1➤ ఈ పత్రిక రచయిత ఎవరు?
,=> పౌలు
2➤ 'కొరింథు' పదానికి అర్థం ఏమిటి?
,=> అలంకరణ
3➤ కొరింథీ సంఘంలోని ప్రజల మధ్య కలహాలు ఉన్నాయని పౌలుకు ఎవరిద్వారా తెలిసింది?
,=> క్లోయె (1:11)
4➤ కొరింథీలో పౌలుచేత బాప్తిస్మం పొందుకొన్న కుటుంబం ఏది?
,=> స్తెఫను కుటుంబం (1:16)
5➤ 'బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని ... సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను' అని ఎవరు చెప్పారు?
,=> పౌలు (1:17)
6➤ రక్షింపబడుతున్నవారికి ఏది దేవుని శక్తి?
,=> సిలువనుగురించిన వార్త (1:18)
7➤ ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేసిందెవరు?
,=> దేవుడు (1:20)
8➤ ఏ ప్రజలు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు?
,=> యూదులు (1:22)
9➤ జ్ఞానాన్ని వెదికేది ఎవరు?
,=> గ్రీసు దేశస్థులు (1:22)
10➤ కొరింథీలో సంఘాన్ని స్థాపించినదెవరు?
,=> పౌలు (3:6)
11➤ కొరింథీ సంఘానికి నీళ్ళు పోసిందెవరు?
,=> అపొల్లో (3:6)
12➤ పౌలుమాటల ప్రకారం మన దేహం ఏమైయుంది?
,=> దేవుని ఆలయం (3:16)
13➤ ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడుచేస్తే, దేవుడేమి చేస్తాడు?
,=> దేవుడు అతన్ని పాడు చేస్తాడు (3:17)
14➤ గృహ నిర్వాహకునిలో ఏది అవశ్యకంగా ఉండాలి?
,=> నమ్మకత్వం (4:2)
15➤ 'లోకమునకు మురికిగాను, అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడి యున్నాము' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> కొరింథీ విశ్వాసులతో పౌలు చెప్పాడు (4:13)
16➤ ప్రభువునందు తనకు ప్రియుడు, తనకు నమ్మకమైన కుమారుడని పౌలు ఎవరి గురించి చెప్పాడు?
,=> తిమోతి (4:17)
17➤ 'బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా?' అని పౌలు ఏ సంఘాన్ని అడిగాడు?
,=> కొరింథీ సంఘం (4:21)
18➤ మనకు వధించబడిన పస్కా పశువు ఎవరు?
,=> యేసుక్రీస్తు (5:7)
19➤ అన్యాయస్థులు దేనికి వారసులు కానేరరు?
,=> దేవుని రాజ్యానికి (6:9)
20➤ తన స్వంత శరీరానికి హానికరంగా ఎవరు పాపం చేస్తారు?
,=> జారత్వం చేయువాడు (6:18)
21➤ పరిశుద్ధాత్మ ఆలయం ఏది?
,=> దేవుని కుమారుల దేహం (6:19)
22➤ ఏ ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు?
,=> కళ్ళము తొక్కుతున్న ఎద్దుకు (9:9)
23➤ ఆలయ కృత్యాలు జరిగించువారు దేనితో జీవనము పొందుకొంటారు?
,=> ఆలయంలోని ఆహారంతో (9:13)
24➤ 'అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినయెడల నాకు శ్రమ' అని ఎవరు చెప్పారు?
,=> పౌలు (9:16)
25➤ తన శరీరాన్ని నలగగొట్టి దాన్ని లోపరచుకోవలసింది ఎవరు?
,=> ప్రసంగీకుడు (9:27)
26➤ అరణ్యంలో ఇశ్రాయేలును వెంబడించిన ఆత్మసంబంధమైన బండ ఎవరు?
,=> క్రీస్తు (10:4)
27➤ వ్యభిచారం చేయడంవలన ఒక్కరోజే ఎంతమంది చనిపోయారు?
,=> ఇరవైమూడు వేలమంది (108)
28➤ అన్యజనులు ఎవరికి తమ బలులను అర్పించారు?
,=> దయ్యాలకు (10:20)
29➤ భూమియు, దాని పరిపూర్ణత ఎవరికి చెందింది?
,=> ప్రభువుకు (10:26)
30➤ ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు?
,=> క్రీస్తు (11:3)
31➤ ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు?
,=> పురుషుడు (11:3)
32➤ ఎవరినిబట్టి స్త్రీకి తలమీద అధికార సూచన ఉండాలి?
,=> దూతలు (11:10)
33➤ పరిశుద్ధాత్మవలన తప్ప మరెవరుకూడ ఏది ఒప్పుకోలేరు?
,=> యేసుప్రభువని (12:3)
34➤ పరిశుద్ధాత్మ కృపావరాలు ఎన్ని?
,=> తొమ్మిది (12:8-10)
35➤ ఏది శాశ్వత కాలం ఉంటుంది?
,=> ప్రేమ (13:8)
36➤ సదాకాలం నిలిచే మూడు వరాలు ఏవి?
,=> విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ (13:13)
37➤ విశ్వాసం, నిరీక్షణ, ప్రేమలో ఏది శ్రేష్టమైన వరం?
,=> ప్రేమ (13:13)
38➤ భాషల్లో మాట్లాడువారు ఎవరితో మాట్లాడుతారు?
,=> దేవునితో (14:2)
39➤ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయువారు ఎవరు?
,=> ప్రవక్తలు (14:4) )
40➤ అందరికంటే తాను ఎక్కువగా భాషలతో మాట్లాడుతాను అని చెప్పిందెవరు?
,=> పౌలు (14:18)
41➤ భాషలు ఎవరికి సూచకం?
,=> అవిశ్వాసులకు (14:22)
42➤ శిష్యుల్లో మొదట యేసు ఎవరికి కనిపించాడు?
,=> కేఫా (15:5)
43➤ 'అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను” ఎవరు ఎవరికి కనబడ్డారు?
,=> పౌలుకు యేసుక్రీస్తు కనబడ్డాడు (15:8)
44➤ కడపటి శత్రువు ఎవరు?
,=> మరణం (15:26)
45➤ దుష్టసాంగత్యం దేన్ని చెరుపుతుంది?
,=> మంచి నడవడిని (15:33)
46➤ కడపటి ఆదాము ఎవరు?
,=> క్రీస్తు (15:45)
47➤ పెంతెకోస్తు దినంవరకు పౌలు ఎక్కడ నిలిచియున్నాడు?
,=> ఎఫెసులో (16:8)
48➤ అకయలో ప్రథమ ఫలం ఎవరు?
,=> స్తెఫను కుటుంబం (16:15)
49➤ 'మరనాత' అనగా అర్థం ఏమిటి?
=> ప్రభువు వచ్చుచున్నాడు (16:22)