1➤ ఆదికాండం రచయిత ఎవరు?
,=> మోషే
2➤ ఆదికాండంలో ఎన్ని వచనాలున్నాయి?
,=> 1533
3➤ ఆదికాండంలో మూల వచనం ఏమిటి?
,=> 3:15
4➤ జన్మించకుండానే మరణించిందెవరు?
,=> ఆదాము
5➤ ఆదియందు భూమి సృష్టించబడినప్పుడు అది ఏ స్థితిలో ఉంది?
,=> నిరాకారంగా, శూన్యంగా ఉంది (1:2)
6➤ ఏ రోజున దేవుడు మనిషిని సృష్టించాడు?
,=> 6వ రోజున (1:26-30)
7➤ ఏ దినం దేవునిచేత ఆశీర్వదించబడి పరిశుద్ధపరచబడింది?
,=> 7వ దినం (2:3)
8➤ మనిషిని సృష్టించడానికి వాడిన పదార్థమేది?
,=> నేలమన్ను (2:7)
9➤ ఏదెను తోటను కాయడానికి దేవుడు ఎవరిని నియమించాడు?
,=> మనిషిని (2:15)
10➤ బైబిలులో మొదటి ప్రశ్న వేసిందెవరు?
,=> సర్పం (3:1)
11➤ ఆదాము హవ్వలు తమనుతాము కప్పుకోవడానికి దేన్ని వాడారు?
,=> అంజూరపు ఆకులు (3:7)
12➤ ఆదాము హవ్వల కోసం చర్మపు చొక్కాలను కుట్టిందెవరు?
,=> దేవుడు (3:21)
13➤ ఆదాము హవ్వలు తోటనుండి వెలివేయబడిన తరువాత తోటను కాయడానికి నియమించబడిన కావలి ఎవరు?
,=> కెరూబులు (3:24)
14➤ ఈ లోకంలో పుట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?
,=> కయీను (4:1)
15➤ మొదట మరణించిన వ్యక్తి పేరేమిటి?
,=> హేబెలు (4:8)
16➤ యెహోవా సన్నిధినుండి వెళ్ళిపోయిన తరువాత కయీను ఏ స్థలంలో జీవించాడు?
,=> నోదు దేశం (4:15)
17➤ మనిషి నిర్మించిన మొదటి పట్టణం ఏది?
,=> హనోకు (4:17)
18➤ సితారా, పిల్లన గ్రోవిని వాయించే వారందరికి మూల పురుషునిగా పేర్కొన బడిన వ్యక్తి ఎవరు?
,=> యూబాలు (4:21)
19➤ పశువులను కలిగి గుడారాల్లో జీవించేవారందరికి మూల పురుషుడు ఎవరు?
,=> యాబాలు (4:20)
20➤ యెహోవా నామమున ప్రార్థించడం మొదలైంది ఎవరి కాలంలో?
,=> ఎనోషు (4:26)
21➤ ఎవరి పోకలికలో మనిషి సృష్టించబడ్డాడు?
,=> దేవుని పోలికలో (5:1)
22➤ దేవునితో నడిచిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?
,=> హనోకు, నోవహు (5:24; 6:9)
23➤ ఆదికాండంలో మరణాన్ని చవిచూడకుండానే కొనిపోబడిన వ్యక్తి ఎవరు?
,=> హనోకు (5:24)
24➤ 'నీవు తినవద్దని' దేవుడు ఆజ్ఞాపించిన ఫలం ఏమిటి?
,=> మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు (2:17)
25➤ ఈ భూమిమీద దీర్ఘాయువుతో జీవించిందెవరు?
,=> మెతూషెల (5:27)
26➤ నోవహు పేరుకు అర్థం ఏమిటి?
,=> ఆదరణ (5:29)
27➤ యెహోవా దృష్టియందు కృప పొందినదెవరు?
,=> నోవహు (6:8)
28➤ ఓడను తయారుచేయడానికి నోవహు వాడిన చెక్క ఏమిటి?
,=> చితిసారకపు చెట్టు (6:14)
29➤ నోవహు కుమారుల పేర్లను వ్రాయండి?
,=> షేము, హాము, యాపెతు (6:10)
30➤ ఓడ తలుపులను మూసిందెవరు?
,=> దేవుడు (7:16)
31➤ ఎన్ని రోజులు భూమిమీద నీళ్ళు నిలిచివున్నాయి?
