించుమని చెప్పెను?


Q ➤ 84.రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు అని అన్నది ఎవరు ?


Q ➤ 85. యేసయ్య దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు____ లలోనుండి వచ్చి, ఆయన కెదురుపడెను ?


Q ➤ 86. నీవు మనుష్యుల సంగతులను మనస్కరించు చున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని యేసయ్య ఎవరిని గద్దించెను?


Q ➤ 87.యేసయ్య తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన____ యెత్తుకొని నన్ను వెంబడింపవలెననెను?


Q ➤ 88.యేసు - నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి___ కైనను స్థలములేదని చెప్పెను?


Q ➤ 89. యేసయ్య జనసమూహములను చూచి, వారు కాపరిలేని గొజ్జెలవలె విసికి చెదరియున్నందున వారిమీద -------?


Q ➤ 90. కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 91.యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి -------- ఇచ్చెను?


Q ➤ 92.యేసయ్య తన శిష్యులను పంపుచు___ సమీపించియున్నదని ప్రకటించమనెను?


Q ➤ 93. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు____ అనెను ?


Q ➤ 94.క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను_____ లో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను ?


Q ➤ 95.యేసయ్య జనులతో - స్త్రీలు కనిన వారిలో____ కంటె గొప్పవాడు పుట్టలేదని చెప్పెను?


Q ➤ 96. నా విషయమై అభ్యంతర పడనివాడు____ అని యేసయ్య యుత్తర మిచ్చెను ?


Q ➤ 97. యేసయ్య ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు ____పొందకపోవుట వలన ఆయన వారిని గద్దించెను?


Q ➤ 98. యేసయ్య జనులతో - నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు ____దొరకుననెను?


Q ➤ 99.యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని ____త్రుంచి తినసాగిరి?


Q ➤ 100.యేసయ్య పరిసయ్యులతో కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను____ అని తీర్పు తీర్చకపోదురనెను?