1➤ అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని రచించినది?
,=> లూకా
2➤ ఈ పుస్తకాన్ని లూకా ఎవరికి అంకితమిచ్చాడు?
,=> థెయొఫిలా (1:1)
3➤ పునరుత్థానం తరువాత యేసు ఈ భూమిమీద ఎన్ని రోజులు ఉన్నాడు?
,=> 40 రోజులు (1:3)
4➤ యేసు ఆరోహణ సమయంలో ప్రభువు దూతలు శిష్యులను ఎలా సంబో ధించారు?
,=> గలిలయ మనుష్యులారా (1:11)
5➤ ఎక్కడనుండి యేసు పరలోకానికి ఆరోహణమైనాడు?
,=> ఒలీవల కొండ (1:12)
6➤ యేసు పునరుత్థానం తరువాత ఆయన శిష్యులు ఎక్కడికి తిరిగి వెళ్ళారు?
,=> యెరూషలేము (1:12)
7➤ యేసు పునరుత్థానం తరువాత ప్రార్థన సమావేశానికి హాజరైన స్త్రీ పేరు ప్రస్తావించబడింది. ఆ స్త్రీ ఎవరు?
,=> యేసు తల్లియైన మరియ (1:14)
8➤ ద్రోహంవలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలాన్ని కొన్నదెవరు?
,=> ఇస్కరియోతు యూదా (1:16, 18)
9➤ తలక్రిందులుగా పడి నడిమికి బద్ధలైనందున ఎవరి ప్రేగులు బయట కొచ్చాయి?
,=> ఇస్కరియోతు యూదా (1:18)
10➤ ఇస్కరియోతు యూదా స్థానం వేరొకడు తీసికొంటారని ఎవరు ప్రవచించారు?
,=> దావీదు (1:20; కీర్తన 109:8)
11➤ ఇస్కరియోతు యూదా స్థానంలో ప్రతిపాదించబడిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?
,=> యోసేపు, మత్తీయ (1:23)
12➤ యోసేపుకుగల ఇతర పేర్లు ఏమిటి?
,=> బర్నబ్బా, యూస్తు (1:23)
13➤ ఇస్కరియోతు యూదా స్థానంలో ఎవరు ఎన్నుకోబడ్డారు?
,=> మత్తీయ (1:22,26)
14➤ యాభైవ రోజు ఏవిధంగా పేర్కొనబడింది?
,=> పెంతెకోస్తుదినం (2:1)
15➤ ప్రార్థిస్తున్న ప్రజలమీదికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు?
,=> పెంతెకోస్తు రోజున (2:1-4)
16➤ పెంతెకోస్తు నాడు ప్రసంగించిందెవరు?
,=> పేతురు (2:14)
17➤ పరిశుద్ధాత్మ రాకడను గురించి ప్రవచించిన ప్రవక్త పేరు ఏమిటి?
,=> యోవేలు (2:16)
18➤ యేసు శరీరం కుళ్ళిపోదని ఎవరు ప్రవచించారు?
,=> దావీదు (2:30,31)
19➤ పేతురు మొదటి ప్రసంగంద్వారా ఎంతమంది బాప్తిస్మం పొందుకొన్నారు?
,=> మూడువేలమంది (2:41)
20➤ మొదటి క్రైస్తవులు ఎక్కడ కూడుకొనేవారు?
,=> యెరూషలేము దేవాలయంలో (2:46)
21➤ రక్షణ పొందుతున్న వారిని అనుదినం సంఘంలో చేర్చింది ఎవరు?
,=> ప్రభువు (2:47)
22➤ పేతురు, యోహానులద్వారా స్వస్థపడిన కుంటివాడు ఎక్కడ కూర్చొన్నాడు?
,=> శృంగార దేవాలయ ద్వారం దగ్గర (3:2-7)
23➤ 'వెండి బంగారములు నాయొద్ద లేవు' అని ఎవరు చెప్పారు?
,=> పేతురు (3:6)
24➤ ఏ మంటపంలో పేతురు ప్రజలకు బోధించాడు?
,=> సొలొమోను మంటపం (3:11)
25➤ ప్రభువు సముఖంనుండి ఏమి వస్తుంది?
,=> విశ్రాంతి కాలం (3:19)
26➤ మనుష్యులు రక్షించబడే ఏకైక నామం ఏమిటి?
,=> యేసు నామం (4:12)
27➤ 'బర్నబా' అనే పేరుకు అర్థం ఏమిటి?
