1/15
				ఎవరు అరుణోదయమున "లేచి" తన కుమారుల నిమిత్తము నిత్యము దహనబలి అర్పించును?
			2/15
				వేకువనే "లేచి" గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి దేనిగా ఎంచబడును?
			3/15
				గుణవతియైన భార్య చీకటితోనే "లేచి", తన యింటివారికొరకు దేనిని సిద్ధపరచును?
			4/15
				నీవు "లేచి", శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుమని ప్రభువు దూత ఎవరికి చెప్పెను?
			5/15
				నీవు" లేచి" ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని సౌలుతో ఎవరు చెప్పెను?
			6/15
				నీవు "లేచి" మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
			7/15
				యేసు పెందలకడనే "లేచి" యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, ఎక్కడికి వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను?
			8/15
				యెహోవా - నీవు "లేచి" నీ దేశమునుండియు, నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుమని ఎవరితో చెప్పెను?
			9/15
				ఎవరు పెందలకడ "లేచి", పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను?
			10/15
				పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలందరు "లేచి" వేటిని చక్కపరచుకొనిరి?
			11/15
				షియొను కుమారి నీవు "లేచి" రేయి ఏ జామున మొఱ్ఱపెట్టుము?
			12/15
				యెహోవా నేను పెందలకడ "లేచి" మీతో ఏవిధముగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు?
			13/15
				ఏ తెగవారు "లేచి" అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి?
			14/15
				యేసు "లేచి" వేటిని గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను?
			15/15
				శోధనలో ప్రవేశించకుండునట్లు "లేచి" ఏమి చేయవలెను?
						Result: