Q ➤ 1. బైబిలులో గ్రంథస్తము చేయబడిన మొట్టమొదటి నరహంతకుడు ఎవరు?
Q ➤ 2. చంపబడిన ఆ వ్యక్తి పేరేమిటి?
Q ➤ 3. మొట్టమొదటి తండ్రి ఎవరు?
Q ➤ 4. అతని మూడవ కుమారుని పేరు ఏమిటి?
Q ➤ 5. "దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను" - ఇతడెవరు?
Q ➤ 6. దేవుని ఆజ్ఞప్రకారము ఓ ఓడను నిర్మించిన దెవరు?
Q ➤ 7. అతని ముగ్గురు కుమారుల పేర్లు వ్రాయుము?
Q ➤ 8. మొట్టమొదటి మనుష్యుడు మరియు అతని భార్యయొక్క ఆనంద నిలయము ఏమిటి?
Q ➤ 9. హవ్వను శోధించిన ప్రాకు జంతువు పేరు చెప్పుము?
Q ➤ 10. ఓ ఆది మానవుల గుంపు షీనారులో ఓ గోపురాన్ని నిర్మించారు, దాని పేరు ఏమిటి?
Q ➤ 11. భూమి మరెన్నడూ నీటిముంపుకు గురికాదని దేవుడు చూపించిన గుర్తు ఏమిటి?
Q ➤ 12. బైబిలులో అత్యధిక కాలము బ్రతికిన వ్యక్తి పేరు చెప్పుము?
Q ➤ 13. "సీతారాను సానికను వాడుక చేయువారందరికిని మూల పురుషుడు" - అని ఎవరిని గూర్చి చెప్పబడినది?
Q ➤ 14. "పదునుగల ఇత్తడి పనిముట్లన్నిటిని చేయువాడు" - ఎవరు?
Q ➤ 15. “యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు" - ఎవరు?