,=> ఆదరణ పుత్రుడు (4:36)
28➤ బర్నబా అని ఎవరు అతనికి పేరు పెట్టారు?
,=> అపొస్తలులు (4:36)
29➤ బర్నబాకు గల మరో పేరు ఏమిటి?
,=> యోసేపు (4:36)
30➤ బర్నబా ఏ ప్రాంతానికి చెందినవాడు?
,=> కుప్ర (4:36)
31➤ తన భూమిని అమ్మి దాని వెలను తెచ్చి అపొస్తలుల పాదాలవద్ద పెట్టిందెవరు?
,=> బర్నబా (4:37)
32➤ అపొస్తలుల పాదాలవద్ద డబ్బును పెట్టడానికి తమ భూమిని అమ్మిన మరొక కుటుంబం ఏది?
,=> అననీయ, సప్పీరా (5:1)
33➤ భూమిని అమ్మిన వెలలో కొంత డబ్బును మాత్రమే తెచ్చినదెవరు?
,=> అననీయ (5:2)
34➤ పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధమాడినందుకు చనిపోయిన కుటుంబం ఏది?
,=> అననీయ, సప్పీరా (5:5-10)
35➤ పేతురు పాదాలవద్ద పడి చనిపోయిన స్త్రీ పేరు ఏమిటి?
,=> సప్పీరా (5:10)
36➤ చెరసాలద్వారాలను తెరచి దూత బయటికి తెచ్చిన అపొస్తలుల పేర్లు ఏమిటి?
,=> పేతురు, యోహాను (5:18,19)
37➤ సమస్త ప్రజలవలన ఘనత పొందిన ధర్మశాస్తోపదేశకుడు ఎవరు?
,=> గమలీయేలు (5:34)
38➤ తానొక గొప్పవాడినని చెప్పుకొన్నదెవరు?
,=> థూదా (5:36)
39➤ ఎవరిని వెంబడించిన ప్రజలు చెదిరి వ్యర్ధులైనారు?
,=> థూదా (5:36)
40➤ విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వ్యక్తి ఎవరు?
,=> స్తెఫను (6:5)
41➤ భోజన బల్లలవద్ద పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన మత ప్రవిష్టుడు ఎవరు?
,=> నీకొలాసు (6:5)
42➤ నీకొలాసు ఏ ప్రాంతానికి చెందినవాడు?
,=> అంతియొక (6:5)
43➤ కృపతోను, బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహాత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేసినదెవరు?
,=> స్తెఫను (6:8)
44➤ ఏసమాజ మందిరాలనుండి వచ్చిన ప్రజలు సైఫనుతో తర్కించి వాదించారు?
,=> లిబెర్రీను సమాజ మందిరం (6:9)
45➤ ఎవరి ముఖం దేవదూత ముఖంవలె కనబడింది?
,=> స్తెఫను (6:15)
46➤ హారానులో కాపురముండక మునుపు అబ్రాహాము ఎక్కడ జీవించాడు?
,=> మెసొపొతమియలో (7:2)
47➤ మెసొపొతమియ ప్రాంతం ఏ దేశంలో ఉంది?
,=> కల్దీయ దేశం (7:3, 4)
48➤ ఎవరి కుమారులనుండి అబ్రాహాము సమాధిని కొన్నాడు?
,=> హమోరు కుమారులు (7:16)
49➤ మాటలయందు, కార్యములయందు ప్రవీణుడైన వ్యక్తి ఎవరు?
,=> మోషే (7:22)
50➤ తన సహోదరులను చూడవలెననే బుద్ధి ఎవరి హృదయంలో పుట్టింది?
,=> మోషే (7:23)
51➤ ఏ దేవత యొక్క నక్షత్రాన్ని ఇశ్రాయేలీయులు మోసుకొనిపోయారు?
,=> రొంఫాయను దేవత (7:43)
52➤ పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరి చూచింది ఎవరు?
,=> స్తెఫను (7:55)
53➤ ఆకాశం తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట చూసిందెవరు?
,=> స్తెఫను (7:56)
54➤ వస్త్రాలవద్ద సాక్షిగా ఉన్న దెవరు?
,=> సౌలు (7:58)
55➤ మొదటి క్రైస్తవ హతసాక్షి ఎవరు?
,=> స్తెఫను (7:59,60)
56➤ స్తెఫను చావుకు సమ్మతించింది ఎవరు?
