1➤ రోమీయులకు వ్రాసిన పత్రిక రచయిత ఎవరు?
,=> పౌలు
2➤ దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి పిలువబడిన అపొస్తలుడు ఎవరు?
,=> పౌలు (1:1,2)
3➤ 'సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను' అని ఎవరు చెప్పారు?
,=> పౌలు (1:16)
4➤ పక్షపాతం లేనిది ఎవరికి?
,=> దేవునికి (2:11)
5➤ నిజమైన సున్నతి ఏది?
,=> పరిశుద్ధాత్మవలన కలిగిన హృదయ సంబంధమైన సున్నతి (2:29)
6➤ పాపంవలన అందరూ దేన్ని పొందలేకపోవుచున్నారు?
,=> దేవుడు అనుగ్రహించు మహిమ (3:23)
7➤ ఏ బేధము లేకుండా అందరూ ఏమి చేస్తున్నారు?
,=> పాపం (3:23)
8➤ ఎలా మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతారు?
,=> విశ్వాసంవలన (3:28)
9➤ ప్రభువుచేత నిర్దోషియని ఎంచబడిన వాడు ఎలాంటివాడు?
,=> ధన్యుడు (4:8)
10➤ పాత నిబంధనలో విశ్వాసమువలన కలిగిన నీతికి ముద్ర ఏమిటి?
,=> సున్నతి (4:11)
11➤ ఏది ఉగ్రతను పుట్టిస్తుంది?
,=> ధర్మశాస్త్రం (4:15)
12➤ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిన పితరుడు ఎవరు?
,=> అబ్రాహాము (4:18)
13➤ యేసు మరణం నుండి ఎందుకు లేచాడు?
,=> మనలను నీతిమంతులనుగా తీర్చడానికి (4:25)
14➤ పాపంద్వారా లోకంలోకి ఏది ప్రవేశించింది?
,=> మరణం (5:12)
15➤ లోకంలోకి పాపం, మరణం ఎలా ప్రవేశించాయి?
,=> ఒక మనుష్యునిద్వారా ప్రవేశించాయి (5:12)
16➤ పాపమువలన వచ్చు జీతము ఏమిటి?
,=> మరణం (6:23)
17➤ 'అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను?” అని ఎవరు అన్నారు?
,=> పౌలు (7:24)
18➤ క్రీస్తుయేసునందుండు వారికి ఏమి ఉండదు?
,=> శిక్షావిధి (8:1)
19➤ ఆత్మ (పరిశుద్ధాత్మ)వలన ఏమి కలుగుతుంది?
,=> జీవం, సమాధానం (8:6)
20➤ శరీరానుసారమైన మనస్సు ఎలాంటిది?
,=> మరణం (8:5,6)
21➤ దేవున్ని సంతోషపరచలేనిది ఎవరు?
,=> శరీర స్వభావంగలవారు (8:8)
22➤ దేనికోసం సృష్టి మిగుల ఆశతో తేరిచూస్తు కనిపెట్టుతుంది?
,=> దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం (8: 19)
23➤ మనం ఎలా రక్షించబడ్డాము?
,=> నిరీక్షణవలన (8:24)
24➤ మన బలహీనతల్లో మనకు సహాయం చేసేదెవరు?
,=> పరిశుద్ధాత్ముడు (8:26)
25➤ ఎవరికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి?
,=> దేవున్ని ప్రేమించువారికి (8:28)
26➤ నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏమి పొందుతారు?
,=> మహిమపరచబడుతారు (8:30)
27➤ 'దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి యెవడు?' అని ఎవరు చెప్పారు?
,=> పౌలు (8:31)
28➤ మనకోసం ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు?
,=> యేసుక్రీస్తు (8:34)
29➤ 'ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడును' అని ఎవరు చెప్పారు?
,=> యెషయా ప్రవక్త (9:27,28)
30➤ ఏ రాయికి తగిలి ఇశ్రాయేలు కుమారులు తొట్టిస్తారు?
,=> అడ్డురాయి (మెస్సీయ) (9:33)
31➤ తన మొదటి రాకడలో క్రీస్తు ఇశ్రాయేలీయులకు ఏమైనాడు?
,=> అడ్డు బండ (9:33
32➤ ధర్మశాస్త్రమునకు సమాప్తి ఎవరు?
,=> క్రీస్తు (10:4)
33➤ ఏది కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి?
,=> రక్షణ (10:10)
34➤ ఎవరి పాదాలు సుందరమైనవి?
,=> ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదాలు (10:15)
35➤ అవిధేయులు, ఎదురాడే ప్రజలు ఎవరు?
,=> ఇశ్రాయేలు ప్రజలు (10:20,21)
36➤ పౌలు ఏ గోత్రానికి చెందినవాడు?
,=> బెన్యామీను గోత్రం (11:1)
37➤ ఎవరిని విసర్జించుట లోకాన్ని దేవునితో సమాధానపరచడానికి కారణమైంది?
,=> ఇశ్రాయేలు (11:15)
38➤ దేవుని తీర్పులు, మార్గాలు ఎలా ఉన్నాయి?
,=> అశక్యములు, అగమ్యములు (11:33)
39➤ దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి?
,=> మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరం పొందాలి (12:2)
40➤ ఏ యుద్రోపకరణాలను దేవుని బిడ్డలు ధరించాలి?
,=> తేజస్సంబంధమైన యుద్ధాపకరణాలు (13:12)
41➤ దేవుని రాజ్యం అంటే ఏమిటి?
,=> నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలోని ఆనందం (14:17)
42➤ మరొక వ్యక్తి వేసిన పునాది మీద ఏ అపొస్తలుడు కట్టలేదు?
,=> పౌలు (15:20)
43➤ కెంకేయలోని సంఘ పరిచారకురాలు ఎవరు?
,=> ఫీబే (16:1)
44➤ పౌలుకు జతపనివారైన కుటుంబాన్ని పేర్కొనండి?
,=> అకుల, ప్రిస్కిల్ల (16:3)
45➤ పౌలుకోసం తమ ప్రాణాలనుకూడా ఇవ్వడానికి తెగించిన కుటుంబం ఏది?
,=> ప్రిస్కిల్ల, అకుల (16:3,4)
46➤ ఆసియాలో క్రీస్తుకు మొదటి ఫలం ఎవరు?
,=> ఎపైనెటు (16:5)
47➤ క్రీస్తునందు యోగ్యుడైన వ్యక్తి ఎవరు?
,=> అపెల్లె (16:10)
48➤ పౌలు బంధువు ఎవరు?
,=> హెరోదియోను (16:11)
49➤ ప్రభువునందు బాగా ప్రయాసపడిందెవరు?
,=> త్రుపైనా (16:12)
50➤ ప్రభువునందు ఏర్పరచబడినదెవరు?
,=> రూపు (16:13)
51➤ పౌలుకోసం ఈ పత్రికను చేతితో వ్రాసిన పౌలు కార్యదర్శి ఎవరు?
,=> తెర్తియు (16:22)
52➤ సంఘం మొత్తానికి ఆతిథ్యమిచ్చింది ఎవరు?
,=> గాయి (16:23)
53➤ కొరింథు పట్టణానికి ఖజనాదారుడు ఎవరు?
=> ఎరస్తు (16:23)