1➤  ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> ఆమోసు
2➤  ఆమోసు ఇల్లు ఎక్కడ?
,=> కోవ (1:1)
3➤  ఆమోసు పేరుకు అర్ధం ఏమిటి?
,=> బరువును మోయుట
4➤  ఆమోసు కాలంలో యూదాను ఎవరు పాలించారు?
,=> ఉజ్జియా (1:1)
5➤  ఆమోసు కాలంలో ఉన్న ఇశ్రాయేలు రాజు ఎవరు?
,=> యరోబాము (1:1)
6➤  ఏ ప్రవక్త కాలంలో భూకంపం సంభవించింది? 
,=> ఆమోసు (1:1)
7➤  పశువుల కాపరుల్లోనుండి వచ్చిన ప్రవక్త ఎవరు?
,=> ఆమోసు (1:1)
8➤  ఆమోసు ప్రవచనం ప్రకారం ఏ శిఖరం ఎండిపోతుంది?
,=> కర్మలు శిఖరం (1:2)
9➤  ఇనుప పనిముట్లతో నూర్చబడిన దేశం ఏది? 
,=> గిలాదు (1:3)
10➤  ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిన దేశమేది?
,=> దమస్కు (1:3)
11➤   ఏ లోయలో ఉన్న నివాసులు దేవునిచేత నిర్మూలము చేయబడుతారు?
,=> ఆమెను లోయ (1:5)
12➤  సిరియనులు చెరకు కొనిపోబడినది ఎక్కడికి? 
,=> కీరు దేశం (1:5)
13➤  చెరపట్టబడినవారిని ఎదోముకు అప్పగించింది ఎవరు? 
,=> గాజా (1:6,7)
14➤   సహోదర నిబంధనను జ్ఞాపకము చేసుకొనకుండా పట్టబడిన వారినందరిని ఎదోమీయులకు అప్పగించినది ఎవరు?
,=> తూరు (1:9,10)
15➤  ఎడతెగని కోపాన్ని కలిగియున్నది ఎవరు?
,=> ఎదోమీయులు (1:11)
16➤  గిలాదులో గర్భిణి స్త్రీల కడుపులను చీల్చినది ఎవరు? 
,=> అమ్మోనీయులు (1:13)
17➤  ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసినదెవరు?
,=> మోయాబు (2:1)
18➤  బాకా నాదముతో, రణ కేకలతో చనిపోయింది ఎవరు?
,=> మోయాబు (2:2)
19➤  జత చెప్పులకోసం బీదవారిని అమ్మివేసినదెవరు?
,=> ఇశ్రాయేలు (2:6)
20➤   దేవదారు చెట్టంత ఎత్తు ఎవరున్నారు?
,=> అమోరీయులు (2:9)
21➤  ఏ దేశాన్ని స్వాధీనపరచుకోవాలని దేవుడు ఇశ్రాయేలును నలభై సంవత్స రాల పాటు అరణ్యంలో నడిపించాడు?
,=> అమోరీయుల దేశం (2:10)
22➤  'సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా?' అని ఎవరు అన్నారు?
,=> ఆమోసు (3:3)
23➤  'తన సేవకులకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా యేమియు చేయడు' ఆయన సేవకులు ఎవరు?
,=>  ప్రవక్తలు (3:7)
24➤  దేవుడు పడగొట్టే రెండు నగరులు (ఇండ్లు) ఏవి?
,=> చలికాలపు ఇల్లు,
25➤   దేవుడు పడగొట్టే రెండు నగరులు (ఇండ్లు) ఏవి?
,=> వేసవి కాలపు ఇల్లు (3:15)
26➤  ఇశ్రాయేలు స్త్రీలను సాదృశ్యంగా ఆమోసు దేనితో పోల్చాడు?
,=> బాషాను ఆవులతో (4:1)
27➤  మంటలోనుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొనువారు ఎవరు?
,=> ఇశ్రాయేలు (4:11)
28➤  . 'మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి' అని ఏ ప్రవక్త చెప్పాడు?
,=> ఆమోసు (4:12)
29➤  చెడు కాలంలో ఊరకుండేది ఎవరు? 
,=> బుద్ధిమంతుడు (5:13)
30➤  ఎవరి ఉపద్రవాన్ని గురించి ఇశ్రాయేలు చింతపడలేదు?
,=> యోసేపు (6:6)
31➤  నక్షత్ర దేవత ఎవరు? 
,=> మోలెకు దేవత (5:26)
32➤  మొలుస్తున్న గడ్డిని గురించిన దర్శనం ఎవరికి కలిగింది?
,=> ఆమోసు (7:1)
33➤  గడ్డి మొలుస్తున్నప్పుడు దేవునిచేత పుట్టించబడిన జీవి ఏది?
,=> మిడుత (7:1)
34➤  మట్టపు గుండు దర్శనం ఎవరికి కలిగింది?
,=> ఆమోసు (7:8)
35➤  ఆమోసు గురించి రాజుకు అబద్దం చెప్పిన ప్రవక్త ఎవరు?
,=> అమజ్యా (7:10)
36➤   'దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> ఆమోసుతో అమజ్యా చెప్పాడు (7:12)
37➤  పశువుల కాపరి మరియు మేడి పండ్లను ఏరుకొన్న ప్రవక్త ఎవరు?
,=> ఆమోసు (7:14)
38➤   గొర్రెల మందను కాస్తున్నప్పుడు ఏ ప్రవక్త దేవునిచేత పిలువబడ్డాడు?
,=> ఆమోసు (7:15)
39➤  వేసవి కాల పండ్లగంప దర్శనం ఎవరికి కలిగింది? 
,=> ఆమోసు (8:1)
40➤   'అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామము కాదు' అని ఎవరు చెప్పారు? 
,=> ఆమోసు (8:11)
41➤  బలిపీఠానికి పైన నిలిచియున్న యెహోవాను ఏ ప్రవక్త చూశాడు?
,=> ఆమోసు (9:1)
42➤  గడపలు కదలిపోవునట్లు పై కమ్ములను కొట్టుమని దేవుడు ఎవరికి ఆదేశించాడు?
,=> ఆమోసు (9:1)
43➤   ఏ పర్వత శిఖరంనుండి దేవుడు వెదికి కనుక్కొంటాడు?
=> కర్మేలు పర్వత శిఖరం (9:3)