,=> సౌలు (7:60)
57➤ సంఘాన్ని పాడుచేసింది ఎవరు?
,=> సౌలు (8:3)
58➤ సమరయ పట్టణంలో క్రీస్తును గురించి ప్రకటించినదెవరు?
,=> ఫిలిప్పు (8:5)
59➤ సమరయ పట్టణంలో గారడీచేసి ఆ పట్టణస్థులను విభ్రాంతిపరచినదెవరు?
,=> సీమోను (8:9)
60➤ సమరయ పట్టణంలో బాప్తిస్మం తీసుకొన్న గారడివాడు ఎవరు?
,=> సీమోను (8:13)
61➤ కైసరయలో ఉన్న శతాధిపతి ఎవరు?
,=> కొర్నేలి (10:1)
62➤ ఏపటాలంలో కొర్నేలీ అనే శతాధిపతి ఉన్నాడు?
,=> ఇటలీ పటాలంలో (10:1)
63➤ దేవునియందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఎల్లప్పుడు దేవునికి ప్రార్థించిన శతాధిపతి ఎవరు?
,=> కొర్నేలి (10:2)
64➤ ఎవరి ప్రార్థనలు, ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి?
,=> కొర్నేలి (10:4)
65➤ దూతద్వారా కొర్నేలికి పరిచయం చేయబడిన అపొస్తలుడు ఎవరు?
,=> పేతురు (10:5)
66➤ ఎవరి ఇంటికి వెళ్లమని కొర్నేలీకి దూత చెప్పాడు?
,=> సీమోను అనే చర్మకారుని ఇంటికి (10:5,6)
67➤ పగలు ఇంచుమించు పన్నెండు గంటల సమయంలో ప్రార్థించడానికి పేతురు ఎక్కడికి వెళ్ళాడు?
,=> ఇంటి మిద్దె మీదికి (10:9)
68➤ ఆకాశంనుండి నాలుగు చెంగులు పట్టి దింపబడిన దుప్పటివంటి పాత్రను గురించిన దర్శనం ఎవరికి కలిగింది?
,=> పేతురు (10:11)
69➤ నీవు లేచి చంపుకొని తినుమని చెప్పిన దేవుని స్వరాన్ని ఎవరు విన్నారు?
,=> పేతురు (10:13-16)
70➤ పేతురును పిలిచి ఆయన మాటలను వినాలని ఆశించినదెవరు?
,=> కొర్నేలి (10:22)
71➤ దేవుని వాక్యాన్ని వినడానికి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిచినదెవరు?
,=> కొర్నేలీ (10:24)
72➤ పేతురు పాదాలపై పడి అతన్ని ఆరాధించినదెవరు?
,=> కొర్నేలీ (10:25)
73➤ దేవుని వాక్యాన్ని విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్ముడు ఎక్కడ దిగి వచ్చాడు?
,=> కైసరయ (10:1,44)
74➤ 'లేచి నిలువు, నేనుకూడ నరుడనే' అని ఎవరితో పేతురు చెప్పాడు?
,=> కొర్నేలీ (10:26)
75➤ పేతురు పరవశుడైనప్పుడు ఎక్కడ ఉన్నాడు?
,=> యెప్పే పట్టణంలో (11:5)
76➤ దేవుడు అన్య జనులకు జీవార్ధమైనదేది దయచేశాడు?
,=> మారుమనస్సు (11:18)
77➤ పరిచర్య కోసం సంఘం యెరూషలేమునుండి అంతియొకయకు ఎవరిని పంపింది?
,=> బర్నబా (11:22)
78➤ అంతియొకయలో దేవుని కృపను చూసి సంతోషించినదెవరు?
,=> బర్నబా (11:23)
79➤ పరిశుద్ధాత్మతో, విశ్వాసముతో నిండిన సత్పురుషుడు ఎవరు?
,=> బర్నబా (11:24)
80➤ సౌలును వెదకడానికి ఎక్కడనుండి బర్నబా తార్సుకు వెళ్ళాడు?
,=> అంతియొకయ (11:25)
81➤ ఎక్కడ శిష్యులు మొట్టమొదటిసారి క్రైస్తవులుగా పిలువబడ్డారు?
,=> అంతియొకయ (11:26)
82➤ భూలోకమంతటి గొప్ప కరువు రాబోతుందని ప్రవచించినదెవరు?
