Q ➤ 1. తన భద్రత నిమిత్తమై అపొస్తలుడైన పౌలు దేనిలోనికి తీసుకొని పోబడ్డాడు?
Q ➤ 2. ఓ శతాధిపతి కపెర్నహూములో దేనిని కట్టించాడు?
Q ➤ 3. లేవీయులు దేనిని విప్పుటకును, తిరిగి వేయుటకును నియమింపబడ్డారు?
Q ➤ 4. రాజైన సొలొమోను దేనిని నిర్మించాడు?
Q ➤ 5. సీయోను కుమార్తె "ద్రాక్షతోటలోని_________ వలె విడువబడియున్నది."
Q ➤ 6.అంతేగాక ఆమె "దోసపాదులలోని__________ వలెను విడువబడి యున్నది."
Q ➤ 7. ఆమోసు ప్రవక్త రెండు కాలములకు సంబంధించిన నగరులను గూర్చి ప్రస్తావిస్తున్నాడు?
Q ➤ 8. ఆ ముగ్గురికి ఎక్కడ స్థలము దొరకలేదు?
Q ➤ 9. ప్రవక్రియగు హుల్దా ఎక్కడ నివసించినది?
Q ➤ 10. సిలోయములోని ____________కూలినప్పుడు పదునెనిమిదిమంది మరణించారు.
Q ➤ 11. ప్రభువైన యేసును జనసమూహము పట్టుకొని తీసికొని వెళ్తున్నప్పుడు పేతురు వారిని ఎక్కడివరకు వెంబడించాడు?
Q ➤ 12. రాజకుమారుని వివాహానికి పిలువబడినవారిలో ఒకడు ఎక్కడికి వెళ్ళాడు?
Q ➤ 13. బైబిల్లో ప్రస్తావించబడిన ఒకే ఒక్క భవనము ఎఫెసులో ఉంది? ఏమిటది?
Q ➤ 14. వెర్రివాడైన ధనవంతుడు నిష్ప్రయోజనంగా కొన్నిటిని పెద్దవిగా కట్టించు కున్నాడు. ఏమిటవి?
Q ➤ 15. "నేను రబ్బా పట్టణమును __________ గా చేసెదను" - అని ప్రవక్త యైన యెహెజ్కేలు చెబుతున్నాడు. ఏమి చేసెదనని చెబుతున్నాడు?