1➤ పాతనిబంధనలో చివరి పుస్తకం ఏమిటి?
,=> మలాకీ
2➤ మలాకీ పేరుకు అర్థం ఏమిటి?
,=> నా సందేశకుడు
3➤ దేవుడు ప్రేమించిన ఇస్సాకు కుమారుడు ఎవరు?
,=> యాకోబు (1:2)
4➤ ఎవరి పర్వతాలు పాడుచేయబడ్డాయి?
,=> ఏశావు (1:3)
5➤ ఎవరి స్వాస్థ్యం అరణ్యమందున్న నక్కలపాలైంది?
,=> ఏశావు (1:3)
6➤ ఏది చేయడంవలన యాజకులు దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేశారు?
,=> బలిపీఠంమీద అపవిత్రమైన భోజనాన్ని పెట్టడంవలన (1:6,7)
7➤ ఏది అపవిత్రం చేశారని యాజకులకు చెప్పబడింది?
,=> యెహోవా భోజన బల్ల (1:7)
8➤ లేవితో దేవుడు చేసిన నిబంధన ఏమిటీ?
,=> జీవానికి, సమాధానమునకు కారణమైన నిబంధన (2:5)
9➤ సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు ఎవరు?
,=> యాజకులు (2:7)
10➤ ఎవరినుండి మనుష్యులు ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవాలి?
,=> యాజకులు (2:7)
11➤ 'మనకందరికి తండ్రియొక్కడే కాడా?' అని ఏ ప్రవక్త చెప్పాడు?
,=> మలాకీ (2:10)
12➤ వేటితో ఇశ్రాయేలు యెహోవాను ఆయాసపెట్టింది?
,=> మాటలతో (2:17)
13➤ దేని విషయంలో దేవుని ప్రజలు దేవునివద్ద దొంగలిస్తున్నారు?
,=> పదియవ భాగం, ప్రతిష్ఠితార్పణలు (3:8)
14➤ ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను అని ఎవరు చెప్పారు?
,=> యెహోవా (3:10)
15➤ ఎవరి సంభాషణను యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు?
,=> యెహోవాయందు భయభక్తులు గలవారి సంభాషణ (3:16)
16➤ యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించేవారికి ఉన్న పుస్తకం ఏది?
,=> జ్ఞాపకార్ధ గ్రంథం (3:16)
17➤ దేవునికి భయపడేవారి విషయంలో రెక్కలలో ఆరోగ్యాన్ని కలుగజేసేది ఎవరు?
,=> నీతిసూర్యుడు (4:2)
18➤ దేవునికి భయపడే ప్రజలు దేనివలె వెళ్ళి గంతులు వేస్తారు?
,=> క్రొవ్విన దూడలవలె (4:2)
19➤ దేవుని ప్రజలు ఎవరిని అణుగదొక్కెదరు?
,=> దుర్మార్గులను (4:3)
20➤ ఎక్కడనుండి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞలనిచ్చాడు?
=> హోరేబు కొండమీదనుండి (4:4)