,=> అగబు (11:28)
83➤ ఏ చక్రవర్తి కాలంలో భూలోకమంతట గొప్ప కరువు సంభవించింది?
,=> క్లేదియ చక్రవర్తి (11:28)
84➤ మొదటి శతాబ్దంలో సంఘాన్ని హింసించడానికి తన చేతులను చాపిందెవరు?
,=> హేరోదు రాజు (12:1)
85➤ హేరోదు రాజు చంపిన అపొస్తలుడు ఎవరు?
,=> యాకోబు (12:1, 2)
86➤ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపినదెవరు?
,=> హేరోదు రాజు (12:2)
87➤ అపొస్తలులలో మొదటి హతసాక్షి ఎవరు?
,=> యాకోబు (12:2)
88➤ ఎవరికోసం సంఘం అత్యాశక్తితో దేవునికి ప్రార్థించింది?
,=> పేతురు (12:5)
89➤ పేతురు విడుదల కోసం ఎవరి ఇంట్లో సంఘం ఎడతెగక దేవునికి ప్రార్థించింది?
,=> మార్కు తల్లియైన మరియ ఇంట్లో (12:12)
90➤ మార్కు అనే మారుపేరుగల యోహాను తల్లి ఎవరు?
,=> మరియ (12:12)
91➤ పేతురు స్వరాన్ని గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయకుండా లోపలికి పరుగెత్తిన అమ్మాయి ఎవరు?
,=> రొదే (12:13, 14)
92➤ హేరోదు కోటనుండి పేతురు విడుదల పొందిన తరువాత హేరోదు ఎక్కడికి వెళ్ళి నివసించాడు?
,=> కైసరయ (12:19)
93➤ హేరోదు రాజు అంతఃపురానికి పై విచారణకర్త ఎవరు?
,=> బ్లాసు (12:20)
94➤ ప్రభువు దూత మొత్తినందుకు పురుగులు పడి ప్రాణం విడిచిందెవరు?
,=> హేరోదు రాజు (12:23)
95➤ సుమెయోను ప్రవక్తకు గల మరో పేరు ఏమిటి?
,=> నీగెరు (13:1)
96➤ అంతియొకయ సంఘంలో కురేనీయుడైన ప్రవక్త ఎవరు?
,=> లూకియ (13:1)
97➤ చతుర్థాతిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన ప్రవక్త ఎవరు?
,=> మనయేను (13:1)
98➤ పరిచర్యకోసం సౌలు, బర్నబాలు ప్రత్యేకపరచబడినప్పుడు వారు ఎక్కడ ఉన్నారు?
,=> అంతియొకయ (13:1,2)
99➤ అంతియొకయనుండి సౌలు, బర్నబాలు వెళ్ళిపోయిన తరువాత వారు దేవుని వాక్యాన్ని ఎక్కడ బోధించారు?
,=> సలామి (13:5)
100➤ సౌలు, బర్నబాలకు ఉపచారం చేయు వ్యక్తి ఎవరు?
,=> యోహాను (13:5)
101➤ పాపు ఊరిలో ఉన్న అబద్ద ప్రవక్త ఎవరు?
,=> బర్ యేసు (13:6)
102➤ బర్నబా, సౌలును పిలిపించి దేవుని వాక్యాన్ని విన్న అధిపతి ఎవరు?
,=> సెర్గ్ పౌలు (13:7)
103➤ బర్ యేసుకుగల మరో పేరు ఏమిటి?
,=> ఎలుమ (13:6,8)
104➤ సెర్గ్ పౌలు అధిపతిని విశ్వాసంనుండి తొలగించాలని ప్రయత్నించిన గారడివాడు ఎవరు?
,=> ఎలుమ (13:8)
105➤ మార్కు పౌలును విడిచి వచ్చిన ప్రాంతమేది?
,=> పంఫూలియ (13:13)
106➤ దేవుని సంకల్పం చొప్పున తన స్వంత తరములో ప్రభువుకు సేవ చేసిందెవరు?
,=> దావీదు (13:36)
107➤ పౌలు, బర్నబాలు తమ పాద ధూళిని ఎక్కడ దులిపారు?
,=> పిసిదియలోని అంతియొకయలో (13:14,51)
108➤ లుకయొనియలోని ప్రాముఖ్యమైన రెండు పట్టణాలు ఏమిటి?
,=> లుస్త్ర, దెర్బే (14:6)
109➤ ఎక్కడ పౌలు కుంటివాన్ని స్వస్థపరిచాడు?
,=> లుస్త్ర (14:7-10)
110➤ లుకయోనియ ప్రజలు పౌలుకిచ్చిన పేరు ఏమిటి?
,=> హెర్మే (14:12)
111➤ లుకయోనియ ప్రజలు బర్నబాను ఏమని పిలిచారు?
,=> ద్యుపతి (14:12)
112➤ తమ వస్త్రాలను చింపుకొని సమూహంలోనికి చొరబడిన అపొస్తలుల పేర్లు ఏమిటి?
,=> పౌలు, బర్నబా (14:14)
113➤ ఏ ఊరి ప్రజలు పౌలుమీద రాళ్ళు విసిరారు?
,=> లుస్త్ర (14:19)
114➤ యెరూషలేమునుండి అంతియొకయకు పంపబడిన ఇద్దరు ప్రవక్తలు ఎవరు?
,=> యూదా, సీల (15:22)
115➤ యూదాకు మారు పేరు ఏమిటి?
,=> బర్నబ్బా (15:22)
116➤ బర్నబా తనతోపాటు పరిచర్యకు ఎవరిని తీసుకెళ్ళాడు?
,=> మార్కు అను మారుపేరుగల యోహాను (15:39)
117➤ పౌలు తనతోపాటు పరిచర్యకు ఎవరిని తీసుకెళ్ళాడు?
,=> సీల (15:40)
118➤ తిమోతి స్వస్థలం ఏది?
,=> లుప్త (16:1)
119➤ లుస్త్రలో పౌలు ఎవరికి సున్నతి చేయించాడు?
,=> తిమోతి (16:3)
120➤ ఎక్కడ వాక్యాన్ని చెప్పవద్దని పరిశుద్ధాత్ముడు పౌలును ఆటంకపరిచాడు?
,=> ఆసియాలో (16:6)
121➤ పరిశుద్ధాత్ముడు పౌలును ఎక్కడికి వెళ్ళనియ్యలేదు?
,=> బితూనియ (16:6-8)
122➤ 'నీవు ... వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొన్న' వ్యక్తి గురించి పౌలుకు కలిగిన దర్శనం ఏ స్థలానికి సంబంధించినది?
,=> మాసిదోనియా (16:9,10)
123➤ మాసిదోనియా గురించిన దర్శనం పౌలుకు కలిగినప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు?
,=> త్రోయ (16:8-10)
124➤ ఏ ప్రాంతంలో పౌలు నదీ తీరాన వాక్యాన్ని బోధించాడు?
,=> ఫిలిప్పీ (16:13)
125➤ ఫిలిప్పీ పట్టణంలో మొదట యేసును అంగీకరించిన స్త్రీ ఎవరు?
,=> లూదియ (16:14,15)
126➤ దైవభక్తి కలిగి ఊదారంగు పొడిని అమ్మిన స్త్రీ ఎవరు?
,=> లూదియ (16:14)
127➤ లూదియ ఏ పట్టణస్థురాలు?
,=> తుయతైర పట్టణస్థురాలు (16:14)
128➤ దయ్యంపట్టి సోదె చెబుతున్న అమ్మాయిని పౌలు ఎక్కడ స్వస్థపరిచాడు?
,=> ఫిలిప్పీ పట్టణంలో (16:16-18)
129➤ చెరసాలలో దేవునికి ప్రార్ధించి కీర్తనలు పాడింది ఎవరు?
,=> పౌలు, సీలలు (16:25)
130➤ జైలు అధికారి, అతని కుటుంబం యేసును స్వరక్షకునిగా అంగీకరించింది ఎక్కడ?
,=> ఫిలిప్పీ పట్టణంలో (16:30-34)
131➤ సుఖముగా వెళ్ళమని జైలు అధికారి ఎవరితో చెప్పాడు?
,=> పౌలు (16:36)
132➤ థెస్సలొనీకయలో పౌలును చేర్చుకొన్నది ఎవరు?
,=> యాసోను (17:6)
133➤ 'వీరు థెస్సలొనీకలో ఉన్నవారికంటె ఘనులైయుండిరి'. ఎవరు వారు?
,=> బెరయ ప్రజలు (17:10, 11)
134➤ ప్రతిదినం లేఖనాలను పరిశోధించినవారు ఎవరు?
,=> బెరయ ప్రజలు (17:11)
135➤ పట్టణం విగ్రహాలతో నిండియుండుట చూసినందున ఎక్కడ పౌలు ఆత్మ పరితాపం చెందింది?