,=> 150 రోజులు (7:24)
32➤ ఓడ కొండమీదికి ఎప్పుడు చేరింది?
,=> 7వ నెల 17వ రోజున (8:4)
33➤ బైబిలులో మొదటిసారిగా ప్రస్తావించబడిన పక్షి పేరేమిటి?
,=> కాకి (8:7)
34➤ నోవహుచేత శపించబడిందెవరు?
,=> హాము (9:22-25)
35➤ నోవహుతో దేవుడు చేసిన నిబంధనకు సూచన ఏమిటి?
,=> వర్ష ధనస్సు (9:13)
36➤ ఒక రాజు పేరు, ఒక స్థలంపేరు ఒక్కటే, అదేమిటి?
,=> మేషా (10:29,30; 2 రాజులు 3:4,27)
37➤ పూర్వం ఐగుప్తుకు ఉన్న పేరేమిటి?
,=> మిస్రాయిము (10:6)
38➤ ఇతియోపీయులను ఎలా పేర్కొనేవారు?
,=> కూషు (10:6)
39➤ బంగారంగల ప్రాంతం ఏది?
,=> హవీలా దేశం (2:11,12)
40➤ ఆకాశాన్ని తాకే గోపురాన్ని ప్రజలు ఎక్కడ నిర్మించారు?
,=> షీనారు (11:1-3).
41➤ మనుష్యుల భాషను దేవుడు తారుమారు చేసింది ఎక్కడ?
,=> బాబెలు (11:9)
42➤ యోబు స్వస్థలమూ మరో వ్యక్తి పేరూ ఒక్కటే. అదేమిటి?
,=> ఊజు (10:23)
43➤ యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు ఎవరు?
,=> నిమ్రోదు (10:8,9)
44➤ అబ్రహాము బలిపీఠాన్ని మొదట ఎక్కడ కట్టాడు?
,=> కనాను (12:7)
45➤ బైబిలులో మొదటి ప్రవచనం ఎక్కడ ఉంది?
,=> ఆది 3:15
46➤ సువార్తకు మూలంగా పేర్కొనబడిన వచనం ఏది?
,=> ఆది 3:15
47➤ చక్కని సౌందర్యంగల స్త్రీగా మొదటిసారి పిలువబడింది ఎవరు?
,=> శారయి (12:11)
48➤ శారయి తన సహోదరి అని అబ్రాము ఎక్కడ చెప్పాడు?
,=> ఐగుప్తులో (12:13, 14)
49➤ అబ్రాహాము ఆస్తికి వారసుడైన సేవకుని పేరు ఏమిటి?
,=> ఎలీయెజెరు (15:2)
50➤ లోతు తండ్రి పేరు, లోతు తాత చనిపోయిన స్థలం పేరు ఒక్కటే. అదేమిటి?
,=> హారాను (11:31,32)
51➤ మమే చెట్లు ఎక్కడ ఉన్నాయి?
,=> హెబ్రోను (13:18)
52➤ అబ్రాహామును కలుసుకోవడానికి సొదొమ రాజు ఏ లోయకు వెళ్ళాడు?
,=> రాజలోయ అను షావే లోయ (14:17).
53➤ షాలేము రాజు ఎవరు?
,=> మెల్కీసెదెకు (14:18)
54➤ అబ్రాహామును దీవించినప్పుడు రొట్టె, ద్రాక్షారసాన్ని తెచ్చిన యాజకుని పేరు ఏమిటి?
,=> మెల్కీసెదెకు (14:18)
55➤ అబ్రాహాము సమస్తంలో పదవ వంతును ఎవరికిచ్చాడు?
,=> మెల్కీసెదెకు (14:20)
56➤ 'మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుము' అని అబ్రాహాము ఎవరితో చెప్పాడు?
,=> సొదొమ రాజు (14:21)
57➤ సర్వోన్నతుడగు దేవుని యాజకునిగా ప్రస్తావించబడింది ఎవరు?
,=> మెల్కీసెదెకు (14:18)
58➤ ఐగుప్తునుండి కనాను దేశానికి ఎన్నో తరం వారు తిరిగొచ్చారు?
,=> 4వ తరం (15:16)
59➤ అబ్రాహాముకున్న ఐగుప్తీయురాలైన దాసి ఎవరు?
