1➤ మనుష్యులకు కనబడవలెనని వారియెదుట ఏమి చేయకుండా చూసుకోవాలి?
,2➤ యేసుబోధ ప్రకారం ధర్మం ఎలా చేయాలి?
,3➤ మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరివలె ఉండవద్దు?
,4➤ ఉపవాసం చేయునప్పుడు విచారంగా ముఖాన్ని పెట్టేది ఎవరు?
,5➤ ఎక్కడ ధనాన్ని కూర్చుకోవద్దు?
,6➤ 'చిమ్మటయైనను, తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నమువేసి దొంగిలరు'. ఆ స్థలం పేరేమిటి?
,7➤ నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే ఏమి ఉంటుంది?
,8➤ దేహానికి దీపము ఏమిటి?
,9➤ విత్తకుండా కోయకుండా జీవించేవి ఏమిటి?
,10➤ కష్టపడకుండా, ఒడకకుండా అందంగా ఉండేవి ఏమిటి?
,11➤ ఏ రాజు వైభవం అడవి పువ్వులతో పోల్చబడింది?
,12➤ మనం మొదట దేన్ని వెదకాలి?
,13➤ తీర్పు తీర్చబడకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
,14➤ దేనియెదుట ముత్యాలను వేయకూడదు?
,15➤ పరిశుద్ధమైనది ఏ జంతువుకు పెట్టవద్దు?
,16➤ ఏమార్గం వెడల్పుగా, విశాలంగా ఉంది?
,17➤ జీవానికి పోవు ద్వారం ఎలా ఉంది?
,18➤ తమకుమారులకు చెడ్డ తండ్రులు ఎలాంటి ఈవులను ఇవ్వాలని ఇష్టపడుతారు?
,19➤ గొర్రెల వస్త్రాలు వేసుకొనే తోడేళ్ళు ఎవరు?
,20➤ పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు?
,21➤ బుద్ధిమంతుడు ఎవరు?
,22➤ బుద్ధిమంతుడు తన ఇంటిని ఎక్కడ కట్టుకొంటాడు?
,23➤ యేసు ఎలా బోధించాడు?
,24➤ యాజకునికి తన్నుతాను కనుపరచుకొమ్మని యేసు ఎవరితో చెప్పాడు?
,25➤ తన ఇంట్లోకి యేసు రావడానికి తాను పాత్రుడు కాదని ఎవరు చెప్పారు?
,26➤ విశ్వాస విషయంలో యేసు ఎవరిని బాగా మెచ్చుకొన్నాడు?
,27➤ పేతురు అత్తగారి రోగం ఏమిటి?
,28➤ ఎవరి అత్తగారి రోగాన్ని యేసు స్వస్థపరిచాడు?
,29➤ 'నక్కలకు బొరియలును, ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,30➤ మృతులను పాతి పెట్టేది ఎవరు?
,31➤ సమాధుల్లోనుండి దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తులు రావడం యేసు ఎక్కడ చూశాడు?
,32➤ 'ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి?' అని ఎవరు చెప్పారు?
,33➤ యేసు స్వంత పట్టణం ఏది?
,34➤ 'కుమారుడా, ధైర్యముగా ఉండుము' అని యేసు ఎవరితో చెప్పాడు?
,35➤ పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉంది?
,36➤ యేసు శిష్యునిగా మారిన సుంకరి పేరు ఏమిటి?
,37➤ 'రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర లేదుగదా?' అని ఎవరితో ఎవరు చెప్పారు?
,38➤ పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం దుఃఖపడాల్సిన అవసరం ఎవరికి లేదు?
,39➤ యేసు వస్త్రపు చెంగును తాకి స్వస్థపడింది ఎవరు?
,40➤ ఎవరి కూతురును యేసు మరణం నుండి లేపాడు?
,41➤ మత్తయి సువార్తలోమాత్రమే పేర్కొనబడిన రెండు అద్భుతాలు ఏవి?
,42➤ 'కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు' అని ఎవరితో ఎవరు చెప్పారు?
,43➤ యేసుకు ఎంతమంది శిష్యులున్నారు?
,44➤ అపొస్తలులలో మొదటి వ్యక్తి ఎవరు?
,45➤ అపొస్తలుడయిన అల్ఫయి కుమారుడు ఎవరు?
,46➤ యేసును అప్పగించిన యూదా స్వస్థలం ఏది?
,47➤ ఏ పట్టణంలోకి శిష్యులు ప్రవేశించలేదు?
,48➤ దేవుని బిడ్డలు దేనివలె వివేకంగా ఉండాలి?
,49➤ నిష్కపటమైనదిగా పేర్కొనబడిన పక్షి ఏది?
,50➤ ఏ పక్షులకంటే ఎక్కువగా దేవుని బిడ్డలు శ్రేష్టులు?
,51➤ యేసును వెంబడించాలంటే ఒకరు ఏమి ఎత్తుకోవాలి?
Telugu Bible trivia on Matthew-2
February 04, 2022