Q ➤ 1. ఏ మొక్క షారోను పొలములో పెరిగింది?
Q ➤ 2. ఒక విత్తనము చిన్నదేగాని, ఇది పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అది ఏ చెట్టు?
Q ➤ 3. ఏ మొక్కలతో తయారుచేయబడిన పెట్టెలో ఓ శిశువు ఉంచబడ్డాడు?
Q ➤ 4. ఏ మొక్కల మోపులక్రింద రాహాబు ఇద్దరు మనుష్యులను దాచి పెట్టింది?
Q ➤ 5. మన ఆది పితరుల పాపమునుబట్టి ఏ మొక్కలు భూమిమీద మొలిచినవి?
Q ➤ 6. "సాలొమోను సహితము వీటిలో ఒకదానివలెనైనను అలంకరింప బడలేదు" అని దేనినిగూర్చి చెప్పబడింది?
Q ➤ 7. కొన్ని మొక్కలు నూర్చబడవుగాని "చువ్వచేత దుళ్ళగొట్టబడతాయి". ఆ మొక్కల పేరు తెలుపుము?
Q ➤ 8. ఏ మొక్క "ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది"?
Q ➤ 9. 'మన్నా' ఒక మొక్కయొక్క గింజలవలె ఉండెను అని పోల్చబడింది. ఏమిటా మొక్కలు?
Q ➤ 10. ఒక మొక్కనుండి తీయబడిన నూనె యోసేపుతోపాటు ఐగుప్తుకు చేరుకుంది. ఆ మొక్క పేరేమిటి?
Q ➤ 11. ఓ ఐగుప్తీయుడు తన కలలో ఈ మొక్క యొక్క పద్నాలుగు వెన్నులను చూచాడు. ఆ మొక్క పేరు తెలుపుము?
Q ➤ 12. మిద్యానీయులనుండి దాచుకొనుటకై గిద్యోను దేనిని గానుగ చాటున దుళ్ళగొట్టుచుండెను?
Q ➤ 13. ఏ పంట కోత సమయానికి ఇద్దరు స్త్రీలు బేత్లహేముకు తిరిగి వచ్చారు?
Q ➤ 14. ఓ ప్రవక్త "సర్వశరీరులను" దేనితో పోల్చిచెప్పాడు?
Q ➤ 15. తాను ఒక చెట్టునని తన తండ్రి వ్యవసాయకుడని ప్రభువైన యేసు తననుగూర్చి తాను చెప్పుకున్నాడు. ఆ చెట్టు పేరు తెలుపుము?