Q ➤ 1.పరిశుద్ధ గ్రంథములో దేవుని సృష్టిని గూర్చి వివరించు పుస్తకము ఏది?
Q ➤ 2.స్త్రీ గర్భము నుండి జన్మించని మొట్టమొదటి నరుడు ఎవరు?
Q ➤ 3.బైబిల్నందు మొదటి గ్రంథం ఏది?
Q ➤ 4.ఆదికాండమును రచించినదెవరు?
Q ➤ 5.ఆదికాండములో ఎన్ని అధ్యాయాలున్నాయి?
Q ➤ 6.ఆదికాండములో ఉన్న వచనములు ఎన్ని?
Q ➤ 7.ఆదికాండములో మూల వచనం ఏది?
Q ➤ 8.నరుడు ఎవరి పోలిక చొప్పున సృజింపబడ్డాడు?
Q ➤ 9.దేవుడు హవ్వను దేనితో సృజించాడు?
Q ➤ 10. ఇది నిజమా? అని ఏదేను తోటలో ఎవరు ఎవరిని ప్రశ్నించారు.
Q ➤ 11. ఏదేను తోటలో దేవుడు ఏర్పాటుచేసిన రెండు ముఖ్యమైన వృక్షముల పేరులు ఏమిటి?
Q ➤ 12. తల్లి గర్భము నుండి జన్మించిన మొట్ట మొదటి మానవుడు ఎవరు?
Q ➤ 13. దేవుడు భూమి మీద వర్షము కురిపించనపుడు నేలను తడిపినది ఏది?
Q ➤ 14. ఎవరి నిమిత్తము నేల శపించబడినది?
Q ➤ 15. ఆదాము యొక్క మూడవ కుమారుని పేరు ఏమి?
Q ➤ 16. దేవుడు కయీనును ఏమని శపించాడు?
Q ➤ 17. ఎవరి పుట్టుక తరువాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది?
Q ➤ 18. ఆదాము బ్రతికిన దినములు ఎన్ని?
Q ➤ 19. చితిసారకపు మ్రానుతో ఓడను తయారుచేసి దానికి లోపట వెలుపట ఏమి పూయవలెనని దేవుడు నోవహుతో చెప్పాడు?
Q ➤ 20. జలప్రళయము తరువాత దేవుడు నోవహుతో చేసిన నిబంధనకు గుర్తుగా దేనిని మేఘములలో (ఆకాశములో) ఉంచెను?
Q ➤ 21. నోవహు ముగ్గురు కుమారులు పేరులు ఏవి?
Q ➤ 22. 300 ఏండ్లు దేవునితో నడచిన తరువాత దేవుడు తీసుకుపోయిన వ్యక్తి ఎవరు?
Q ➤ 23. ఊరు దేశమునుండి దేవుడు అబ్రామును పిలిచిన విధానమును సూచించు అధ్యాయము ఏది?
Q ➤ 24. శారా అనగానేమి?
Q ➤ 25. 'చూచుచున్న దేవుడవు నీవే' అని దేవునికి పేరు పెట్టినదెవరు?
Q ➤ 26. మోరియా పర్వతముపై తన కుమారుడైన ఇస్సాకుకు బదులుగా బలి అర్పించుటకు దేవుడు ఒక పొట్టేలును చూపినందున ఆ చోటుకు అబ్రాహాము పెట్టిన పేరు ఏమి?
Q ➤ 27. సొదొమలోనున్న ఎవరి రక్షణ నిమిత్తము అబ్రాహాము దేవుని సన్నిధిలో మొర్రపెట్టెను?
Q ➤ 28. సోదొమ నుండి లోతు తప్పించుకుపోయిన ఊరు ఏది?
Q ➤ 29. లోతు భార్య ఎందుకు ఉప్పు స్థంభమైనది?
Q ➤ 30.శారా బ్రతికిన దినములు ఎన్ని?
Q ➤ 31. అబ్రాహాము శారాను ఎక్కడ పాతిపెట్టెను?
Q ➤ 32. రిబ్కా సహోదరుడు ఎవరు?
Q ➤ 33. కెతూరా ఎవరి భార్య?
Q ➤ 34. అబ్రాహాము బ్రతికిన దినములు ఎన్ని?
Q ➤ 35. రిబ్కా, ఏశావును, యాకోబును కనినప్పుడు ఇస్సాకు ఎన్ని యేండ్లవాడు?
Q ➤ 36. రూబేను ఏ పండ్లను తన తల్లియైన లేయాకు తెచ్చియిచ్చెను?
Q ➤ 37. యాకోబు ఏ రేవు దగ్గర రాత్రంతయు దేవునితో పోరాడెను?
Q ➤ 38. దీనా తల్లీ ఎవరు?
Q ➤ 39. దేవుడు యాకోబు పేరు మార్చి ఏ పేరు పెట్టెను?
Q ➤ 40. యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించి అతనికొరకు ఏమి కుట్టించెను?
Q ➤ 41. ఫరో యోసేపునకు పెట్టిన పేరేమి?
Q ➤ 42. యోసేపు కుమారుల పేర్లు ఏమి?
Q ➤ 43. ద్విభాషి అని ఎవరికి పేరు కలిగెను?
Q ➤ 44. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబస్థులు ఎంతమంది?
Q ➤ 45.యాకోబు బ్రతికిన దినములు ఎన్ని?
Q ➤ 46. ఇశ్రాయేలు గోత్రములు ఎన్ని?
Q ➤ 47. యోసేపు బ్రతికిన దినములు ఎన్ని?
Q ➤ 48. తన యెముకలను ఎక్కడికి తీసుకొనిపోవలెనని యోసేపు ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను?
Q ➤ 49. యోసేపు ఎఫ్రాయిముయొక్క ఎన్నో తరము పిల్లలను చూచెను?
Q ➤ 50. మనషే కుమారుడైన మాకీరు కుమారులు ఎవరి ఒడిలో ఉంచబడిరి?
Q ➤ 51. సుగంధ ద్రవ్యములతో యోసేపు శవమును సిద్ధపరచి ఎచట ఉంచిరి?