క్రైస్తవ చరిత్ర పై క్విజ్

Author

*పరలోకము గూర్చిన వాస్తవములు* *పార్ట్ - 2*

18. ఈ జీవ వృక్షము నెల నెలకు ఫలించుచు సంవత్సరమునకు 12 కాపులు కాయును *(ప్రకటన 22:2)*

19. ఈ పట్టణపు ప్రధాన స్థలములో దేవుని సింహాసనము ఉండెను *(ప్రకటన 4:2 22:1)*

20. ఈ సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచున్న ను దాని చక్రములు అగ్ని వలె ఉండెను మరకతమణి వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు దీనిని ఆవరించి ఉన్నది *(దానియేలు 7:9; ప్రకటన 4:3)*

21. ఈ సింహాసనము చుట్టు 24 చిన్న సింహాసనమును ఉండెను *(ప్రకటన 4:4)*

22. ఈ సింహాసనము ఎదుట స్పటికము పోలిన గాజువంటి సముద్రం ఉన్నట్లు ఉండను *(ప్రకటన 4:6)*

23. సింహాసనం ప్రక్కన నలుగురు ప్రత్యేక దేవదూతలు కలరు వారు మానక దేవుని స్తుతించుచు వుండెదరు *(ప్రకటన 4:8)*

24. అచ్చట దూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు కలిగి ఉన్నారు సువర్ణ బలిపీఠము కలదు *(ప్రకటన 5:8; 8:3; 9:13)*

25. ఈ సింహాసనము ఎదుట ఏడు దీపముల కలిగి ఉన్న దీపస్తంభము ఉన్నది *(ప్రకటన 1:12; 4:5)*

26. దేవుని పరిశుద్ధ నిబంధన మందసము అచ్చట ఉండి ఉండవచ్చును *(ప్రకటన 11:19)*

27. ఈ పట్టణ కు రాజవీధి శుద్ధ సువర్ణ మయమైన స్వచ్ఛమైన స్పటికము పోలి ఉన్నది *(ప్రకటన 21:21)*

28. ఈ పట్టణము దేవుని మహిమతో దగ దగ మెరియుచుండెను *(ప్రకటన 21:11,23; 22:5)*

29. ఈ పట్టణము పరిశుద్ధ స్థలం *(ప్రకటన 21:27)*

30. ఈ పట్టణము సౌందర్యవంతమైనది *(కీర్తన 50:2)*

31. ఈ పట్టణము ఐక్యత గల పట్టణం *(ఎఫెసీ 1:10)*

32. ఈ పట్టణము సంపూర్ణమైనది *(1 కోరింది 13:10)*

33. ఈ పట్టణము సంపూర్ణ సంతోషంతో నిండి ఉన్నది *(కీర్తనలు 16:11)*

34. ఈ పట్టణము చిరకాలము ఉండును *(యోహాను 3:15; కీర్తన 23:6)*

35. ఈ పట్టణము ప్రత్యక్ష గుడారము ఉండి ఉండవచ్చును *(ప్రకటన 15:5; 21:3)*

36. ఈ పట్టణంలో దేవాలయం ఉండదు *(ప్రకటన 21:22)*


💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠
*డానియేల్ సిసోయెవ్ జీవిత చరిత్ర*
💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

*పూర్తిపేరు:-* డానియేల్ అలెక్సీవిచ్ సిసోయెవ్
*తల్లిదండ్రులు:-* అలెక్సీ సిసోయెవ్, అనా మిదటోవ్ణ అమిరోవ దంపతులు
*భార్యపేరు:-* యులియా సిసోయెవా
*జననం:-* 12 జనవరి 1974
*మరణం:-* 19 నవంబర్ 2009
*జన్మస్థలం:-* రష్యా దేశంలోని మాస్కో

*వ్యక్తిగతసాక్ష్యం:-*
ముస్లింల మధ్య చేసిన పరిచర్యకుగాను ఇస్లాం మతోన్మాదుల చేతులలో ప్రాణాలు కోల్పోయిన ఒక క్రైస్తవ సేవకుడు డానియేల్ అలెక్సీవిచ్ సిసోయెవ్. రష్యా దేశంలో ఒక దైవభక్తి కలిగిన కుటుంబములో జన్మించిన డానియేల్, బాల్యము నుండి కూడా క్రైస్తవ సంఘ కార్యకలాపాల పట్ల ఎల్లప్పుడూ ఆసక్తిని కనపరిచేవారు. తనతోటి పిల్లలవలే ఆటలు ఆడుటకు బదులు క్రైస్తవాలయంలో వేదిక వద్ద సహాయము అందిచుటకును మరియు సంఘ గాయక బృందముతో కలిసి పాడుటకును అతను ఇష్టపడేవారు. పలు మిషనరీల గాథలను వినిన అతను, ఒకరోజున తాను కూడా ఆ మిషనరీలలో ఒకనిగా అవ్వాలని ఆకాంక్షించారు. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు అతను నాస్తికవాదాన్ని అవలంబించవలెనని కోరుకున్న స్నేహితులు చేసే అపహాస్యమును మరియు తన ఉపాధ్యాయుల నుండి కలిగిన ఒత్తిడిని కూడా ప్రార్థన ద్వారా తట్టుకుని నిలబడ్డారు డానియేల్. వారు అపహాస్యం చేస్తున్నప్పుడు అతను సిగ్గునొందకుండా “అవును, నేను దేవునిని నమ్ముతున్నాను...” అని సాక్ష్యమిచ్చేవారు. పట్టభద్రులైన పిమ్మట బైబిలు వేదాంతశాస్త్రములో శిక్షణ పొందుటకుగాను అతను మాస్కో సెమినరీలో చేరారు. అక్కడ అతను పురాతన పుస్తకములను చదువుటలో గంటల తరబడి సమయమును గడిపేవారు. అది లేఖనములను మరింత లోతుగా అర్థం చేసుకొనుటకు అతనికి తోడ్పడింది. 1995వ సంll లో యసేనెవోలోని “సెయింట్స్ పీటర్ అండ్ పాల్ చర్చ్” లో పరిచర్య చేయడం ప్రారంభించిన అతను, అదే సమయంలో ఇతర మిషనరీ పాఠశాలలలో కూడా బోధించారు. 2001వ సంllలో అధికారికముగా సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన పిమ్మట జ్వలించుచున్న తీవ్రమైన వాంఛ కలిగినవారై అన్యదేవతారాధికులు, ముస్లింలు మరియు నాస్తికవాదులైన కమ్యూనిస్టుల మధ్యలో సేవ చేయడం ప్రారంభించారు. ఎంతో ధైర్యముతో అతను ముస్లింల పండుగలలో కూడుకొనిన సమూహాల యొద్దకు వెళ్ళి వారి భాషలో సువార్త కరపత్రికలను పంచిపెట్టేవారు. అతని పరిచర్య ద్వారా అనేకమంది క్రీస్తు వైపుకు తిరిగారు మరియు మాస్కోలోను, దాని చుట్టుప్రక్కల ప్రాంతములలోను క్రొత్తగా క్రైస్తవ సంఘములు స్థాపించబడ్డాయి. దేవుని వరమును పొందుకొనిన ప్రసంగికులు అయిన డానియేల్, టీవీ కార్యక్రమాలలో మరియు రేడియో ప్రసారాలలో కూడా ప్రసంగించారు. తన యొక్క క్రియారూపకమైన మిషనరీ సేవ మరియు తన పరిచర్య మూలముగా అనేకమంది ముస్లింలు బాప్తిస్మము పొందిన కారణముగా చంపుతామన్న అనేక బెదిరింపులను అతను ఎదుర్కొన్నారు. కాగా 2009వ సంll నవంబరు 19వ తారీఖున, రాత్రి 10:40 గంటలకు ఒక బైబిలు తరగతి ముగించుకొని అతను బయలుదేరబోతున్న సమయంలో ముసుగు ధరించిన ఒక ఇస్లాం మతోన్మాది డానియేల్ యొక్క చర్చిలోనికి ప్రవేశించాడు. చేతిలో తుపాకీతో ఉన్న అతను “సిసోయెవ్ ఎక్కడ?” అని అరిచి, కాల్చడం ప్రారంభించి ఒక గాయక బృంద సభ్యుడిని గాయపరిచాడు. వెంటనే డానియేల్ “నేను ఇక్కడ ఉన్నాను” అని చెప్పి ముందుకు వచ్చారు. ఆ హంతకుని వైపు ధైర్యముగా అడుగులు వేస్తున్న అతనిపై ఆపకుండా కాల్చబడిన అనేక బుల్లెట్లు మరణమయ్యేంతగా అతనిని గాయపరిచాయి. ఆ సంఘటన జరిగిన ఒక గంట తరువాత డానియేల్ సిసోయెవ్ తన ముఖము ఫై ప్రకాశవంతమైన చిరునవ్వుతో ప్రభువునందు నిద్రించారు.



💠💠💠💠💠💠💠💠💠
*ప్రార్థించే తల్లులు*
💠💠💠💠💠💠💠💠💠

🟦🟧🟨🟫🟪🟥🟩⬜️⬛️⬛️⬜️
*అగస్టీన్ తల్లి*

👉 బహు దుర్మార్గుడుగాను, స్త్రీ లోలుడుగాను జీవితాన్ని పాడు చేసుకొంటున్న అగస్టీన్ అను యౌవనస్థుని కొరకు అతని తల్లియైన మోనికా కన్నీటితో మొరపెట్టి రక్షణలోనికి నడిపించుకొనెను. ఆ తరువాత అగస్టీన్ - నా తల్లి కన్నీటి ప్రార్ధనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చితినని సాక్ష్యమిచ్చెను.

