Telugu Bible Quiz on Mark | మార్కు సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telegu on Mark | Telugu catholic bible quiz questions and answers | Telugu Bible quiz Online

Author

 మార్కు సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్ 

Mark Suvartha Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Mark Book | Telugu Bible Quiz on Mark With Answers



1➤ మార్కు గ్రంథమును వ్రాసినదెవరు?

=> మార్కు

2➤ మార్కు మరియొక పేరేమి?

=> యోహాను (12:12, 25)

3➤ మార్కు సువార్తలో చెప్పబడిన మొదటి ప్రవక్త ఎవరు?

=> యెషయ (1:3)

4➤ మార్కు సువార్త ఏసును ఏ విధముగా చిత్రించెను?

=> పరిచారకునిగా లేక సేవకునిగా (10:45)

5➤ ఎడారిలో ప్రజలకు బప్తీస్మమిచ్చినదెవరు?

=> యోహాను (1:4)

6➤ పాప క్షమాపణ మరియు హృదయపరివర్తనము అనెడు బాప్తీస్మమును ఇచ్చినదెవరు?

=> యోహాను (1:4)

7➤ అన్నింటికన్న చిన్న సువార్త గ్రంథమేది?

=> మార్కు సువార్త

8➤ నేను వంగి ఆయన పాదరక్షలవారు విప్పుటకైనను యోగ్యుడను కాను అని చెప్పినదెవరు?

=> బప్తీస్మమిచ్చు యోహాను (1:7)

9➤ పవిత్రాత్మతో బప్తీస్మమిచ్చునది ఎవరు?

=> ఏసుక్రీస్తు (1:8)

10➤ ఎవరు క్రీస్తును ఎడారికి పంపెను?

=> పవిత్రాత్మ (1:12)

11➤ ఏసు ఎడారిలో ఎవరితో ఉండెను?

=> మృగముల మధ్య జీవించెను (1:13)

12➤ మొదటిగా క్రీస్తు సువార్తను ఎచట బోధించెను?

=> గలిలీయలో (1:14)

13➤ కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయపరివర్తనముచెంది సువార్తను విశ్వసించుడి అని చెప్పినదెవరు?

=> క్రీస్తు (1:13)

14➤ మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టు జాలరులుగా చేసెదను అని చెప్పినదెవరు?

=> ఏసుక్రీస్తు పేతురుతోను, అంద్రియతోను (1:16, 17)

15➤ పడవలో వలలను బాగుచేసుకొనుచున్న ఎవరిని పిలిచెను?

=> యాకోబును, యోహానును (1:19)

16➤ ధర్మశాస్త్ర బోధకులవలెగాక అధికార పూర్వకముగా బోధించినదెవరు?

=> ఏసుక్రీస్తు (1:22)

17➤ నలుగురు మనుషులచే మోయబడుచున్న పక్షవాతరోగిని ఏసు ఎచ్చట స్వస్థత పరచెను?

=> కఫర్నాము (2:2)

18➤ కుమారా! నీ పాపములు క్షమించబడినవి అని ఏసు ఎవరితో అనెను?

=> పక్షవాతరోగితో (2:5)

19➤ మత్తయికి మరియొక పేరేమి?

=> లేవి (2:14)

20➤ లేవి తండ్రి ఎవరు?

=> అల్పయి (2:14)

21➤ ఏ పట్టణమున లేవి సుంకమును వసూలుచేయుచుండెను?

=> కఫర్నాము

22➤ యేసు శిష్యులు ఎచ్చట గోధుమ వెన్నులు త్రుంచిరి?

=> గలిలీయలో (2:23, 27)

23➤ జబదాయి కుమారులకు ఏసు ఏమని పేరు పెట్టెను?

=> బోవనేర్లైసు (3:17)

24➤ ఉరిమెడివారు అని ఎవరికి పేరు పెట్టబడెను?

=> యాకోబు, యోహానులకు (3:17)

25➤ యేసు సీమోనును ఏమని పిలిచేవారు?

=> పేతురు (3:16)

26➤ భవనేరసు అను పదమునకు అర్ధమేమి?

=> ఉరిమెడువారు (3:17)

27➤ గాలియు, సముద్రము సయితము ఈయనకు లోబడుచున్నవి? అని అన్నదెవరు?

=> యేసు శిష్యులు (4:41)

28➤ అపవిత్రాత్మతో బాధపడుచున్న అతని పేరేమిటి?

=> దళము (5:9)

29➤ యేసు తమకు చేసిన ఉపకారమును గూర్చి దయ్యము పట్టినవారు ఏ ప్రాంతమున ప్రకటించిరి?

=> దెకపోలి అను ప్రాంతమున (5:20)

30➤ ఏ అధికారి అనుచరులు వచ్చి అతని కుమార్తె మరణించినది, గురువును శ్రమ పెట్టనేల?అనిరి.

=> యాయీరు (5:35)

31➤ భయపడవద్దు విశ్వాసమును కలిగి యుండుము అని యేసు ఎవరితో చెప్పెను?

=> మందిరాధ్యక్షునితో (5:36)

32➤ మందిరాధ్యక్షుని గృహమునకు వెళ్ళునప్పుడు ఆయనతో కూడ వెంబడించిన శిష్యులెవరు?

=> పేతురు, యాకోబు, యోహాను (5:37)

33➤ యాయీరు కుమార్తెతో ఏసు ఏమని చెప్పెను?

=> తలితాకుమీ (5:41)

34➤ తలితాకుమీ అను పదమునకు అర్థమేమి?

=> ఓ బాలికా లెమ్ము! (5:41)

35➤ ఎక్కడ యేసు అద్భుత కార్యములు చేయలేదు?

=> తన స్వంత ఊరిలో (6:5)

36➤ హేరోదు యేసు ఎవరని భావించెను?

=> తాను శిరచ్ఛేదనము గావించిన యోహానే అనిభావించెను (6:1,5)

37➤ ఫిలిప్పు భార్య హేరోదియ నిమిత్తము ఎవరు చెరసాలలో పెట్టబడిరి?

=> బప్తీస్మమిచ్చు యోహాను (6:17)

38➤ ఎప్పతా అను పదమునకు అర్థమేమి?

=> తెరువబడుము (7:34)

39➤ యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని ఎవరికి తెలియును?

=> హేరోదు రాజుకు (6:20)

40➤ ఎవరు జన్మదిన వేడుకలు జరుపుకొనిరి?

=> హేరోదు రాజు (6:21)

41➤ నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చెదను అని ఎవరు ఎవరితో అనిరి?

=> హేరోదియ కుమార్తెతో హేరోదు అనెను (6:22)

42➤ యోహాను తలకొట్టించి ప్లేటులో పెట్టి ఇవ్వమని హేరోదును ఎవరు అడిగిరి?

=> హేరోదియ కుమార్తె (6:25)

43➤ చెరసాలలో ఎవరి శిరసు ఖండించబడెను?

=> బాప్తీస్మమిచ్చు యోహాను తల (6:27)

44➤ ఎచట రోగులను స్వస్థతకొరకు సంతలలోను బహిరంగ ప్రదేశములలోను ఉంచిరి?

=> గెన్నెసరేతు ప్రాంతమున (6:56)

45➤ ఏసును తాకిన ప్రతి రోగి స్వస్థత నొందెను, ఏ ప్రాంతమున

=> గెన్నెసరేత ప్రాంతమున (6:56)

46➤ కపట ప్రవక్తలగురించి ఎవరు ప్రవచించిరి?

=> యెషయా (7:6)

47➤ పాపాత్మురాలు ఎటువంటి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొనివచ్చెను?

=> చలువరాతి పాత్రలో (7:36)

48➤ బిడ్డల రొట్టెలను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని ఎవరు ఎవరితో అనిరి?

=> సిరోఫెనిష్యాలో పుట్టిన గ్రీకు దేశమునకు చెందిన స్త్రీతో యేసు పలికెను (7:26)

49➤ మార్కు సువార్తలో ఏసయ్య చేసిన రెండు అద్భుత కార్యములు ఏవి?

=> మూగ చెవుడుగల వానిని మరియు ఒక గ్రుడ్డివానికి చూపును ప్రసాదించుట (7:31-37,8:22)

50➤ ఏసు మూగ చెవుడుగలవానిని ఎక్కడ స్వస్థతపరచెను?

=> దెకపోలిలో (7:3)

51➤ యేసు ఎవరిని సమూహహునుండి తీసుకొని వెళ్ళి స్వస్థతపరచెను?

=> నత్తి చెవుడుగలవానిని (7:33)

52➤ యేసు మూగ, చెవుడు గలవానిని చూచి ఏమని పలికెను?

=> ఎప్పతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడుము అని అర్థం (7:34)

53➤ ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు. ఈ మాటలను ఎవరు వ్రాసిరి?

=> మార్కు(7:37)

54➤ నాలుగు వేలమందికి యేసు ఎక్కడ భోజనము పెట్టించెను?

=> దెకపోలి (7:31, 8:9)

55➤ యేసును శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఎవరు అడిగిరి?

=> పరిసయ్యులు (8:11)

56➤ మనుషులు చెట్లులాగ నడుచుచున్నారని గ్రుడ్డివాడు ఎచ్చట చెప్పెను?

=> బెత్సయిదా (8:22,24)

57➤ ఎవరికి తెలియకూడదని తలంచి యేసు ఎక్కడికి పయనించెను?

=> గలిలియకు (9:30)

58➤ నీ కనులు నిన్ను అభ్యంతర పరచిన యెడల ఏమి చేయుమని యేసు బోధించెను?

=> దానిని తీసిపారవేయమనెను (9:47)

59➤ యేసు మాటలలో ఏ విధమైన మనుష్యులు దేవుని రాజ్యములో ప్రవేశింతురు?

=> చిన్నబిడ్డలవలె దేవుని రాజ్యమును అంగీకరించినవారు (10:14)

60➤ మనలో ఎవరైనా గొప్పవారై ఉండగోరిన అతను ఎలా ఉడాలి?

=> సేవకునివలె (10:43)

61➤ యేసు తనకు తానుగా ఏ గ్రుడ్డివానిని దగ్గరకు పిలిచెను?

=> బర్తమయి అను గ్రుడ్డివానిని (10:46,47)

62➤ బర్తిమయి తండ్రి ఎవరు?

=> తిమయి (10:46)

63➤ యేసు బర్తిమయిని ఎక్కడ స్వస్థతపరచెను?

=> జెరికో (10:46, 47)

64➤ పొరుగువాడు అంటే ఎవరు?

=> అపాయములో కనికరము చూపినవాడే (10:35)

65➤ యేసు ఫలించని దేనిని నాశనము చేసెను?

=> అంజూరపు చెట్టును శపించెను (11:14)

66➤ ఎవరు అంజూరపు చెట్టులో ఏమైన దొరుకునేమోయని పరిశీలించిరి?

=> యేసు (11:13)

67➤ ఏ శిష్యుడు అంజూరపు చెట్టు ఎండిపోవుటచూచి యేసుకు చెప్పెను?

=> పేతురు (11:21)

68➤ సర్వాంగ హోమములన్నింటికంటెను బలుల కంటెను శ్రేష్ఠమైనది ఏది?

=> ఒకడు తనవలె తన పొరుగువానిని ప్రేమించుటయు అన్నింటికంటె శ్రేష్ఠమైనది (12:33)

69➤ ఎంత డబ్బును ఒక బీద విధవరాలు కానుకల పెట్టెలో వేసెను?

=> రెండు కాసులు (12:42)

70➤ ఎవరు తనకున్న సర్వస్వము కానుకల పెట్టెలో వేసెను?

=> ఒక బీద విధవరాలు (12:44)

71➤ కుష్టురోగియైన సీమోను ఇల్లు ఎక్కడ ఉంది?

=> బెతానియా (143)

72➤ ఏరకమైన సుగంధ ద్రవ్యమును ఒక స్త్రీ యేసు తలపై పోసెను?

=> మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును (14:3)

73➤ అందరు విడిచివెళ్ళినను నేను మాత్రం మిమ్ము విడిచివెళ్ళనని ఏ శిష్యుడు యేసుతో అనెను?

=> పేతురు (14:29)

74➤ తండ్రీ నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించుము అని ఎవరు తండ్రిని వేడిరి?

=> ఏసుక్రీస్తు (14:36)

75➤ నీవు యూదులరాజువా! అని క్రీస్తును ప్రశ్నించినదెవరు?

=> పిలాతు (15:12)

76➤ కురేనీయుడైన సీమోను కుమారులెవరు?

=> అలెక్సండ్రు, రూపు (15:21)

77➤ మరణము పొందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను అని ఎవరు ప్రవచించిరి?

=> యెషయా (15:28)

78➤ యేసు లేచిన తరువాత మొదటిగా ఎవరికి కనిపించెను?

=> మగ్దలేన మరియకు మొదట కనిపించెను (16:9)