Q ➤ 1. యిర్మీయా ఒక చెట్టు చువ్వ పైకి ఎదిగి వచ్చుట చూచాడు. ఆది ఏ చెట్టు?
Q ➤ 2. "అతని ఫలము నా జిహ్వకు మధురము" - అని ఓ బైబిలు రచయిత ప్రభువును ఒక వృక్షముతో పోల్చుచున్నాడు. అది ఏ వృక్షము?
Q ➤ 3. సొలొమోను దేవాలయముకొరకై కొన్ని వృక్షములు లెబానోనులో నరికింప బడ్డాయి. ఆ వృక్షములు పేరు తెలుపుము?
Q ➤ 4. ఏలీయా ప్రవక్త ఒక వృక్షముక్రింద కూర్చొని మరణించాలని ఆశించాడు. ఆ వృక్షము పేరు తెలుపుము?
Q ➤ 5. ఒక రాజకుమారుడు ఈ వృక్షమునకు వ్రేలాడదీయబడ్డాడు. ఆ వృక్షము పేరు తెలుపుము?
Q ➤ 6. దురదగొండి చెట్లకు బదులుగా ఏ వృక్షము మొలుచును?
Q ➤ 7. "పరిశుద్ధాలయపు అలంకారము" నిమిత్తమై మూడు వృక్షములు తీసికొని రాబడ్డాయి. ఆ మూడు వృక్షముల పేర్లు తెలుపుము?
Q ➤ 8. విమోచింపబడినవారు పరలోకమందు ఏ చెట్టు కొమ్మలను పట్టుకొని ఉంటారు?
Q ➤ 9. ఒక పావురము తన నోట ఏ చెట్టు ఆకును తీసుకొని వచ్చింది?
Q ➤ 10. చెఱపట్టబడినవారు తమ సితారాలను ఏ చెట్లకు తగిలించారు?
Q ➤ 11. రాజైన సౌలు తన సైన్యముతో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై ఏ చెట్టుక్రింద దిగి ఉండెను?
Q ➤ 12. ఆమోసు ప్రవక్త ఏ చెట్టుపండ్లు ఏరుకొనెడివాడు?
Q ➤ 13. నోవహు ఓడ ఏ చెట్టుమ్రానులతో తయారుచేయబడింది?
Q ➤ 14. ప్రభువైన యేసు ఏ చెట్టును శపించి ఎండిపోజేశాడు?
Q ➤ 15. జ్ఞానులు తెచ్చిన కానుకలలో ఒక చెట్టుయొక్క సుగంధ జిగురు గలదు. అది ఏ చెట్టు జిగురు?