🟦🟧🟨🟫🟪🟥🟩⬜️⬛️⬛️⬜️
*జాన్ హస్ తల్లి*

👉జన్ హస్ యొక్క తల్లి మంచి దైవభక్తి కలిగిన ఉత్తమురాలు.ఆమె దేవుని యందు భయభక్తులు ఎలా కలిగియుండవలెనో తన కుమారునికి
నేర్పిస్తూ, అతని కొరకు ప్రార్థించేది. అతని కొరకు అనేకసార్లు రోడ్డు మీదే మోకరించి ప్రార్థించేది. ఆమె ప్రార్థన వల్ల  గొప్ప దైవజనుడు గాను, మత సంస్కర్తగాను జీవించి, చివరికి క్రీస్తు కొరకు హతసాక్షి ఆయెను.

🟦🟧🟨🟫🟪🟥🟩⬜️⬛️⬛️⬜️
*మేరీ స్లేస్సర్ తల్లి*

👉 ఆఫ్రికా దేశానికి మిషనెరీగా వెళ్ళిన మేరీ స్లెస్సర్ తల్లి గొప్ప దైవ భక్తురాలు, ప్రార్థనా పరురాలు. చిన్న వయస్సు నుండి తన బిడ్డకు ఆఫ్రికా దేశములో సువార్త అవసరతను గురించి వివరిస్తూ, యేసు కొరకు సాక్షిగా జీవించాలని బోధించినది. ఆలాగు తల్లి చేతుల్లో మిషనెరీగా తీర్చిదిద్దబడ్డ మేరీ  ఆఫ్రికా దేశానికి వెళ్ళి అనేక ఆత్మలను రక్షించెను.

🟦🟧🟨🟫🟪🟥🟩⬜️⬛️⬛️⬜️
*హడ్సన్ టేలర్ తల్లి*

👉హడ్సన్ టేలర్ తల్లి తన కుమారుడు చిన్న తనంలోనే రక్షించబడాలని ప్రార్థించేది. ఒకరోజు అలా దేవుని ఆత్మచే భారం కలిగి మోకరించి ప్రార్థిస్తుండగా ఎనభై మైళ్ల దూరంలో ఉన్న హడ్సన్ టేలర్, ఇది సమాప్తమాయెను అన్న కరపత్రిక చదివి, తన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించెను. తరువాత చైనాకు మిషనెరీగా వెళ్ళెను.

🟦🟧🟨🟫🟪🟥🟩⬜️⬛️⬛️⬜️
*జాన్ వెస్లీ తల్లి*

👉 జన్ వెస్లీ తల్లియైన సూసన్నా వెస్లీకి తొమ్మిది మంది కుమారులు.ఆమె ప్రతి కుమారునితో ఒక గంటసేపు ప్రార్థనలో గడిపేది. వారందరి రక్షణ కొరకు ప్రార్థించేది. ఆమె ప్రార్థన వల్లనే జాన్ వెస్లీ గొప్ప ఉజ్జీవ ప్రసంగీకుడుగాను,ఛార్లెస్ వెస్లీ గొప్ప గాయకుడుగాను తీర్చిదిద్దబడిరి.

🟦🟧🟨🟫🟪🟥🟩⬜️⬛️⬛️⬜️
*ఆర్.ఏ.టోరీ తల్లి*

👉 ఆర్.ఏ.టోరీ అనే భక్తుని తల్లి తన బిడ్డ దేవుని సేవకుడు అవ్వాలని ప్రార్థించేది గాని, అతడు తాను న్యాయవాది అవ్వాలని విశ్వ విద్యాలయంలో
చేరెను. అయితే చివరికి అతని తల్లి ప్రార్థన వలన అతడు ఆత్మహత్య చేసుకోబోయే సమయంలో దేవునిచే సంధించబడి, రక్షించబడి గొప్ప ఉజ్జీవ ప్రసంగీకుడాయెను.

*“నా దేవా! నా కుటుంబమంతా లేకుండా నేను నీ సన్నిధిలో నిలువలేను ప్రభువా!”* అని విలియం బూత్ భార్యయైన కేథరిన్ బూత్ ప్రార్థించేది. ఆమె ప్రార్థన వల్ల ఆమె బిడ్డలందరూ రక్షించబడి సేవలో వాడబడిరి.

దేవుని వాక్యము సెలవిస్తుంది
విలాపవాక్యములు 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ  మును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లు చున్నారు
ఈ మిషనరీలు వారి జీవితంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగారంటే దానికి కారణం వారి తల్లులు చేసిన ప్రార్థన, దేవునితో వారు కలిగిన సహవాసము వారిని గొప్ప సేవకులుగా తీర్చిదిద్దింది. ఈరోజు నీవు నీ బిడ్డల కొరకు అదే రీతిగా ప్రార్థన చేయగలిగితే వారి జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యములను చేయగలుగుతారు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.. ఆమెన్..!