Q ➤ 5. తన సహోదరులనుగూర్చి యోసేపు తాను కనిన కలలను చెప్పుటద్వారా వారికి యోసేపుపై ఎటువంటి అభిప్రాయము కలిగినది? Ans ➤ జ. వారు అతణ్ణి ద్వేషించి, అతనిపై పగపెంచుకున్నారు (ఆది. 37:8).
Q ➤ 6. యోసేపును అతని సహోదరులు ఐగుప్తీయులకు ఎంత వెలకు అమ్మివేసిరి?Ans ➤ జ. ఇరువది తులముల వెండి (ఆది. 37:28)
Q ➤ 7. చెఱసాలలో యోసేపుకు సహ ఖైదీలుగా ఫరో సేవకులు ఇద్దరు కలరు. వారెవరు?Ans ➤ జ. పానదాయకుల అధిపతి మరియు భక్ష్యకారుడు (ఆది. 40:1-4)
Q ➤ 12. బెన్యామీనుయొక్క ధాన్యపు సంచిలో యోసేపు రహస్యముగా పెట్టించినది.ఏమిటి?Ans ➤ జ. తన సొంత వెండి గిన్నె (ఆది. 44:2)
Q ➤ 13. తనకు జరిగినదంతా చెప్పుటలో యోసేపు ఇచ్చిన వివరణ ఏమిటి?Ans ➤ జ. "ప్రాణరక్షణకొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను" (ఆది. 45:5)
Q ➤ 14. తాను ఇంకా జీవించే ఉన్నట్టు యోసేపు తన తండ్రికి పంపించిన ఋజువు ఏమిటి?Ans ➤ జ. తన తండ్రిని, అతని కుటుంబస్తులనందరినీ ఐగుప్తుకు తీసికొనివచ్చుటకై యోసేపు బండ్లను పంపెను (ఆది. 45:27)
Q ➤ 15. ఐగుప్తులో యాకోబును అతని కుమారులును ఎక్కడ స్థిరపడిరి?Ans ➤ జ. గోను దేశము (ఆది. 47:6)