,=> హాగరు (16:1)
60➤ 'అడవి గాడిదవంటి మనుష్యుడు' అని పేర్కొనబడినది ఎవరు?
,=> ఇష్మాయేలు (16:11,12)
61➤ యెహోవా దూత స్వరాన్ని మొదటిసారి విన్న స్త్రీ పేరేమిటి?
,=> హాగరు (16:7, 8)
62➤ ఏ రోజున ఇశ్రాయేలీయుడు సున్నతి పొందాల్సి వుంటుంది?
,=> ఎనిమిదవ రోజున (7:12)
63➤ పుట్టకముందే ఏ వ్యక్తికి పేరు పెట్టబడింది?
,=> ఇష్మాయేలు (16:11)
64➤ యెహోవా దూత హాగరుతో ఎక్కడ మాట్లాడాడు?
,=> బెయేర్ లహాయిరోయి (16:14)
65➤ తండ్రి, కుమారుడు ఒకే రోజున సున్నతి పొందారు. వారెవరు?
,=> అబ్రాహాము, ఇష్మాయేలు (17:26)
66➤ ఒక స్త్రీ పుట్టింది, చనిపోయింది. కాని సమాధి చేయబడలేదు. ఆమె ఎవరు?
,=> లోతు భార్య (19:26)
67➤ పుట్టకముందే వాగ్దాన పుత్రునిగా పేర్కొనబడిన వ్యక్తి పేరేమిటి?
,=> ఇస్సాకు (17:21)
68➤ సొదొమకోసం అబ్రాహాము విజ్ఞాపన చేసినప్పుడు అతడు పేర్కొన్న అత్యధిక నీతిమంతుల సంఖ్య ఎంత?
,=> 50 మంది (18:24)
69➤ సొదొమ, గొమొఱ్ఱ పట్టణాలను దేవుడు నాశనం చేసినప్పుడు, ఆయన ఎవరి ని జ్ఞాపకం చేసికొన్నాడు?
,=> అబ్రాహామును (19:28,29)
70➤ తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి అబ్రాహాము ఎక్కడికి వెళ్ళాడు?
,=> మోరీయా కొండకు (22:2)
71➤ పొట్టేలును బలిగా అర్పించిన స్థలానికి అబ్రాహాము ఇచ్చిన పేరేమిటి?
,=> యెహోవా యీరే (22:14)
72➤ బైబిలులో ప్రస్తావించబడిన మొదటి కల ఎవరికి కలిగింది?
,=> అబీమెలెకు (20:3)
73➤ 'ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు' ఆమె ఎవరు? ఆమె ఎవరి భార్య?
,=> శారయి, అబ్రాహాము భార్య (20:12)
74➤ అరణ్యంలో ఎలుగెత్తి ఏడ్చింది ఎవరు?
,=> హాగరు (21:16)
75➤ అబ్రాహాము, అబీమెలెకు కలిసి ప్రమాణం చేసిన స్థలానికి ఇవ్వబడిన పేరేమిటి?
,=> బెయేరైబా (21:31)
76➤ ఇస్సాకు భార్య ఎవరు?
,=> రిబ్కా (24:67)
77➤ రిబ్కాను తీసుకొని రావడానికి ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు?
,=> బెయేర్ లహాయిరోయి (24:62)
78➤ అబ్రాహాము శవం ఎక్కడ సమాధి చేయబడింది?
,=> మక్పేలా గుహ (25:9)
79➤ ఎవరి గర్భంలో రెండు జనములు, ఇద్దరు వ్యక్తులు పుట్టారు?
,=> రిబ్కా (25:23)
80➤ ఎవరి శరీరం రోమముల వస్త్రంవలె ఉంది?
,=> ఏశావు (25:25)
81➤ గర్భంలో తన సహోదరుని మడిమెను పట్టుకొంది ఎవరు?
,=> యాకోబు (25:26)
82➤ చిక్కుడుకాయల ఆహారంకోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నది ఎవరు?
,=> ఏశావు (25:34)
83➤ లూజు అనే ఊరికి ఇవ్వబడిన క్రొత్త పేరు ఏమిటి?
,=> బేతేలు (28: 19)
84➤ ఆకాశాన్ని తాకే నిచ్చెన గురించిన కల ఎవరికి కలిగింది?
,=> యాకోబు (28: 12)
85➤ తన తండ్రి విగ్రహాలను అపహరించింది ఎవరు?
