1➤ ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> యోనా
2➤ యోనా తండ్రి ఎవరు?
,=> అమిత్తయి (1:1)
3➤ యోనా పేరుకు అర్థం ఏమిటి?
,=> పావురం
4➤ ఏ పట్టణానికి వ్యతిరేకంగా ప్రసంగించమని దేవుడు యోనాకు చెప్పాడు?
,=> నీనెవె పట్టణం (1:2)
5➤ నీనెవె పట్టణం నుండి దేవుని సన్నిధికి ఏమి చేరింది?
,=> దోషం (1:2)
6➤ ఓడలో ప్రయాణించడానికి టికెట్ కు చెల్లించిన ప్రవక్త ఎవరు?
,=> యోనా (1:3)
7➤ ఓడ దిగువ భాగంలో గాఢంగా నిద్రపోయింది ఎవరు?
,=> యోనా (1:5)
8➤ ఎవరికోసం దేవుడు సముద్రంలో గొప్ప తుపానును లేపాడు?
,=> యోనా (1:4)
9➤ యోనా ఏ దేశానికి చెందినవాడు?
,=> హెబ్రీ (1:9)
10➤ 'నేను హెబ్రీయుడను, సముద్రమునకును, భూమికిని సృష్టికర్తయై ఆకాశ మందుండు దేవుడైయున్న యెహోవా యందు భయభక్తులు గలవాడనై యున్నాను' అని చెప్పిందెవరు?
,=> యోనా (1:9)
11➤ 'నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి' అని ఎవరు చెప్పారు?
,=> యోనా (1:12)
12➤ ప్రవక్తమీద ఓట్లు పడినందుకు సముద్రంలో పడవేయబడిన ప్రవక్త ఎవరు?
,=> యోనా (1:15)
13➤ ఏ ప్రవక్తను గొప్ప చేప మ్రింగింది?
,=> యోనా (1:17)
14➤ చేప కడుపులో మూడు రాత్రింబగళ్ళు ఉన్న ప్రవక్త ఎవరు?
,=> యోనా (1:17)
15➤ చేప కడుపులోనుండి ఎవరు ప్రార్థించారు?
,=> యోనా (2:1)
16➤ నేలమీద చేప ఎవరిని కక్కింది?
,=> యోనా (2:10)
17➤ 'నలువది దినములకు నీనెవె పట్టణం నాశనమవుతుందని ఎవరు ప్రసంగి ంచారు?
,=> యోనా (3:4)
18➤ ఏ పట్టణ ప్రజలు, జంతువులు ఉపవాసమున్నారు?
,=> నీనెవె (3:5-8)
19➤ ఏ పట్టణ నాశనం దేవునిచేత మార్చబడింది?
,=> నీనెవె (3:10)
20➤ నీనెవెలో చావాలని కోరుకొన్న ప్రవక్త ఎవరు?
,=> యోనా (4:3)
21➤ 'నేనిక బ్రదుకుట కంటే చచ్చుట మేలు' అని ఎవరు చెప్పారు?
,=> యోనా (4:3)
22➤ దేవునిమీద ఎవరికి కోపం వచ్చింది?
,=> యోనా (4:4)
23➤ 'నీవు కోపించుట న్యాయమా?' అని ఎవరిని ఎవరు అడిగారు?
,=> దేవుడు యోనాను అడిగాడు (4:4)
24➤ పట్టణ నాశనం చూడాలని ఒక పందిరి వేసుకొని దాని నీడలో కూర్చొన్న ప్రవక్త ఎవరు?
,=> యోనా (4:5)
25➤ యోనాకోసం దేవుడు మొలిపించిన చెట్టు ఏది?
,=> సొరచెట్టు (4:6)
26➤ చెట్టును తొలచి చెట్టు వాడిపోయేలా చేసిందేమిటి?
,=> పురుగు (4:7)
27➤ సొరచెట్టు ఎండిపోయినందుకు ఎవరికి కోపం వచ్చింది?
,=> యోనా (4:9)
28➤ ఏ ప్రజలపట్ల దేవునికి పట్టింపుంది?
,=> నీనెవె ప్రజలు (4:11)
29➤ నీనెవు పట్టణ జనాభా ఎంత?
=> ఒక లక్ష ఇరవైవేలకంటే ఎక్కువ (4:11)