1➤ ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> జెఫన్యా
2➤ జెఫన్యా పేరుకు అర్థం ఏమిటి?
,=> ప్రభువు దాచును (1:1)
3➤ జెఫన్యా తండ్రి ఎవరు?
,=> కూషీ (1:1)
4➤ జెఫన్యా కాలంలో యూదా రాజు ఎవరు?
,=> యోషీయా (1:1)
5➤ మనుష్యులను, పశువులను దేవుడు ఊడ్చివేస్తాడనే దైవ సందేశాన్ని అందించింది ఎవరు?
,=> జెఫన్యా (1:3)
6➤ “ప్రభువైన యెహోవా బలియొకటి సిద్ధపరచి యున్నాడు” అని ఎవరు ప్రవచించారు?
,=> జెఫన్యా (1:7)
7➤ ఏ పట్టణాన్ని యెహోవా విసర్జించాడు?
,=> గాజా పట్టణం (2:4)
8➤ సముద్ర ప్రాంతమందు నివసించువారు ఎవరు?
,=> కెరేతీయులు (2:5)
9➤ సొదొమ, గొమొఱ్ఱ పట్టణాలవలె మారిన రెండు స్థలాల పేర్లు ఏమిటి?
,=> మోయాబు, అమ్మోను దేశం (2:9)
10➤ 'నావంటి పట్టణము మరియొకటి లేదని' తన హృదయంలో చెప్పుకొని భద్రంగా జీవించిన దేశం పట్టణం ఏది?
,=> నీనెవె పట్టణం (2:15)
11➤ ఏ నది అవతలనుండి చెదిరిన ప్రజలు నైవేద్యం తెస్తారు?
=> కూషు నది (3:10)