,=> రాహేలు (31:19)
86➤ “నేను ముఖాముఖిగా దేవున్ని చూచితిని. అయినను నా ప్రాణము దక్కినది” అని చెప్పిందెవరు?
,=> యాకోబు (32:30)
87➤ యాకోబు దూతతో ఎక్కడ పెనుగులాడాడు?
,=> యబ్బోకు రేవు (32:22-24)
88➤ “నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యను” అని ఎవరు చెప్పారు?
,=> యాకోబు (32:26)
89➤ యాకోబు కుమార్తెయైన దీనాను తీసుకెళ్ళి పాడుచేసిందెవరు?
,=> షెకెము (34:2)
90➤ దేవుడు యాకోబును ఏ పేరుతో పిలిచాడు?
,=> ఇశ్రాయేలు (35:10)
91➤ తన భార్య సమాధిమీద స్థంభాన్ని కట్టించిందెవరు?
,=> యాకోబు (35:20)
92➤ అరణ్యంలో ఉష్ణధారలను కనుగొన్నదెవరు?
,=> అనా (36:24)
93➤ యాకోబు ఎక్కువగా ప్రేమించినది ఎవరిని?
,=> యోసేపు (37:3)
94➤ యోసేపు ఎన్ని తులాల వెండికి అమ్మబడ్డాడు?
,=> ఇరువది తులాల వెండి (37:28)
95➤ ఫరో యోసేపుకు పెట్టిన మరో పేరేమిటి?
,=> జప్నత్పనేహు (41:45)
96➤ తన చిన్న తమ్ముణ్ణి అమ్మిన పెద్దన్న ఎవరు?
,=> యూదా (37:26,27)
97➤ ఎవరినిబట్టి దేవుడు పోతిఫరు ఇంటిని ఆశీర్వదించాడు?
,=> యోసేపు (39:5)
98➤ “నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురు” అని ఎవరు చెప్పారు?
,=> (యాకోబు 42:38)
99➤ ఆవులు ఆవులను తినే కల ఎవరికి కలిగింది?
,=> ఫరో (41:1-4)
100➤ తన పుట్టిన రోజున విందు ఏర్పాటు చేసిందెవరు?
,=> ఫరో (40:20)
101➤ యోసేపు తన సహోదరులలో ఎవరిని పట్టుకొని బంధించాడు?
,=> షిమ్యోను (42:24)
102➤ తన గదిలో ఏడ్చిందెవరు?
,=> యోసేపు (43:30)
103➤ ఫరోకు తండ్రిగా దేవుడు ఎవరిని చేశాడు?
,=> యోసేపు (45:8)
104➤ 'బెయేరైబా' అనే పదానికి అర్థం ఏమిటి?
,=> ఏడు గొర్రెపిల్లల బావి, లేక సాక్ష్యార్థ మైన బావి (46:1), (21:28-32; 26:17-33కూడ చూడండి)
105➤ ఐగుప్తులో యాకోబు కుమారులు ఎక్కడ జీవించారు?
,=> గోషెను దేశం (47:6)
106➤ నీళ్ళవలె చంచలుడై బలాతిశయము పొందనిది ఎవరు?
,=> రూబేను (49:4)
107➤ 'నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు' ఎవరి ఆలోచన?
,=> షిమ్యోను, లేవి (49:5)
108➤ సముద్ర రేవున నివసించును అని ఎవరి గురించి యాకోబు చెప్పాడు?
,=> జెబూలూను (49:13)
109➤ విడువబడిన లేడివలె ఉండేది ఎవరు?
,=> నఫాలి (49:21)
110➤ తన తండ్రి ముఖంమీద పడి అతని గురించి యేడ్చి ముద్దుపెట్టుకొన్నది ఎవరు?
,=> యోసేపు (50:1)
111➤ గర్జించు సింహం అని యాకోబు ఎవరి గురించి సూచించాడు?
,=> యూదా (49:9)
112➤ 'త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను' ఉన్నది ఎవరు?
,=> దాను(49:17)
113➤ 'ఫలించెడి కొమ్మ'గా సూచించబడినది ఎవరు?
,=> యోసేపు (49:22)
114➤ 'చీల్చునట్టి తోడేలు'వలె ఉన్నది ఎవరు?
,=> బెన్యామీను (49:27)
115➤ 'దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెను' అని చెప్పిందెవరు?
=> యోసేపు (50:25)