,=> ఏథెన్సు (17:16)
136➤ పౌలును వదరుబోతుగా పిలిచింది ఎవరు?
,=> ఎపికూరియులు, స్తోయికులలోని జ్ఞానులు (17:18)
137➤ పౌలు ఏథెన్సులో ఏ సభలో ప్రసంగించాడు?
,=> అరేయొపగు సభ (17:19)
138➤ 'తెలియబడని దేవునికి' బలిపీఠాన్ని పౌలు ఎక్కడ చూశాడు?
,=> ఏథెన్సు (17:21-24)
139➤ ఏథెన్సులో క్రీస్తును విశ్వసించిన స్త్రీ ఎవరు?
,=> దమరి (17:34)
140➤ యూదులందరు రోమా విడిచి వెళ్ళిపోవలెనని ఆజ్ఞాపించినదెవరు?
,=> కౌదియ చక్రవర్తి (18:2)
141➤ అకుల ఎక్కడ పుట్టాడు?
,=> పొంతు (18:1)
142➤ కొరింథు పట్టణంలో పౌలుతో పాటు డేరాలు కుట్టినవారు ఎవరు?
,=> అకుల (18:2,3)
143➤ అన్య జనులకు అపొస్తలుడు ఎవరు?
,=> పౌలు (18:6)
144➤ కొరింథులో ఏ భక్తిపరుని ఇంటికి పౌలు వెళ్ళాడు?
,=> యూస్తు (18:7)
145➤ తన కుటుంబమంతటితో ప్రభువునందు విశ్వసించిన సమాజ మందిర అధికారి పేరు ఏమిటి?
,=> క్రిస్పు (18:8)
146➤ అకయకు అధిపతి ఎవరు?
,=> గల్లియోను (18:12)
147➤ దేవుని వాక్యానికి సంబంధించిన విషయాల్లో తీర్పరిగా ఉండనని చెప్పిందెవరు?
,=> గల్లియోను (18:12,15)
148➤ న్యాయపీఠం ఎదుట యూదులు పట్టుకొని కొట్టిన సమాజ మందిర అధికారి ఎవరు?
,=> సోర్తెనేసు (18:17)
149➤ ఎక్కడ పౌలు తన తల వెండ్రుకలను కత్తిరించుకొన్నాడు?
,=> కెండ్రేయ (18:18)
150➤ పౌలు చేతులుంచినప్పుడు కొందరు భాషలతో మాట్లాడి, ప్రవచించింది ఎక్కడ?
,=> ఎఫెసులో (19:6)
151➤ ఏ పాఠశాలలో పౌలు అనుదినం తర్కించాడు?
,=> తురన్ను పాఠశాల (19:9)
152➤ చేతి రుమాలుతో లేక నడికట్లతో రోగులను ఏ అపొస్తలుడు స్వస్థపరిచాడు?
,=> పౌలు (19:11,12)
153➤ ఏ ప్రధాన యాజకుని కుమారులు దయ్యంతో గాయపరచబడి వేధించ బడ్డారు?
,=> స్కెవయ (19:14-16)
154➤ అర్తెమి దేవికి వెండి గుళ్ళను చేయించిన కంసాలి పేరు ఏమిటి?
,=> దేత్రి (19:24)
155➤ ఎఫెసీ పట్టణంలో మహా దేవత ఎవరు?
,=> అర్తెమి (19:35)
156➤ చాలా సేపు పౌలు ప్రసంగించడంవలన నిద్రా భారంతో మూడవ అంతస్తు నుంచి క్రింద పడిన వ్యక్తి ఎవరు?
,=> ఐతుకు (20:9)
157➤ కైసరయ పట్టణంలో ఎవరి ఇంట్లో పౌలు గడిపాడు?
,=> ఫిలిప్పు (21:8)
158➤ ప్రవక్తినిలుగా నలుగురు కన్యక కూతుళ్ళు ఎవరికున్నారు?
,=> ఫిలిప్పు (21:8,9)
159➤ తన చేతులను, కాళ్ళను పౌలు బెల్టుతో బంధించుకొన్నదెవరు?
,=> అగబు (21:10,11)
160➤ కిలికియ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైన పట్టణం ఏది?
,=> తార్సు (21:39)
161➤ చివరికి ప్రత్యేకంగా ఉండటానికి పౌలు ఎక్కడికి పంపబడ్డాడు?
=> రోమా (28:16)