Telugu Bible Quiz on What in the bible ➤ ఏమిటి? పై తెలుగు బైబుల్ క్విజ్
Author -
personAuthor
June 09, 2022
share
Q ➤ 1. "మీరు ఆచరించు ఈ ఆచారమేమిటి?"Ans ➤ జ. పస్కాపండుగనుగూర్చి ఇశ్రాయేలు తరువాయి తరానికి సంబంధించిన కుమారులు అడుగుటను గూర్చి ఓ ప్రశ్న (నిర్గమ. 12:26)
Q ➤ 2. "మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి?” Ans ➤ జ. బాప్తిస్మమిచ్చు యోహానును చూచుటకై వెళ్ళిన ప్రజలతో ప్రభువైన యేసు (మతాయి 11:7,8)
Q ➤ 3. "అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల?"Ans ➤ జ. కోరహుతో మోషే (సంఖ్యా. 16:11)
Q ➤ 4. "నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి."Ans ➤ జ. "మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి?"
Q ➤ 5. "ఈ రాళ్ళెందుకు?" Ans ➤ జ. యొర్దాను నదిలో నిలబెట్టబడిన రాళ్ళను గూర్చి ఇశ్రాయేలీయులను తమ పిల్లలు అడుగబోవు విషయముగూర్చిన ప్రశ్న (యెహోషువ 4:6)
Q ➤ 7. "దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితివా?Ans ➤ జ. ఏలీయాతో సారెపతు విధవరాలు (1 రాజులు 17:18)
Q ➤ 8. "సమాధానముతో నీకేమి పని?" Ans ➤ జ. "సమాధానముగా వచ్చుచున్నారా?" అని అడిగిన రాజైన యెహోరాము దాసులతో యెహూ (2 రాజులు 9:18)
Q ➤ 11. "ఎఫ్రాయిమూ—బొమ్మలతో నాకిక నిమిత్తమేమి?" Ans ➤ జ. హోషేయ పలికిన ఓ ప్రవచనము (హోషేయ 14:8)
Q ➤ 12. "న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవునియెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా. యెహోవా నిన్నడుగుచున్నాడు?"Ans ➤ జ. మీకా ప్రవక్త పలికిన ఓ మాట (మీకా 6:8)
Q ➤ 13. "మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి?"Ans ➤ జ. కొండమీది ప్రసంగములోని ఓ వచనము (మత్తయి 5:47)
Q ➤ 14. "దానితో మాకేమి? నీవే చూచుకొనుము." Ans ➤ జ. ముప్పది వెండి నాణెములు అతడు తిరిగి ఇచ్చినప్పుడు యూదా ఇస్కరియోతుతో ప్రధానయాజకుడు (మత్తయి 27:4)
Q ➤ 15. "నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి?"Ans ➤ జ. "ఇతని సంగతి ఏమగును?" అని యేసు ప్రేమించిన శిష్యునిగూర్చి పేతురు | అడిగినప్పుడు యేసు పేతురుతో పలికిన మాట. (యోహాను 21:22)