Q ➤ 1. కీర్తనకారుడు ఓ గువ్వనుగూర్చి చెబుతూ దాని రెక్కలు"____________ బంగారుతో కప్పబడి" ఉన్నట్టు వ్రాశాడు.
Q ➤ 2. ప్రభువైన యేసు సిలువ మోయుచు "వారు________ మానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో?" అనెను.
Q ➤ 3. విమోచింపబడినవారు ధరించిన వస్త్రముల రంగు ఏమిటి? ___________
Q ➤ 4. మొర్ధకై__________రాజవస్త్రమును ధరించుకొనినవాడై బయలుదేరెను.
Q ➤ 5."తల____________ వృద్ధుడనై యుండువరకు" ఓ దేవా నన్ను విడువకుము.
Q ➤ 6. "దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు_________తో రంగువేయుచున్నాడు."
Q ➤ 7. "___________ వస్త్రములు కట్టుకొని సువర్ణభూషణములు ధరించి_________ చేత నీ కన్నులు పెద్దవిగా చేసికొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే"..
Q ➤ 8. "ఆకాశము మేఘములతోను గాలివానతోను__________ కామెను.
Q ➤ 9. "ఈ కిటికీకి ఈ__________దారమును కట్టు"మని యిద్దరు వేగులవారు రాహాబుతో చెప్పారు.
Q ➤ 10. లాబానుయొక్క గొర్రెలమంద నుండి యాకోబు ఏ రంగుగల వేరుచేశాడు? గొర్రెలన్నిటిని
Q ➤ 11. "ఆకాశము ___________ గా ఉన్నది గనుక వర్షము కురవదు."
Q ➤ 12. ప్రకటన గ్రంథములోగల నాలుగు గుఱ్ఱములలోని చివరిదాని రంగు ఏమిటి?
Q ➤ 13. "(మీ బంగారమును, వెండియు వాటి__________ సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి.”
Q ➤ 14. మిద్యాను రాజుల ఒంటిమీదనున్న బట్టలు ఏ రంగులో ఉన్నవి?
Q ➤ 15. అహరోను ధరించిన ఏఫోదుయొక్క రంగు ఏమిటి?