Telugu Bible Quiz on Deuteronomy

Author

Q ➤ 1. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించినందున వాగ్దానదేశమును చూచును అని ఎవరిని గూర్చి పలికెను?


Q ➤ 2. నీ పరిచారకుడగు యెహోషువ దానిలో ప్రవేశించునుగాని నీవు దానిలో ప్రవేశింపవు అని ఎవరిని గూర్చి దేవుడు పలికాడు?


Q ➤ 3. శేయీరు మన్నెమును స్వాస్థ్యముగా ఎవరికి ఇచ్చియున్నానని దేవుడు. సెలవిచ్చెను?


Q ➤ 4. నీ చేతిపనులన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ఎవరు పలికారు?


Q ➤ 5. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఎన్ని సంవత్సరములు సంచరించిరి?


Q ➤ 6. ఏ కొండయెక్కి మోషే ఇశ్రాయేలీయులు స్వాధీనపరచుకొనబోవు దేశమును చూచాడు?


Q ➤ 7. ఎవరిని హత్తుకొనినందున మీరందరును నేటికిని సజీవులైయున్నారని మోషే చెప్పాడు?


Q ➤ 8. 'దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడైయున్నాడు' అని ఎచ్చట వ్రాయబడి యున్నది?


Q ➤ 9. ఎవరిని మీమీద సాక్షులుగా ఉంచుచున్నానని మోషే తెలిపాడు?


Q ➤ 10. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ ఎవరితో యీ నిబంధన చేసెను?


Q ➤ 11. దేవుడైన యెహోవా బాహుబలముచేతను, చాచిన చేతి చేతను ఎచ్చటనుండి ఇశ్రాయేలీయులను రప్పించెను?


Q ➤ 12. నీవు ఎవరికి ప్రతిష్టితజనమని మోషే తెలిపాడు?


Q ➤ 13. తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించువారిని దేవుడు ఎన్ని తరముల వరకు కరుణించువాడైయున్నాడు?


Q ➤ 14. ఆహారము వలననే కాక నరులు దేని వలన బ్రతుకుదురు?


Q ➤ 15. నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి నీవు ఏమి చేయవలెను?


Q ➤ 16 ఎచ్చట ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు కోపము పుట్టించిరి.


Q ➤ 17. మీ ఎదుట ఏమి పెట్టుచున్నానని దేవుడు సెలవిచ్చాడు?


Q ➤ 18. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను ఎవరిని విడువకూడదని దేవుడు సెలవిచ్చాడు?


Q ➤ 19.ఇశ్రాయేలు ప్రజలు తినదగినవి, తినకూడని జంతువుల పేరులు తెలియజేయు అధ్యాయము ఏది?


Q ➤ 20. ఏ జంతువు మీకు హేయము దాని మాంసము తినకూడదని చెప్పాడు?


Q ➤ 21. నీ సహోదరులలో హెబ్రీయుడేగాని హెబ్రీయురాలేగాని ఆరు సంవత్సరములు దాస్యముచేసిన ఎడల ఏ సంవత్సరము విడిపించాలి?


Q ➤ 22. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏమి నిలువబెట్టకూడదు?


Q ➤ 23. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని ఏమి చేయవలెను?


Q ➤ 24. మ్రానుకు వ్రేలాడదీయబడినవాడు ఏమైయున్నాడు?


Q ➤ 25. ఎవరు యెహోవా సమాజములో చేరకూడదు?


Q ➤ 26. నూర్చెడి యెద్దు మూతికి ఏమి వేయకూడదు?


Q ➤ 27. యెహోవాకు బలిపీఠము దేనితో కట్టవలెను?


Q ➤ 28. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు ఏమగును?


Q ➤ 29. ఎప్పుడు నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటే నిన్ను హెచ్చించును?


Q ➤ 30. నలుబది సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో దేవుడు ఏ విధముగా నడిపించాడు?


Q ➤ 31. ఎవరు నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై యున్నారు?


Q ➤ 32. ఈ ధర్మశాస్త్ర వాక్యములు గ్రంథమందు సాంతముగా ఎవరు వ్రాసి ముగించారు?


Q ➤ 33.ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న ఆ దేశమును నీవు చూడవు అని దేవుడు ఎవరితో పలికెను?


Q ➤ 34. ఎవరి భాగ్యము గొప్పది?


Q ➤ 35. మోషే ఎచట మృతిబొంది పాతిపెట్టబడెను?


Q ➤ 36.మోషే చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరముల వయస్సుగలవాడు?


Q ➤ 37.చనిపోవు వరకు దృష్టి మాంద్యములేక, సత్తువ తగ్గనిది ఎవరికి?


Q ➤ 38. ఎన్ని దినములు మోషేను బట్టి ఇశ్రాయేలీయులు దుఃఖము సలిపిరి?


Q ➤ 39. మోషే ఎవరిపై తన చేతులుంచగా అతడు జ్ఞానాత్ముడాయెను?


Q ➤ 40. మోషే ఏ కొండ మీద నుండి ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచెను?


Q ➤ 41. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ఏ ప్రవక్తవంటి ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు.